Netflix పేరుతో కొత్త స్కామ్!!! ఇటువంటి మెయిల్ వచ్చిందా జాగ్రత్త...

|

ఇండియాలో లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఆన్‌లైన్ మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రతి రోజు ఎక్కడో ఒకచోట ఆన్‌లైన్ మోసాల గురించి వింటూ ఉంటారు. సైబర్ నేరగాళ్లు కూడా ఈ సమయంలో ఎక్కువగా రెచ్చిపోతున్నారు. ఆన్‌లైన్ మోసాలు తరచుగా చాలా మందిని ప్రభావితం చేస్తున్నాయి. అనేక ఫిషింగ్ కేసులలో భాగంగా వినియోగదారుల క్రెడిట్ కార్డ్ వివరాలు వంటి ముఖ్యమైన సమాచారాన్ని దొంగిలించే కొత్త నెట్‌ఫ్లిక్స్ ఫిషింగ్ స్కామ్ ఇప్పుడు బయటపడింది. ఈ ఫిషింగ్ స్కామ్ ఎలా పనిచేస్తుందో మరియు దీని నుండి మీరు ఎలా సురక్షితంగా ఉండాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

నెట్‌ఫ్లిక్స్ ఫిషింగ్ స్కామ్ మెయిల్

నెట్‌ఫ్లిక్స్ ఫిషింగ్ స్కామ్ మెయిల్

నెట్‌ఫ్లిక్స్ యొక్క కొత్త క్రెడెన్షియల్ ఫిషింగ్ స్కామ్ కారణంగా కొంతమంది వినియోగదారులు వారి బిల్లింగ్ వైఫల్య సమస్యకు సంబంధించి ఇమెయిల్‌లను స్వీకరించారు. వినియోగదారుల నెట్‌ఫ్లిక్స్ సభ్యత్వాన్ని 24 గంటల్లో రద్దు చేస్తామని మరియు యాక్టీవేషన్ కొరకు కింద ఉన్న లింక్ నొక్కండి అని ఈమెయిల్ పేర్కొంది. దీనివల్ల చాలా మంది వారి పేమెంట్ వివరాలను పూర్తి చేయడానికి లింక్‌ను నొక్కారు. ఫిషింగ్ దాడి యొక్క మొదటి దశ ఇది. దీనిలో హ్యాకర్ తన చతురతను ప్రారంభించాడు.

నెట్‌ఫ్లిక్స్ నకిలీ వెబ్‌సైట్

నెట్‌ఫ్లిక్స్ నకిలీ వెబ్‌సైట్

వినియోగదారుడికి పంపిన ఇమెయిల్‌లో ఉన్న లింక్‌పై క్లిక్ చేసిన వెంటనే హ్యాకర్ వినియోగదారుల వివరాలను సేకరించడం ప్రారంభించారు. వినియోగదారులు లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత అతడు లేదా ఆమె ఫిషింగ్ ప్రవాహంతో నెట్‌ఫ్లిక్స్ డ్యూప్ వెబ్‌సైట్‌లోకి వెళ్లారు. తరువాత వినియోగదారుల యొక్క తమ నెట్‌ఫ్లిక్స్ లాగిన్ ఆధారాలు, బిల్లింగ్ చిరునామా మరియు క్రెడిట్ కార్డ్ వివరాలను నమోదు చేయమని కోరారు. పూర్తయిన తర్వాత అతన్ని లేదా ఆమెను అసలు నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సైట్‌కు తీసుకువెళ్లారు. తరువాత ఫిషింగ్ ప్రవాహాన్ని పూర్తి చేస్తారు. ఈ విధంగా వినియోగదారులు తెలియకుండానే తమ కార్డు సమాచారం ఇచ్చి ఫిషింగ్ కుంభకోణానికి గురయ్యారు.

నెట్‌ఫ్లిక్స్ ఫిషింగ్ స్కామ్ నకిలీ వెబ్‌సైట్ వివరాలు
 

నెట్‌ఫ్లిక్స్ ఫిషింగ్ స్కామ్ నకిలీ వెబ్‌సైట్ వివరాలు

నెట్‌ఫ్లిక్స్ యొక్క ఫిషింగ్ సెటప్ లో గమనించదగ్గ కొన్ని విషయాలు భద్రతా నియంత్రణలను అధిగమించగలిగిన మార్గం. ఇది కొన్ని కారణాల వల్ల మొదట వినియోగదారులను అసలైన నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సైట్‌కు తీసుకెళ్లే ముందు హ్యాకర్లు పూర్తిగా నిజమైన నెట్‌ఫ్లిక్స్ లాగా పనిచేసే CAPTCHA పేజీకి మళ్ళించడం. నెట్‌ఫ్లిక్స్ యొక్క CAPTCHA పేజీ ప్రక్రియ ప్రామాణికమైనదిగా కనిపించింది. రెండవది CAPTCHA పేజీ మరియు నెట్‌ఫ్లిక్స్ సైట్ రెండూ చట్టబద్ధమైన డొమైన్‌లపై హోస్ట్ చేయబడ్డాయి. కావున ఇది దాడి చేసేవారికి భద్రతా ఫిల్టర్‌లను అధిగమించడంలో సహాయపడింది.

నెట్‌ఫ్లిక్స్ ఫిషింగ్ స్కామ్ వివరాలు

నెట్‌ఫ్లిక్స్ ఫిషింగ్ స్కామ్ వివరాలు

నిజమైనదిగా కనిపించే నకిలీ నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సైట్ సోషల్ ఇంజనీరింగ్‌తో ఇవన్నీ అగ్రస్థానంలో ఉన్నాయి. అయినప్పటికీ నకిలీ వెబ్‌సైట్‌లో నీడ్ హెల్ప్, ఫేస్‌బుక్ లాగిన్ ఆప్షన్ వంటి అదనపు ఎంపికలు ఉన్నాయి. ఈ ఎంపికలు అసలు వెబ్‌సైట్‌లో అందుబాటులో లేవు.

నెట్‌ఫ్లిక్స్ ఫిషింగ్ స్కామ్ నుండి బయటపడే మార్గాలు

నెట్‌ఫ్లిక్స్ ఫిషింగ్ స్కామ్ నుండి బయటపడే మార్గాలు

మీరు ఎప్పుడైనా ఇలాంటి ఇమెయిల్‌ను చూసినట్లయితే దాన్ని ఓపెన్ చేయడం లేదా దానిలోని లింక్‌పై క్లిక్ చేయడం వంటివి మానుకోండి. ఇలాంటి ఉచ్చులో పడే ముందు నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సైట్‌కు వెళ్లి మీ పెమెంట్స్ వివరాలను తనిఖీ చేసుకొని ధృవీకరించడం మంచిది.

Best Mobiles in India

English summary
Beware of Netflix New scam: Netflix Steal Users Card Credentials

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X