Betavolt Battery సింగిల్ ఛార్జింగ్‌తో 50 సంవత్సరాల పాటు పనిచేసే బ్యాటరీ..!!
టెక్నాలజీ ప్రపంచంలో ప్రస్తుతం అనేక గ్యాడ్జెట్లు బ్యాటరీ సాయంతో పనిచేస్తున్నాయి. ఈ గ్యాడ్జెట్లకు ప్రతి ఒకటి రెండు రోజులకు ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. అయితే ఈ ఛార్జింగ్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఓ స్టార్టప్ సంస్థ కీలక ముందడుగు వేసింది. బీజింగ్ ఆధారంగా కార్యకలాపాలు సాగిస్తున్న బీటావోల్ట్ సంస్థ (Betavolt Battery) సింగిల్ ఛార్జింగ్‌తో 50 సంవత్సరాలపాటు పనిచేసే బ్యాటరీని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించింది.
సింగిల్ ఛార్జింగ్‌తో 50 సంవత్సరాలు పనిచేస్తుంది : చైనాకు చెందిన బీటావోల్ట్ అనే స్టార్టప్ సంస్థ అటామిక్ బ్యాటరినీ అభివృద్ధి చేస్తోంది. ఈ బ్యాటరీని సింగిల్ ఛార్జింగ్ ద్వారా ఎటువంటి నిర్వహణ లేకుండా 50 సంవత్సరాలపాటు పనిచేస్తుందని సంస్థ చెబుతోంది. BV100 పేరుతో ఈ అటామిక్ (న్యూక్లియర్ బ్యాటరీ)ని అభివృద్ధి చేస్తోంది.

ఎంత సైజులో ఉంటుందంటే : ఈ అటామిక్ బ్యాటరీ సైజ్ ఓ కాయిన్ కంటే చిన్నదిగా ఉంటుందని తెలుస్తోంది. ఈ బ్యాటరీ 63 న్యూక్లియర్ ఐసోటోప్‌లను కలిగి ఉంటుందని సంస్థ చెబుతోంది. నికెల్ 63 ఐసోటోప్, డైమండ్ సెమీ కండక్టర్‌లతో రూపొందిస్తున్నారు. ఈ న్యూక్లియర్ బ్యాటరీ 3V వద్ద 100 మెగావాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
రేడియేషన్ సమస్య ఉంటుందా : ఈ బ్యాటరీలు -60 డిగ్రీల సెల్సియస్ నుంచి 120 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్య పనిచేయగలదని బీటావోల్ట్ స్టార్టప్ సంస్థ తెలిపింది. ఈ బ్యాటరీలు పర్యావరణ అనుకూలంగా ఉంటాయని మరియు ఎటువంటి రేడియేషన్‌ను విడుదల చేయవని సంస్థ చెబుతోంది.

పరీక్షల దశలో బీటావోల్ట్ బ్యాటరీ : అటామిక్ ఎనర్జీని మినియేటరైజేషన్ (సూక్ష్మీకరణ) చేసి ఈ బ్యాటరీని అభివృద్ధి చేస్తోందని సంస్థ తెలిపింది. ఈ తరహా బ్యాటరీ ప్రపంచంలోనే తొలిసారిగా బీటావోల్ట్ అభివృద్ధి చేస్తోందని తెలిపింది. ప్రస్తుతం ఈ న్యూక్లియర్ బ్యాటరీ పరీక్షల దశలో ఉందని సంస్థ తెలిపింది.
అయితే ఈ న్యూక్లియర్ బ్యాటరీని ఆర్టిఫిషియల్ ఇంజెలిజెన్స్ ఆధారిత పరికరాలు, చిన్న డ్రోన్లు, మైక్రో రోబోలు, ఏరో స్పేస్, అంతరిక్ష నౌకలు, నీటి అడుగుల ఉపయోగించే ఉపకరణాలు వంటి పరికరాల్లో ఉపయోగించవచ్చని తెలిపింది. ఫేస్ మేకర్లు వంటి పరికరాల్లోనూ వినియోగించవచ్చని పేర్కొంది. పూర్తి స్థాయిలో పరీక్షల అనంతరం 2025 నాటికి ఒక వాట్ ఉత్పత్తి చేసే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సంస్థ పేర్కొంది.
అయితే ఈ బ్యాటరీలు స్మార్ట్‌ఫోన్ల వంటి ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లలో ఉపయోగించుకోవడంపై సంస్థ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే ఎక్కువ సమయంలో బ్యాటరీ లైవ్‌ను ఇచ్చే బ్యాటరీలను తయారు చేసేందుకు ఇప్పటికే చాలా సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటిలో చాలా వరకు అభివృద్ధి మరియు టెస్టింగ్ దశలో ఉన్నాయని తెలుస్తోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








