పీఎఫ్ విత్‌డ్రా సమయంలో ఈ తప్పు అస్సలు చేయవద్దు
ప్రొవిడెంట్ ఫండ్..ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరి ఉద్యోగ చివరి దశలో ఎంతో మేలు చేస్తుంది..అయితే,పీఎఫ్ ఉన్న వారు తమ అకౌంట్ నుండి ఎలా డబ్బులు తీసికోవాలి అనేది అంతగా అవగాహన ఉండక పోవచ్చు. ఈపీఎఫ్… ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్. ఈ ఫండ్‌లో మీ జీతంలోంచి నెలనెలా కొంత మొత్తం మీరు చేసే పొదుపు భవిష్యత్తులో మీకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది.

అత్యవసర సమయంలో ఆదుకుంటుంది.ఖాతాదారుల సౌలభ్యం కోసం పీఎఫ్‌ను ఆన్‌లైన్‌లోనే విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ -EPFO. మీరు ఉద్యోగం చేస్తుండగానే మీ పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకోవచ్చు. మొత్తం విత్‌డ్రా చేయాలంటే మూడు సందర్భాల్లోనే సాధ్యం. రిటైర్మెంట్ తర్వాత, రెండు నెలలు ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నా, రిటైర్మెంట్ కన్నా ముందే చనిపోతే నామినీ విత్‌డ్రా చేసుకోవచ్చు.పిల్లల పైచదువులు, ఆస్తి కొనుగోలు, ఇంటి నిర్మాణం, పెళ్లి, హోమ్ లోన్ చెల్లింపు లాంటి కారణాలతో పాక్షికంగానే విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే విత్ డ్రా సమయంలో చాలామంది కొన్ని తప్పులు చేస్తుంటారు. రెండు యుఎఎన్ అకౌంట్లు మెయింటెన్ చేస్తుంటారు. అలాంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.

- రెండు యూఏఎన్ నెంబర్లను - కొత్త యూఏఎన్ తీసుకుంటే.. కొత్త కంపెనీ పాస్‌బుక్, పీఎఫ్ అకౌంట్ లావాదేవీలను మాత్రమే చూడగలుగుతాం. రెండు యూఏఎన్ నెంబర్లు కలిగి ఉండటం వల్ల అకౌంట్ వివరాలు పొందడం కూడా క్లిష్టతరమౌతుంది. అందుకే రెండు యూఏఎన్ నెంబర్లను మెర్జ్ చేసుకోవాలి. అయితే ఇది సాధ్యమేనా? సాధ్యమౌతుంది. రెండు యూఏఎన్ నెంబర్లను విలీనం కలిపేసుకోచ్చు.
- పాత యూఏఎన్‌ను బ్లాక్ ముందుగా మీరు పనిచేస్తున్న కంపెనీకి యూఏఎన్ సమాచారం ఇవ్వండి. అలాగే ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌లోనూ సమాచారాన్ని అప్‌డేట్ చేసుకోవాలి. [email protected]కు రెండు యూఏఎన్ నెంబర్ల గురించి చెబుతూ మెయిల్ చేయండి. అధికారులు మీ యూఏఎన్ నెంబర్లను చెక్ చేసి, పాత యూఏఎన్‌ను బ్లాక్ చేస్తారు. తర్వాత పాత పీఎఫ్ డిపాజిట్‌ను కొత్త అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోండి.
- కొత్త దానికి మార్చుకోవడానికి దరఖాస్తు మరో మార్గంలో ముందుగా మెంబర్ ఈపీఎఫ్ అమౌంట్‌ను పాత ఈపీఎఫ్ అకౌంట్ నుంచి కొత్త దానికి మార్చుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలి. ఈపీఎఫ్‌వో ఓటీసీపీ పోర్టల్‌లో (EPF Online Transfer Claim Portal) అప్లై చేసుకోవచ్చు. తర్వత పనులన్నీ ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి. ఈపీఎఫ్ ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత పాత యూఏఎన్ బ్లాక్ అవుతుంది. పాత మెంబర్ ఐడీ కొత్త యూఏఎన్‌కు లింక్ అవుతుంది. డీయాక్టివేట్ స్టేటస్ ఎస్ఎంఎస్ రూపంలో మీకు వస్తుంది.

ఆన్‌లైన్‌లో పీఎఫ్ విత్‌డ్రా చేయడం ఎలా ?
ముందుగా మీరు EPFO అధికారిక వెబ్‌సైట్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ ఓపెన్ చేయాలి.UAN, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయాలి.
మెంబర్ ప్రొఫైల్ పేజీలో 'Manage’ ట్యాబ్‌పైన క్లిక్ చేయాలి.
డ్రాప్‌డౌన్ మెనూ నుంచి KYC సెలెక్ట్ చేయాలి తర్వాతి పేజీలో 'Online Services’ క్లిక్ చేయాలి.
డ్రాప్-డౌన్ లిస్ట్‌లో 'Claim Form-31,19 & 10C ఎంచుకోవాలి.
మీ బ్యాంక్ అకౌంట్‌లోని చివరి నాలుగు అంకెల్ని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.
తర్వాతి పేజీలో ఆన్‌లైన్ క్లెయిమ్‌కు అనుమతి ఇవ్వాలి.
మీ కేవైసీ వివరాలను ఈపీఎప్ఓ సేకరించి ఆన్‌లైన్ పీఎఫ్ క్లెయిమ్‌ను ప్రాసెస్ చేస్తుంది.
ఆన్‌లైన్ పీఎఫ్ క్లెయిమ్ ప్రాసెస్ పూర్తైతే 10 రోజుల్లో మీ అకౌంట్‌లో డబ్బులు క్రెడిట్ అవుతాయి.
ఆన్‌లైన్‌లో పీఎఫ్ క్లెయిమ్ చేసుకోవడానికి ముందు మీ కేవైసీ వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి.


Click it and Unblock the Notifications