మిస్సుడ్ కాల్ భాగోతం.. లక్షకు చేరిన బాధితుల సంఖ్య?

Posted By: Staff

మిస్సుడ్ కాల్ భాగోతం.. లక్షకు చేరిన బాధితుల సంఖ్య?

మొబైల్ యూజర్లు జాగ్రత్త!.. ఆధునిక పరిజ్ఞానాన్నిఆసరాగా చేసుకుని గుర్తుతెలియని అగంతకులు సిమ్ కార్డులను క్లోనింగ్ చేస్తున్నారు. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ వంటి ప్రముక టెలికామ్ ఆపరేటర్లు తమ వినియోగదారులను అప్రమత్తం చేసాయి.

వినియోగదారులు పలు సూచనలు...

#90, +92, #09 వంటి ప్రారంభ సంఖ్యతో వచ్చిన మిస్సుడ్ కాల్స్‌కు స్పందించకండి. ఎవరో తెలసుకోవాలన్న ఆత్రుతతో తిరిగి స్పందించే ప్రయత్నం చేస్తే మీ సిమ్‌కార్డ్ చోరికి గురయ్యే ప్రమాదముంది. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు ఇప్పటి వరకు ఆగంతకుల ఉచ్చులో లక్ష మంది వినియోగదారులు ఇరుక్కున్నట్లు సమాచారం.

ఆ కాల్‌కు తిరిగి స్పందిస్తే ఏం జరుగుతుంది?

ఆ డేంజర్ కాల్‌కు తిరిగి స్పందించిన వెంటనే.. కాల్ సెంటర్ ప్రతినిధినంటూ ఒక వ్యక్తి మీతో మాట్లాడటం ప్రారంభిస్తారు. మీ సిమ్‌కార్డ్ కనెక్టువిటీ స్థాయిని పరీక్షించాల్సి ఉందని #90 లేదా #09 సంఖ్యను ప్రెస్ చెయ్యమని ఆదేశిస్తారు. వారి మాటలను నమ్మి ఆ సంఖ్యను ప్రెస్‌చేస్తే ఫోన్‌లోని కీలక సమాచారం కాపీ కాబడుతుంది. క్లోనింగ్ కాబడిన సదరు వ్యక్తి సిమ్ కార్డును ఆగంతకులు ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting