Home
News

Bharat QR code, పూర్తి సమాచారం

ఇక డెబిట్, క్రెడిట్ కార్డులను స్వైప్ చేయకుండా చెల్లింపులను చేపట్టవచ్చు

By Sivanjaneyulu Bommu

క్యాష్‌లెస్ ఎకానమీకి అవసరమైన డిజిటల్ పేమెంట్ సిస్టంను భారత్‌లో మరింత సులభతరం చేసే క్రమంలో మోదీ సర్కార్ సరికొత్త ఆన్‌లైన్ చెల్లింపు విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

Bharat QR code, పూర్తి సమాచారం

Bharat QR code పేరుతో లాంచ్ అయిన ఈ పేమెంట్ సిస్టంలో భాగంగా debit/credit కార్డులను POS మెచీన్‌లలో స్వైప్ చేయకుండా చెల్లింపులను చేపట్టవచ్చు. మీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా మర్చెంట్‌కు కేటాయించిన Bharat QR codeను స్కాన్ చేసి పిన్‌కోడ్‌ను ఎంటర్ చేస్తే చాలు చెల్లింపు పూర్తవుతుంది. నగదు నేరుగా మీ అకౌంట్ నుంచి మర్చంట్ బ్యాంక్ ఖతాలోకి వెళ్లిపోతోంది.

తప్పనిసరిగా స్మార్ట్‌ఫోన్‌ ఉండాలి

తప్పనిసరిగా స్మార్ట్‌ఫోన్‌ ఉండాలి

Bharat QR codeను కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మాస్టర్ కార్డ్, వీసాలు అభివృద్ధి చేసాయి. ఈ ఫీచర్ ను ఉపయోగించుకోవాలనే వారు తప్పనిసరిగా స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉండాలి. ఇదే సమయంలో వారివారి బ్యాంక్ అకౌంట్‌లకు సంబంధించిన మొబైల్ బ్యాకింగ్ యాప్‌లను కూడా వాడుతుండాలి.

 

సపోర్ట్ చేయబోయే బ్యాంకుల వివరాలు..

సపోర్ట్ చేయబోయే బ్యాంకుల వివరాలు..

Bharat QR code సర్వీసును సపోర్ట్ చేయబోయే బ్యాంకుల వివరాలు.. యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిటీ యూనియన్ బ్యాంక్, డీసీబీ బ్యాంక్ లిమిటెడ్, కరూర్ వైశ్యా బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్. ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, లిమిటెడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయా బ్యాంక్, ఎస్ బ్యాంక్ లిమిటెడ్.

ప్రస్తుతానికి ICICI అలానే HDFC

ప్రస్తుతానికి ICICI అలానే HDFC

ప్రస్తుతానికి Bharat QR code సర్వీసును ICICI అలానే HDFC బ్యాంకులకు సంబంధించిన Pockets App, PayZapp appలు మాత్రమే యాడ్ చేసుకున్నాయి. త్వరలోనే మిగితా బ్యాంకులు కూడా ఈ సర్వీసును
యాడ్ చేసుకోబోతున్నాయి

Bharat QR code సర్వీసును ఉపయోగించుకుని చెల్లింపులను చేపట్టడం ఎలా..?

Bharat QR code సర్వీసును ఉపయోగించుకుని చెల్లింపులను చేపట్టడం ఎలా..?

మీరు ICICI లేదా HDFC బ్యాంక్ ఖతాదారులు అయినట్లయితే ముందుగా PayZapp అలానే Pockets యాప్‌లను ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్స్ లాంచ్ అయిన తరువాత అకౌంట్‌లలోకి Signup అవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత 4 డిజిట్ల పిన్ కోడ్‌ను సెట్ చేసుకోవాలి.
ఇప్పుడు debit/credit కార్డ్ అలానే బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించిన వివరాలను యాప్‌కు లింక్ చేసుకోవాలి. అంతే Bharat QR code సర్వీసు మీకు అందుబాటులో ఉన్నట్లే.

More from GizBot

Best Mobiles in India

English summary
Bharat QR code launched: Everything you need to know. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X