Home
News

కోవిన్ వ్యాక్సిన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పేరుతో మోసాలు!! జాగ్రత్త వహించండి

భారతదేశంలో కరోనా తీవ్రత అధికమవుతున్న సందర్భంగా ఈ నెల మొదటి వారం నుంచి ప్రభుత్వం 18-45 సంవత్సరాల వయసు వారికి కోవిడ్ -19 టీకాను వేసుకోవలసిందిగా ఆదేశాలను జారీ చేసింది. వ్యాక్సిన్ ప్రక్రియను బుక్ చేసుకోవడం కోసం ఆన్‌లైన్‌లో అనుమతి ఉంది. దీనిని ఆసరాగా తీసుకున్న స్కామర్లు ఇప్పుడు వ్యాక్సిన్ స్లాట్‌ను పొందడంలో సహాయం చేస్తామని హామీ ఇవ్వడం ద్వారా బ్యాంకింగ్ వివరాలతో సహా యూజర్ల యొక్క వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయడం వంటి మోసపూరితమైన వాటికి ప్రయత్నిస్తున్నారు.

వ్యాక్సిన్

దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ల కొరత ఉన్నందున టీకా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడం కష్టం అవుతున్నది. స్కామర్లు దీనిని తమ ప్రయోజనం కోసం ఉపయోగిస్తున్నారు. కోవిన్‌లో కోవిడ్ వ్యాక్సిన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన కొన్ని మోసాల గురించి వివరంగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

కోవిన్ వెబ్‌సైట్‌లో టీకా స్లాట్‌ను పొందడానికి యాదృచ్ఛిక కాల్‌లు పొందడం

కోవిన్ వెబ్‌సైట్‌లో టీకా స్లాట్‌ను పొందడానికి యాదృచ్ఛిక కాల్‌లు పొందడం

కోవిన్ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేసుకోవడానికి మరియు వ్యాక్సిన్ అపాయింట్‌మెంట్‌ను పొందడంలో మీకు సహాయపడటానికి ప్రభుత్వం తరపున వ్యక్తులు లేదా NGO ఆఫర్‌ల పేరుతో మీకు కాల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటుగా సహాయం పేరిట ఇవి కొన్నిసార్లు నేరుగా డబ్బును కూడా అడుగుతారు. లేదా పాస్‌వర్డ్‌లను దొంగిలించడానికి బాధితులకు వారి ఫోన్‌లలో ఎనీడెస్క్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి రిమోట్ డెస్క్‌టాప్ యాప్ లను డౌన్‌లోడ్ చేయమని చెబుతాయి. ఈ పాస్‌వర్డ్‌లు తరువాత బ్యాంకు అకౌంట్ల నుండి డబ్బును దొంగిలించడానికి ఉపయోగించవచ్చు.

వ్యాక్సిన్ నమోదు చేయడం కోసం యాప్లను డౌన్‌లోడ్ చేయమని అడిగే SMS

వ్యాక్సిన్ నమోదు చేయడం కోసం యాప్లను డౌన్‌లోడ్ చేయమని అడిగే SMS

మీరు ఒక నిర్దిష్ట APK ఫైల్ లేదా యాప్ ను డౌన్‌లోడ్ చేయమని చెప్పే ఏదైనా SMS ను చూస్తే కనుక అది నకిలీదని మరియు మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి ఉద్దేశించినదని తెలుసుకోండి. మీరు అధికారిక ఆరోగ్య సేతు యాప్ ద్వారా లేదా కోవిన్ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మాత్రమే టీకా స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు.

మీ వ్యాక్సిన్ బుక్ చేయబడ్డాయి అని చెప్పుకునే వాట్సాప్ మెసేజ్లు

మీ వ్యాక్సిన్ బుక్ చేయబడ్డాయి అని చెప్పుకునే వాట్సాప్ మెసేజ్లు

వాట్సాప్ మరియు ఇతర ప్లాట్‌ఫామ్‌లలో కొత్త రకం మెసేజ్ లు ప్రసారం అవుతోంది. ఇందులో సమాచారం విషయానికి వస్తే మీ కోసం ‘ముందే బుక్ చేసుకున్న' టీకా స్లాట్‌ను నిర్ధారించడానికి డబ్బు చెల్లించమని అడుగుతు ఉంటుంది. ఈ మెసేజ్ పేమెంట్ లింక్‌తో వస్తుంది. ఈ లింక్ సాధారణంగా మీ బ్యాంకింగ్ వివరాలను దొంగిలించడానికి చేసే ఫిషింగ్ ప్రయత్నం. పేమెంట్ లేదా వ్యాక్సిన్ నమోదుకు సంబంధించి వాట్సాప్ లేదా మరే ఇతర ప్లాట్‌ఫామ్‌తో అధికారిక భాగస్వామ్యం లేదని గమనించండి. కాబట్టి మీరు వాట్సాప్‌లో వచ్చే అలాంటి మెసేజ్ ను విస్మరించండి.

కోవిన్ ప్లాట్‌ఫామ్‌

*** కోవిన్ ప్లాట్‌ఫామ్‌లో ధృవీకరించబడిన వ్యాక్సిన్ స్లాట్‌లను అందిస్తున్నట్లు పేర్కొంటూ మూడవ పార్టీ యాప్లను డౌన్‌లోడ్ చేయమని మిమ్మల్ని ఆకర్షించే ఇమెయిల్‌ల పట్ల జాగ్రత్త వహించండి. ఈ యాప్ లు ఎక్కువగా మాల్వేర్ ను కలిగి ఉండే అవకాశం ఉంటుంది.

*** రిజిస్టర్డ్ పౌరులకు మాత్రమే వ్యాక్సిన్ వచ్చేలా ప్రభుత్వం కోవిన్ ప్లాట్‌ఫాంపై 4 అంకెల కోడ్ ను ప్రవేశపెట్టింది. ఈ కోవిన్ 4-అంకెల కోడ్ ను టీకా కేంద్రంలో అధీకృత సిబ్బందితో తప్ప మరెవరితోను షేర్ చేయవద్దు. ఈ కోడ్ గురించి ఏ ప్రభుత్వ అధికారి మిమ్మల్ని ఫోన్ ద్వారా అడగరు.

*** టీకా కోసం రిజిస్ట్రేషన్ కోవిన్ వెబ్‌సైట్ లేదా ఆరోగ్య సేతు యాప్‌లో మాత్రమే చేయవచ్చు. కాబట్టి టీకా స్లాట్‌ను పరిష్కరించడానికి మీకు ‘సహాయం' చేయగలమని చెప్పుకునే మెసేజ్లు లేదా వ్యక్తుల మాటలు వినకండి.

*** కోవిడ్ వ్యాక్సిన్ కోసం మిమ్మల్ని రిజిస్టర్ చేయమని మరియు డబ్బు లేదా బ్యాంక్ వివరాలను అడగడానికి ఏ అధికారిక బ్యాంకు లేదా ప్రభుత్వ ఉద్యోగి మీకు ఫోన్ చేయరు. మీకు అలాంటి కాల్స్ వస్తే కనుక వారు మిమ్మల్ని స్కామ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని గమనించండి.

 

Best Mobiles in India

English summary
Beware of CoWin Vaccine Online Registration Related Scams: Here are The Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X