Home
News

ఇండియా లో బ్యాన్ తప్పించుకోవడానికి, కొత్త ఫీచర్లతో వచ్చిన BGMI ! వివరాలు 

By Maheswara

బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా (BGMI) గేమ్ యాప్ చివరకు వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చింది.ప్రస్తుతం, క్రాఫ్టన్ గేమ్ సంస్థ దీని కోసం 2.5 అప్డేట్ ను విడుదల చేసింది. ఇండియా లో విడుదల చేసిన ఈ కొత్త అప్డేట్ లో నాలుగు కీలక మార్పులను గమనించవచ్చు.

ఈ మార్పులు గేమ్ యొక్క వ్యసన స్థాయిలను తగ్గించడానికి మరియు నిషేధాన్ని నివారించడానికి కంపెనీ మొదటిసారిగా సమయ పరిమితి ఫీచర్ ను ప్రవేశపెట్టింది. BGMI యొక్క ఈ కొత్త వెర్షన్ కొత్త మ్యాప్ ఫీచర్ తో పాటు ఇతర ఫీచర్లను కూడా అందిస్తుంది. ఈ కొత్త వెర్షన్ బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియాలో క్రాఫ్టన్ చేసిన 4 కొత్త ఫీచర్లను ఇక్కడ చర్చించుకుందాం.

BGMI Game App Now Available For All, 4 New Changes That Come With New Updated Version.Details Here.

1. ఆటగాళ్లకు BGMI గేమ్‌లో సమయ పరిమితి ఫీచర్ తెచ్చారు
క్రాఫ్టన్ ఆటగాళ్లకు రోజువారీ సమయ పరిమితిని విధించింది. అంటే, రోజూ మీరు ఎంత సేపు గేమ్ ఆడాలని నిర్ణయించబడుతుంది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వినియోగదారులకు ప్లేటైమ్ మూడు గంటలు ఉంటుంది మరియు మిగిలిన ఆటగాళ్లు రోజూ ఆరు గంటల పాటు ఆడగలరు. దీనికి అదనంగా, తల్లిదండ్రుల ధృవీకరణ మరియు మైనర్‌ల కోసం రోజువారీ ఖర్చు కూడా గేమ్‌లో ఉంటుంది.

2. శక్తిని తిరిగి పొందడానికి కొత్త మార్గం ఉంది
BGMI ప్లేయర్‌లు స్విమ్మింగ్ పూల్‌లో శక్తిని తిరిగి పొందేలా చేసే కొత్త Nusa మ్యాప్ ఫీచర్ ను తీసుకువచ్చారు. ఇది నిజంగా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి, మీరు మెడికల్ ప్యాకేజీని కనుగొనడంలో విఫలమైన వ్యక్తులు ఈ మ్యాప్‌లోని ఏదైనా స్విమ్మింగ్ పూల్‌లో వారి పాత్ర యొక్క శక్తి స్థాయిలను టాప్ అప్ చేయగలరు.

3. కొత్త మ్యాప్ ఫీచర్
BGMI యొక్క తాజా వెర్షన్ కొత్త Nusa మ్యాప్‌ని తీసుకువస్తుంది. ఇది ఐలాండ్ అంతటా త్వరగా తరలించడానికి ప్లేయర్‌లు ఉపయోగించగల జిప్‌లైన్‌లు మరియు "న్యూ సిటీ" లోని హోటల్ భవనాలలో ఇన్‌స్టాల్ చేయగల ఎలివేటర్‌ల వంటి విలక్షణమైన యంత్రాంగాలను కలిగి ఉంది. ఇది జోర్బ్ బంతులు, స్విమ్మింగ్ పూల్, మండే భవనాలు మరియు నాశనం చేయగల జాడి వంటి గేమ్‌ప్లే ఫీచర్‌లను కూడా కలిగి ఉంటుంది.

ఈ కొత్త మ్యాప్‌లో సూపర్ రీకాల్ ఫీచర్ కూడా ఉంది, ఇది ఒక గ్రూప్ లోని ఆటగాళ్లను ఆట యొక్క నిర్దిష్ట సమయంలో మరణించిన వారి సహచరులలో ఒకరిని రీకాల్ చేయడానికి అనుమతిస్తుంది మరియు గేమ్ లో బతికి ఉన్న సహచరుల నుంచి ఆయుధాన్ని కూడా పొందుతుంది. సోలో మోడ్‌లో, BGMIలో ప్లేయర్‌లు ఆటోమేటిక్‌గా రీకాల్ చేయబడతారు.

4.హెచ్చరికలు
గతంలో, ఆట ప్రారంభంలో ఒక హెచ్చరికను మరియు ప్రతి ఆట ప్రారంభానికి ముందు సందేశాన్ని ప్రదర్శించేవారు. అయితే, ఇప్పుడు కంపెనీ గేమ్‌లో కొత్త వాయిస్ మెసేజ్ ను జోడించినట్లు కనిపిస్తోంది. ఈ మెసెజ్ ప్రకారం ఆటగాళ్ళు విరామం తీసుకోవాలి మరియు నిజ జీవితంలో ఈ వర్చువల్ ప్రపంచాన్ని చాలా తీవ్రంగా పరిగణించకూడదు అని తెలియచేస్తుంది.

ఇది నిజమైన ప్రపంచ యుద్ధం గేమ్ కాదని మరియు దానికి బానిస కాకూడదని వినియోగదారులకు గుర్తు చేయడానికే ఈ హెచ్చరిక ఉపయోగపడుతుంది. ఈ గేమ్ యొక్క
వ్యసన సమస్యలపై కంపెనీ భారత ప్రభుత్వం నుండి తీవ్ర విమర్శలను అందుకోవడం కారణంగా ఈ మార్పులు చేసారు.

"BGMI అనేది వాస్తవ ప్రపంచ యుద్ధం ఆధారిత గేమ్ కాదు, వర్చువల్ ప్రపంచంలో సెట్ చేయబడిన సర్వైవల్ సిమ్యులేషన్ గేమ్. దయచేసి మితంగా ఆడండి, తరచుగా విరామం తీసుకోండి మరియు బాధ్యతాయుతంగా ఆడండి" అని వాయిస్ రికార్డింగ్ మెసేజ్ వార్నింగ్ అందిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
BGMI Game App Now Available For All, 4 New Changes That Come With New Updated Version.Details Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X