Just In
- 2 hrs ago
OnePlus రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లు: వన్‌ప్లస్ 8T, నార్డ్ & టీవీలను కొనడానికి సరైన సమయం...
- 4 hrs ago
Flipkart Big Saving Days saleలో రియల్‌మి C12 4GB ర్యామ్ కొత్త వెర్షన్ మొదటి సేల్!! సూపర్ ఆఫర్స్..
- 6 hrs ago
Signal యాప్ ను ల్యాప్‌టాప్ లేదా PCలో యాక్సిస్ చేయడం ఎలా??
- 7 hrs ago
Amazon Great Republic Day Saleలో ఈ ఫోన్ల మీద ఆఫర్లే ఆఫర్లు...
Don't Miss
- Lifestyle
మీ రాశిని బట్టి ఏ రత్నం ధరిస్తే.. శుభఫలితాలొస్తాయంటే...!
- Automobiles
డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్
- News
ప్లెక్సీ రగడ.. కనిపించని మోడీ, బీజేపీ శ్రేణుల ఆగ్రహాం, కేసీఆర్ ఫోటో చించివేత
- Finance
Budget 2021-22: స్మార్ట్‌ఫోన్, గృహోపకరణాల ధరలు పెరుగుతాయా?
- Sports
నా జీవితంలోనే ఇదో అద్భుతమైన క్షణం.. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది: రిషభ్ పంత్
- Movies
అభిజిత్ ఎవరు?.. ఆ విషయం నాకు అర్థం కావడం లేదు.. మోనాల్ కామెంట్స్ వైరల్
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Reliance Jioను వరుసగా రెండవసారి వెనుకకు నెట్టిన Airtel!! ఎందులోనో తెలుసా???
2020 సెప్టెంబరు నెల యొక్క టెలికాం సబ్స్క్రిప్షన్ డేటా నివేదికను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) విడుదల చేసింది. కొత్తగా విడుదల అయిన నివేదికల ప్రకారం కొత్త సబ్ స్క్రైబర్ ల చేరికలో భారతి ఎయిర్టెల్ సంస్థ వరుసగా రెండవ నెలలో కూడా రిలయన్స్ జియోను ఓడించింది. ఎయిర్టెల్ గత నెలలో 3.77 మిలియన్ల మంది కొత్త వినియోగదారులను చేర్చుకోగా జియో 1.46 మిలియన్ల మంది కొత్త వినియోగదారులను మాత్రమే జోడించింది. ఎయిర్టెల్ మొత్తంగా 326.61 మిలియన్ల మంది సభ్యులతో ఈ నెలను ముగించింది అయితే జియో సంస్థ 404.13 మిలియన్ల వినియోగదారులతో అగ్రస్థానంలో ఉందని నివేదిక హైలైట్ చేసింది. అయితే వోడాఫోన్ ఐడియా ఎప్పటిలాగానే గత నెలలో కూడా 4.65 మిలియన్ల వినియోగదారులను కోల్పోయింది.దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్టెల్ vs జియో vs Vi 2020 సెప్టెంబర్ మార్కెట్ వాటా
2020 సెప్టెంబర్ చివరినాటికి ఇండియా యొక్క టెలికాం మార్కెట్ లో రిలయన్స్ జియో 35.19% మార్కెట్ వాటాను కలిగి ఉంది. తరువాత స్థానంలో భారతి ఎయిర్టెల్ 28.44% వాటాను, వొడాఫోన్ ఐడియా 27.73% వాటాను కలిగి ఉన్నాయి. చివరిగా ఈ జాబితాలో బిఎస్ఎన్ఎల్ 10.36% మార్కెట్ వాటాతో, ఎమ్టిఎన్ఎల్ 0.29% తో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి.
Also Read: DishSMRT Hub & D2h స్ట్రీమ్ ఆండ్రాయిడ్ STBల OTT యాప్‌ల చేరికలో కొత్తగా మరొకటి...

ఎయిర్టెల్ vs జియో vs Vi యూజర్‌బేస్
జియో సంస్థ మొత్తంగా 404.13 మిలియన్ల మంది సభ్యులను కలిగి ఉన్నప్పటికీ క్రియాశీల యూజర్‌బేస్ విషయంలో మాత్రం ఎయిర్‌టెల్‌తో సమానంగా ఉంది. ఎయిర్టెల్ యొక్క 326.61 మిలియన్ల వినియోగదారులలో 96.90% (316.49 మిలియన్ల) వినియోగదారులు (VLR) క్రియాశీల వైర్లెస్ చందాదారులను కలిగి ఉండడం గొప్ప విషయం. ఈ జాబితాలో రెండవ స్థానంలో వోడాఫోన్ ఐడియా యొక్క 295.50 మిలియన్లలో 261.23 మిలియన్ చందాదారులు చురుకుగా ఉండడం గమనార్హం. జియో యొక్క 404.13 మిలియన్ల కస్టమర్లలో 318.28 మిలియన్ల క్రియాశీల వినియోగదారులతో రిలయన్స్ జియో ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉంది. మొత్తం 118.99 మిలియన్ల చందాదారులలో బిఎస్ఎన్ఎల్ తన నెట్‌వర్క్‌లో కేవలం 51.92% మంది వినియోగదారులను మాత్రమే కలిగి ఉంది.

ఎయిర్టెల్ క్రియాశీల యూజర్ల పెంపు
ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ ఐడియా టెలికాం సంస్థలు రెండూ కూడా రిలయన్స్ జియో కంటే ఎక్కువ మంది క్రియాశీల వినియోగదారులను కలిగి ఉండడానికి కారణం కనీస రీఛార్జ్ విధానం. ఈ రెండు టెల్కోలు తమ మొబైల్ నంబర్‌ను చురుకుగా ఉంచడానికి నెలవారీ కనీస రీఛార్జిలను చేయమని వినియోగదారులను బలవంతం చేస్తున్నాయి. అయితే రిలయన్స్ జియోలో ప్రస్తుతం అలాంటి విధానం ఏమి లేదు. అలాగే ఎయిర్టెల్ మరియు Vi మాదిరిగా కాకుండా టెల్కో అపరిమిత ఇన్కమింగ్ కాలింగ్ సదుపాయాన్ని మాత్రమే అందిస్తోంది.

సెప్టెంబర్ మొబైల్ నంబర్ పోర్టబిలిటీ వివరాలు
2020 సెప్టెంబర్ నెలలో మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP) కోసం మొత్తంగా 8.71 మిలియన్ అభ్యర్థనలు వచ్చాయని ట్రాయ్ తమ యొక్క నివేదికలలో తెలిపారు. ఈ అభ్యర్ధనలలో ఎక్కువ భాగం వోడాఫోన్ ఐడియా కస్టమర్ల నుండి రావడం గమనార్హం. వీరు అధికంగా ఎయిర్టెల్ మరియు రిలయన్స్ జియోలకు పోర్ట్ అవ్వడం మరొక గొప్ప విషయం.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190