Home
News

Whatsapp Scam: ఇంటి వద్ద ఉండి రోజుకు రూ.5000 సంపాదించే అవకాశం!! మోసపోకండి...

వాట్సాప్ మెసేజ్ ప్లాట్‌ఫారమ్‌లో తప్పుడు సమాచారం మరియు మోసపూరిత లింక్‌లను వ్యాప్తి చేయకుండా నిరోధించడానికి కంపెనీ రక రకాల చర్యలు తీసుకున్నప్పటికీ వాట్సాప్ ద్వారా ఇప్పటికి ఇంకా మోసాలు కొనసాగుతున్నాయి. స్కామర్లు ప్రజలను మోసగించడానికి కొత్త కొత్త మార్గాలను మరియు కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. తక్షణ మెసేజ్ యాప్ వాట్సాప్ లో ప్రసారం చేయబడుతున్న మెసేజ్ విషయానికి వస్తే వినియోగదారులు ట్రైనింగ్ ప్రోగ్రాంలో తమను చేర్చుకున్న తర్వాత రోజుకు 5,000 రూపాయల వరకు సంపాదించవచ్చని హామీ ఇస్తున్నారు. ఈ మెసేజ్ లో ఒక లింక్ కూడా ఉంది. దీనిని యాక్టీవేట్ చేసిన వెంటనే బ్యాంక్ అకౌంట్ వివరాలు వంటి వ్యక్తిగత సమాచారం కోల్పోవచ్చు. ఇది పూర్తిగా మోసపూరిత మెసేజ్ కావున వాట్సాప్ వినియోగదారులు అలాంటి మెసేజ్ల వలలో పడవద్దని హెచ్చరిస్తున్నారు.

Beware Whatsapp Scam: WFH Jobs Rs.5,000 Per Day Fake Message

వాట్సాప్ కొత్త నకిలీ మెసేజ్ స్కామ్

ఆన్‌లైన్‌లో ప్రసారం చేయబడుతున్న అనేక నకిలీ మెసేజ్ లలో ఇది ఒకటి. సాధారణంగా ఇటువంటి మెసేజ్లు ప్రస్తుతం కొనసాగుతున్న మహమ్మారి సమయంలో అనేక మందిని ప్రభావితం చేశాయి మరియు కొన్ని సందర్భాల్లో కొంత మంది ఉద్యోగాలు కోల్పోవటానికి కూడా దారితీస్తుంది. మెసేజ్ యొక్క సారాంశంలో 'మీరు అదృష్టవంతులు' మరియు 'వేగంగా డబ్బు సంపాదించండి' వంటి పదాలతో యూజర్లను నమ్మకంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఏదేమైనా ఇటువంటి సందర్భంలో ప్రతి ఒకరు జాగ్రత్తగా ఉండాలి. డబ్బు సంపాదించడానికి 'వేగవంతమైన' మరియు 'సులభమైన' మార్గం ఏది లేదని గుర్తుంచుకోండి. స్కామ్‌స్టర్‌లు ఉపయోగించే ఒక సాధారణమైన మరియు మోసపూరిత ఉపాయం అంతే.

Beware Whatsapp Scam: WFH Jobs Rs.5,000 Per Day Fake Message

వాట్సాప్ వాయిస్ కాల్ స్కామ్

ఆన్‌లైన్ స్కామ్‌లలో వినియోగదారులను ఆకర్షించడానికి స్కామర్‌లకు వాట్సాప్ వాయిస్ కాల్స్ కూడా కొత్త సాధనంగా మారింది. వాట్సాప్ తరపున రూ.25 లక్షల విలువైన లాటరీ టికెట్‌ను గెలుచుకున్నట్లు పేర్కొంటూ వినియోగదారులకు ఆడియో రికార్డింగ్‌ను స్వీకరించడంతో ఈ స్కామ్ మొదలవుతుంది. సాధారణంగా KBC లాటరీ గురించి మాట్లాడే సినిమా ఆడియో రికార్డింగ్‌తో పాటు ట్యాగ్ చేయబడుతుంది. బహుమతి డబ్బును గెలుచుకోవటానికి వినియోగదారుడు దేశంలో ఉన్న ఒక బ్యాంకు శాఖను సంప్రదించాలి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే స్కామర్ బ్రాంచ్ మేనేజర్ అని తెలుపుతూ వాట్సాప్ ద్వారా మాత్రమే మాట్లాడాలని పట్టుబడుతున్నాడు.

More from GizBot

Best Mobiles in India

English summary
Beware Whatsapp Scam: WFH Jobs Rs.5,000 Per Day Fake Message
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X