Fake Passport Website: పాస్‌పోర్ట్ నకిలీ వెబ్‌సైట్లతో జాగ్రత్త!!!

|

పాస్‌పోర్ట్ పొందడం అనేది ఇప్పుడు చాలా సులభం అవుతోంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం ద్వారా పాస్‌పోర్టులను త్వరగా పొందవచ్చు. చదువులకోసం లేదా ఎక్కువగా సంపాదించాలనే ఆశతోనో చాలా మంది విదేశాలకు వెళ్తుంటారు. విదేశాలకు వెళ్ళడానికి పాస్‌పోర్టు ఖచ్చితంగా అవసరం ఉంటుంది. దీనినే ఆసరాగా తీసుకున్న కేటుగాళ్లు మోసాలకు తెగిస్తున్నారు.

సైబర్ నేరగాళ్లు
 

ఆన్ లైన్ ద్వారా పాస్‌పోర్టును పొందాలనే తొందరలో మనం చాలా మోసపోతున్నాము. సైబర్ నేరగాళ్లు పాస్‌పోర్టు యొక్క వెబ్‌సైటును పోలి ఉండే నకిలీ వెబ్‌సైట్లను మరియు మొబైల్ యాప్ లను ఇప్పుడు ఆన్ లైన్ లో విడుదల చేసారు. మీరు పొరపాటున అందులో మీ యొక్క సమాచారం అందించినట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ పూర్తిగా కాలి అవుతుంది. కావున నకిలీ వెబ్‌సైట్ల గురించి జాగ్రత్తగా ఉండాలని భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ హెచ్చరిస్తోంది.

Airtel Xstream Fibre: RS.699లకే అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తున్న ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్

పాస్‌పోర్ట్

పాస్‌పోర్ట్ సంబంధిత సేవలను అందిస్తున్నట్లు చెప్పుకునే నకిలీ వెబ్‌సైట్లలో స్థిరమైన పెరుగుదల ఉన్నందున పాస్‌పోర్టులను దరఖాస్తు చేసుకునేటప్పుడు లేదా రెన్యూవల్ చేసెటప్పుడు జాగ్రత్తగా ఉండాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రజలను హెచ్చరిస్తోంది. ఈ నకిలీ వెబ్‌సైట్లు అధిక మొత్తంలో ఫీజులను వసూలు చేయడమే కాకుండా దరఖాస్తుదారుల యొక్క కీలకమైన వ్యక్తిగత సమాచారంను కూడా సేకరిస్తాయి.

RS.200 రేంజ్ ప్రీపెయిడ్ ప్లాన్‌లలో రోజుకు 1.5GB డేటాను అందించే టెల్కోలు

వెబ్‌సైట్లు

అనేక రకాల నకిలీ వెబ్‌సైట్లు విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పుకునే మొబైల్ యాప్ ల సంఖ్య కూడా పెరుగుతోంది. పాస్‌పోర్ట్ సేవలకు అధికారికంగా ఉన్నది ఒకే ఒక వెబ్‌సైట్ "passportindia.gov.in". కొన్నిసార్లు ఇది "portal2.passportindia.gov.in" గా ఓపెన్ అవుతుంది. కానీ రెండింటి డొమైన్ మాత్రం ఎల్లప్పుడూ gov.in గా ఉంటుంది. కొన్ని రోజుల క్రితం ఆండ్రాయిడ్ మరియు iOS రెండింటిలోను పాస్‌పోర్ట్ యొక్క అధికారిక యాప్ "mPassport Seva" అందుబాటులోకి వచ్చింది.

క్రెడిట్ కార్డ్ యొక్క లిమిట్ పెంచడం ఎలా?

నకిలీ వెబ్‌సైట్లు
 

పాస్‌పోర్టులను దరఖాస్తు చేసుకోవడానికి ఇప్పుడు ఆన్ లైన్ లో చాలా రకాల నకిలీ వెబ్‌సైట్లు పుట్టుకొస్తున్నాయి. కావున పౌరులు ఎవరైనా సరే ఆన్ లైన్ ద్వారా పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేస్తూవుంటే కనుక కింద తెలిపే ఈ వెబ్‌సైట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని మంత్రిత్వ శాఖ హెచ్చరిస్తోంది.

ఆన్‌లైన్‌ ద్వారా ఇ-పాన్ పొందడం ఎలా?

నకిలీ వెబ్‌సైట్లు

నకిలీ వెబ్‌సైట్లు

1. indiapassport.org

2. online-passportindia.com

3. passportindiaportal.in

4. passport-india.in

5. passport-seva.in

6. applypassport.org

Most Read Articles
Best Mobiles in India

English summary
Beware of Fake Passport Website

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X