డేంజర్ కాల్... ఫోన్ ఎత్తితే గోవిందా గోవింద?

Posted By: Staff

డేంజర్ కాల్... ఫోన్ ఎత్తితే గోవిందా గోవింద?

 

+375తో మొదలయ్యే ఫోన్ నెంబర్ నుంచి మీ మొబైల్‌కు మిస్ కాల్ వచ్చిందా..?, జాగ్రత్త! ఆ కాల్‌కు తిరిగి స్పందించే ప్రయత్నం చెయ్యకండంటూ పలువరు ఫేస్‌బుక్‌లో సందేశాలను పోస్ట్ చేశారు. ఆ మిస్ కాల్‌కు ప్రతిస్పందించటం కారణంగా సెకన్ల వ్యవధిలోనే రూ.15 నుంచి రూ.30 వరకు బ్యాలన్స్ కొల్పోవటంతో పాటు ఫోన్‌బుక్‌లోని వివరాలు కాపీ చెయ్యబడతాయన్న ప్రచారం జోరందుకుంది. అయితే ఈ రూమర్లను ఐటీ నిపుణులు ఒకరు ఖండించారు. హ్యాక్ చెయ్యకుండా ఫోన్‌లోని పూర్తి వివరాలను కాపీ చెయ్యటం సాధ్యంకాదని స్పష్టం చేశారు. +375 అనేక బిలారస్ అనే దేశానికి అంతర్జాతీయ కోడ్ కావటంతో బ్యాలన్స్ అంత పెద్ద మొత్తంలో ఛార్జ్ చెయ్యబడుతుందని వెల్లడించారు. ఏదేమైనప్పటికి కొత్త నెంబర్లతో జాగ్రత్తగా ఉండటం మంచింది.

ఫేస్‌బుక్ అప్లికేషన్ సెంటర్!

ఇటీవల ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ సరికొత్త అప్లికేషన్ సెంటర్‌ను లాంచ్ చేసింది. టాబ్లట్ అదేవిధంగా స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ స్టోర్‌లో సుమారు 600 అప్లికేషన్‌లను పొందుపరిచారు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్(గుగూల్), ఐవోఎస్ (ఆపిల్) ఆపరేటింగ్ సిస్టంలను ఈ అప్లికేషన్ స్టోర్‌ సపోర్ట్ చేస్తుంది. విండోస్ మొబైల్ వర్షన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. శుక్రవారం నుంచి ఈ సేవలు యూఎస్‌లో అందుబాటులోకి వచ్చాయి. మరి కొద్ది వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్ అప్లికేషన్ స్టోర్ సేవలు విస్తరించనున్నాయి.

ఫేస్‌బుక్.కామ్‌లో ఈ అప్లికేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సామాజిక నెట్‌వర్కింగ్ వ్యవస్థలో ఓ భాగమై పనిచేసే ఈ అప్లికేషన్ సెంటర్ ద్వారా వివిధ రకాలైన వెబ్ అప్లికేషన్‌లతో పాటు నేటివ్ అప్లికేషన్‌లను యూజర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సోషల్ నెట్‌వర్కింగ్ హక్కు కింద వినియోగదారు ఈ అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకోవటం లేదా ప్లే చెయ్యటం జరుగుతుంది. ఫేస్‌బుక్ ఏర్పాటు చేసిన ఈ అప్లికేషన్ సెంటర్ సౌలభ్యతతో ఎక్కువ డిమాండ్ లేదా ప్రజాదరణ ఉన్న అప్లికేషన్‌లను యూజర్ గుర్తించి తద్వారా తన అభిరుచులకు అనువైన వాటిని ఎంపిక చేసుకునేందుకు వెసలబాటు ఉంటుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting