భారత్ నెట్ సర్వీసును ఎంచుకునే వారికి మంచి శుభవార్త...

|

ఇంటర్నెట్‌ కనెక్టివిటీ కోసం ఎదురుచూస్తున్న కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి ప్రభుత్వం కొన్ని ఆసక్తికరమైన ప్రయత్నాలను చేస్తోంది. కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ద్వారా ప్రభుత్వం ఇప్పుడు 4,000 సినిమాలు మరియు ఇతర వినోదభరిత జాబితాను ఉచితంగా అందిస్తున్నది. భరత్ నెట్ యొక్క ప్రీ-పెయిడ్ కూపన్ల వ్యవస్థ ద్వారా మారుమూల గ్రామాలకు కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించాలని CSC చూస్తున్నది.

భారత్ నెట్ సర్వీసు

భారత్ నెట్ సర్వీసు

CSCలతో పాటు డిజిటల్ కియోస్క్‌లు కూడా ఇందులో భాగంగా ఉంటాయి. వై-ఫై లేదా డైరెక్ట్-టు-హోమ్ ఫైబర్ ద్వారా ఈ సేవలను పొందవచ్చు. సినిమాలు మరియు వినోదం వంటివి ప్రజలకు ఇంటర్నెట్ ద్వారా అందించడం మంచి ప్రతిపాదనగా అనిపిస్తుంది అని ప్రభుత్వ సీనియర్ అధికారి చెప్పారు . సిఎస్‌సిల నుండి ఇంటర్నెట్ కూపన్‌లను కొనుగోలు చేసే వ్యక్తులకు మొదట్లో సినిమాలు, వినోదభరిత విషయాలను ఉచితంగా అందిస్తామని అధికారి తెలిపారు.

 

 

రోజుకు 5GB డేటా ప్రయోజనంతో BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌లురోజుకు 5GB డేటా ప్రయోజనంతో BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌లు

CSC

ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం ప్రజలు ఇంటర్నెట్ కనెక్టివిటీ ద్వారా సినిమాలను చూడడానికి అనుమతించడం కొత్త వ్యూహంలో ఒక భాగం. వినియోగదాలు డబ్బును చెల్లించడం ప్రారంభించే ముందు అది ఏమి అందిస్తుందో వారు చూడగలరు. CSC అందించే ఇంటర్నెట్ సేవలు మార్చి 2020 వరకు ఉచితంగా లబిస్తాయి అని ఎలక్ట్రానిక్స్ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.

భారత్‌నెట్

ప్రభుత్వ హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ భారత్‌నెట్ ప్రస్తుతం 1.25 లక్షల గ్రామ పంచాయతీలకు చురుకుగా అందిస్తున్నది. రెండవ దశలో భాగంగా దీనిని ఇండియా మొత్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు అందించాలని ప్రయత్నం చేస్తున్నది.

ఈ సేవలను ప్రభుత్వం ఎక్కడ, ఎప్పుడు ప్రారంభిస్తుంది?

ఈ సేవలను ప్రభుత్వం ఎక్కడ, ఎప్పుడు ప్రారంభిస్తుంది?

ఎలక్ట్రానిక్స్, IT మంత్రిత్వ శాఖ CSCలను రన్ చేస్తున్నాయి. భారతదేశం అంతటా ఇవి మొత్తం 3.6 లక్షల పైగా గ్రామ పంచాయతీలలో CSCల నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నాయి. ఇది విస్తరణ కోసం జీ యాజమాన్యంలోని షుగర్ బాక్స్ నెట్‌వర్క్‌లతో భాగస్వామ్యం కలిగి ఉన్నారు. ప్రజల ప్రతిస్పందనను పరీక్షించడానికి ఈ కార్యక్రమం వచ్చే నెల నుండి 100 ప్రదేశాలలో ప్రారంభమవుతుంది. అధికారి ప్రకారం బ్రాడ్‌బ్యాండ్ సేవలు దేశంలోని మారుమూల ప్రాంతాలకు ఇంకా చేరుకోలేదు. కనెక్టివిటీ పరంగా ఈ ప్రాంతాల్లో 4G మొబైల్ సేవలను అందించాలనే ప్రయత్నంలో ఉన్నారు. భరత్ నెట్ ఈ ప్రాంతాల్లో వేగంగా ప్రసారం చేయడాన్ని మరియు డౌన్‌లోడ్లను ప్రారంభిస్తుంది.

Best Mobiles in India

English summary
BharatNet Users Now Get Access Over More Than 4000 Movies

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X