పడకగదిలోని దృశ్యాలు ఇంటర్నెట్‌లోకి, చాలా జాగ్రత్త మరి !

నేడు కెమెరాలు పడకగదిలోకి సైతం దూరిపోయి ఆ సన్నివేశాన్ని నెట్టింట్లోకి తీసుకువస్తున్నాయి.

|

నేడు కెమెరాలు పడకగదిలోకి సైతం దూరిపోయి ఆ సన్నివేశాన్ని నెట్టింట్లోకి తీసుకువస్తున్నాయి. మూడో నేత్రం ఎప్పుడు ఎక్కడ ఎలా వెంటాడుతుందో గుర్తించడం ఇప్పుడు కష్టమైపోయింది. పెరిగిపోతున్న పోర్న్ మార్కెట్.. తెలివిమీరుతున్న సైబర్ నేరగాళ్లు.. వెరసి అమాయక దంపతుల పడక గది దృశ్యాలు నెట్టింట్లో దర్శనమిస్తున్నాయి. కొన్ని సందర్బాల్లో కాసులకు కక్కుర్తిపడి.. కట్టుకున్న భర్తలే పడకగది దృశ్యాలను ఆన్‌లైన్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న ఉదంతాలు బయటపడుతున్నాయి. గతేడాది జీడిమెట్లలో 33 33ఏళ్ల ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ ఇలాంటి దురాగతానికే ఒడిగట్టిన సంగతి తెలిసిందే. వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చందమామపై నీటి జాడలు, గుట్టు విప్పిన నాసా, క్రెడిట్ ఇండియాదేచందమామపై నీటి జాడలు, గుట్టు విప్పిన నాసా, క్రెడిట్ ఇండియాదే

వెబ్ క్యామ్'తో జాగ్రత్త

వెబ్ క్యామ్'తో జాగ్రత్త

వెబ్ క్యామ్'తో జాగ్రత్త..: సైబర్ నేరాలను దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఓ కొత్త విషయాన్ని ఇటీవలే కనిపెట్టారు. దంపతుల ప్రమేయం లేకుండా.. వారి పడకగది దృశ్యాలు అశ్లీల సైట్లకు ఎలా చేరుతున్నాయో గుర్తించారు.

పడకగది దృశ్యాలను..

పడకగది దృశ్యాలను..

ఇందుకోసం 'వెబ్ క్యామ్'నే సైబర్ నేరగాళ్లు ఆయుధంగా మలుచుకున్నారు. అది ఆన్ లో ఉన్నా.. లేకపోయినా.. పడకగది దృశ్యాలను చిత్రీకరించేలా టెక్నాలజీని వారు వాడుకుంటున్నారు.

ఫ్రీ'కి ఆకర్షితులైతే అంతే..:

ఫ్రీ'కి ఆకర్షితులైతే అంతే..:

 ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసేటప్పుడు చాలాసార్లు 'ఫ్రీ' డౌన్ లోడ్ ఆప్షన్స్ మనకు కనిపిస్తుంటాయి. ఉచితమే కదా అని చాలామంది వాటికి ఆకర్షితులై డౌన్ లోడ్ చేసుకుంటారు.

డౌన్ లోడ్ చేసుకున్న యాప్స్/సాంగ్స్/వీడియోలతో పాటు..
 

డౌన్ లోడ్ చేసుకున్న యాప్స్/సాంగ్స్/వీడియోలతో పాటు..

కానీ వారు గుర్తించని విషయమేంటంటే.. వారు డౌన్ లోడ్ చేసుకున్న యాప్స్/సాంగ్స్/వీడియోలతో పాటు మాల్‌వేర్ వైరస్ కూడా కంప్యూటర్ లో వచ్చి చేరుతుంది. ఆ వైరస్ చేరిన వెంటనే.. కంప్యూటర్ మొత్తం సైబర్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోతుంది.

'క్యామ్' హ్యాక్

'క్యామ్' హ్యాక్

ఎక్కడినుంచైనా 'క్యామ్' హ్యాక్ చేస్తారు: కంప్యూటర్ ఆన్‌లో ఉన్న సందర్భంలో బెడ్రూమ్‌లో భార్యభర్తలు సన్నిహితంగా మెలిగిన, ఏకాంతంగా గడిపిన దృశ్యాలు వెబ్ క్యామ్ ద్వారా నెట్టింట్లోకి ఎక్కే ప్రమాదముంది. వెబ్ క్యామ్ ఆన్‌లో లేదు కదా అని కొట్టిపారేయడానికి లేదు.

మాల్‌వేర్ వైరస్..

మాల్‌వేర్ వైరస్..

ఎందుకంటే.. మాల్‌వేర్ వైరస్ మీ కంప్యూటర్‌లో గనుక నిక్షిప్తమై ఉంటే.. ఎక్కడినుంచైనా సరే సైబర్ నేరగాళ్లు దాన్ని ఆన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 'వెబ్ క్యామ్' పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సందర్భం వచ్చింది.

ఏం చేయాలి?:

ఏం చేయాలి?:

వెబ్ క్యామ్ ఆన్‌లో ఉందా?.. ఆఫ్ మోడ్‌లో ఉందా? అన్నది తెలుసుకోవడం కష్టమైపోయింది కాబట్టి.. దానితో పని అయిపోయాక, ఏదైనా కవర్‌తో కప్పేసి ఉంచడం మేలు అంటున్నారు నిపుణులు.

వీలైనంతవరకు..

వీలైనంతవరకు..

అంతేగాక, వీలైనంతవరకు ఉచితంగా దొరికే వాటికి ఆకర్షితమవకుండా.. యాంటీ వైరస్‌లను డౌన్ లోడ్ చేసుకుంటే బెటర్ అంటున్నారు.

Best Mobiles in India

English summary
Beware of creepware: your webcam might be spying on you more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X