Home
News

Airtel టెల్కో 4G డేటా వోచర్‌ల ధరలు పెరిగాయి!! కొత్త ధరలు ఇవిగో...

ఇండియాలోని ప్రైవేట్ టెలికాం కంపెనీలు అన్ని ఇటీవల టారిఫ్ పెంపులను ప్రకటిస్తూ తమ యొక్క వినియోగదారులకు ఊహించని షాక్ ఇచ్చాయి. భారతదేశంలోని ప్రముఖ టెల్కోలలో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ ఇటీవల తన యొక్క అపరిమిత ప్రీపెయిడ్ ప్లాన్‌లను మార్చడమే కాకుండా ఇప్పుడు తన 4G డేటా వోచర్‌ల ధరలను కూడా పెంచుతున్నట్లు ప్రకటించింది. 4G డేటా వోచర్‌లు అనేది టెల్కోలు తమ వినియోగదారులకు అదనపు ధరతో అందించే యాడ్-ఆన్ డేటా ప్యాక్‌లు. వీటిని రోజువారీ డేటా అయిపోయినప్పుడు ఉపయోగించవచ్చు. ఎయిర్‌టెల్ దాని చందాదారులకు కొన్ని డేటా వోచర్‌లను కొత్త ధరల వద్ద అందిస్తోంది. వీటిలో కొన్ని అదనపు ప్రయోజనాలతో కూడా వస్తాయి. ఎయిర్‌టెల్ అందించే కొత్త 4G డేటా వోచర్‌ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ టెల్కో కొత్త 4G డేటా వోచర్‌లు

ఎయిర్‌టెల్ టెల్కో కొత్త 4G డేటా వోచర్‌లు

ధరల పెంపు తరువాత ఎయిర్‌టెల్ అందించే 4G డేటా వోచర్‌లలో మొదటి డేటా వోచర్ రూ. 58 ధర వద్ద లభిస్తుంది. ఈ వోచర్ తో ఎయిర్‌టెల్ వినియోగదారులు మొత్తంగా 3GB ఇంటర్నెట్ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు వ్యవధి వినియోగదారు ఉపయోగించే ఇతర ప్యాక్‌ల మాదిరిగానే ఉంటుంది. అంటే యాక్టివ్ బండిల్ మరియు స్మార్ట్ ప్యాక్ వినియోగదారులకు ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. 3GB డేటా పూర్తయిన తర్వాత వినియోగదారులు తదుపరి వినియోగానికి MBకి 50p ఛార్జ్ చేయబడుతుందని గమనించాలి.

Airtel

Airtel అందించే డేటా వోచర్ జాబితాలో తదుపరిది రూ. 98 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ పేర్కొన్న ధర ట్యాగ్‌లో మొత్తంగా 5GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. ఇది డేటా వోచర్ అయినందున ప్లాన్ యొక్క చెల్లుబాటు కూడా ఇప్పటికే ఉన్న ప్లాన్‌కు సమానంగా ఉంటుంది. వివరంగా చెప్పాలంటే యాక్టివ్ బండిల్ ప్యాక్ మరియు స్మార్ట్ ప్యాక్ వినియోగదారులకు ప్లాన్ వర్తిస్తుంది. దీనితో పాటుగా రూ. 98 డేటా వోచర్‌తో మ్యూజిక్, లైవ్ కాన్సర్ట్‌లు, పాడ్‌క్యాస్ట్‌లు మరియు మరిన్నింటిని అందించే కంపెనీ స్వంత మ్యూజిక్ యాప్ అయిన Wynk Music Premiumకి యాక్సెస్ వస్తుంది. 5GB డేటా వినియోగం తర్వాత వినియోగదారులకు 50p/MB ఛార్జ్ చేయబడుతుంది.

రూ.108 4G డేటా వోచర్

జాబితాలోని తదుపరి ప్లాన్ రూ.108 4G డేటా వోచర్. రూ.108 ధరతో లభించే ప్లాన్ 6GB ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది. ఇది వినియోగదారుడు కలియున్న ప్రస్తుత ప్లాన్‌కు సమానమైన చెల్లుబాటును కలిగి ఉంటుంది. ఈ ప్లాన్ యాక్టివ్ బండిల్ ప్యాక్ మరియు స్మార్ట్ ప్యాక్ వినియోగదారులకు కూడా వర్తిస్తుంది. దీనితో పాటు వినియోగదారులు ఈ ప్లాన్‌తో OTT ప్లాట్‌ఫారమ్ లో అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌ను 30 రోజుల పాటు బండిల్ చేయబడి అందిస్తుంది. అలాగే 6GB డేటా పూర్తయిన తర్వాత వినియోగదారులు తదుపరి వినియోగానికి MBకి 50p ఛార్జ్ చేయబడుతుంది.

రూ.118 ధర ట్యాగ్‌

జాబితాలోని తదుపరి ప్లాన్ రూ10 అధిక మొత్తంతో రూ.118 ధర వద్ద వినియోగదారులు పై ప్లాన్‌తో పోలిస్తే రెట్టింపు డేటాను అందించే 4G డేటా వోచర్‌ను పొందవచ్చు. రూ.118 ధర ట్యాగ్‌తో ఎయిర్‌టెల్ 12GB ఇంటర్నెట్ డేటాను అందిస్తుంద. ఇది వినియోగదారులకు అందుబాటులో ఉన్న ప్రస్తుత ప్లాన్‌కు సమానమైన చెల్లుబాటును కలిగి ఉంటుంది. అయితే ఈ ప్లాన్ పైన పేర్కొన్న రెండు అదనపు ప్రయోజనాలను అందించదు. 12GB డేటా వినియోగం తర్వాత వినియోగదారులకు 50p/MB ఛార్జ్ చేయబడుతుంది.

రూ.148 4G డేటా వోచర్‌

టెల్కో అందించే ప్లాన్ల జాబితాలోని తదుపరి ప్లాన్ రూ.148 4G డేటా వోచర్‌. రూ.148 వోచర్‌తో ఎయిర్‌టెల్ యూజర్లు మొత్తం 15GB ఇంటర్నెట్ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు వ్యవధి వినియోగదారు ఉపయోగించే ఇతర ప్యాక్‌ల మాదిరిగానే ఉంటుంది. యాక్టివ్ బండిల్ మరియు స్మార్ట్ ప్యాక్ వినియోగదారులకు కూడా ప్లాన్ అందుబాటులో ఉంది. 3GB డేటా పూర్తయిన తర్వాత, వినియోగదారులు తదుపరి వినియోగానికి MBకి 50p ఛార్జ్ చేయబడుతుందని గమనించాలి. అదనంగా ఈ ప్లాన్ ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాక్సెస్‌ను అందిస్తుంది. ఇది ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌లోని ఏదైనా ఎక్స్‌స్ట్రీమ్ ఛానెల్‌లకు 30-రోజుల యాక్సెస్‌ను అనుమతిస్తుంది.

4G డేటా వోచర్

జాబితాలో చివరిది అధిక ధర కలిగిన 4G డేటా వోచర్. ఈ ప్లాన్ రూ. 301 ధర వద్ద మొత్తంగా 50GB ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది. ఇది వినియోగదారుల యొక్క ప్రస్తుత ప్లాన్‌కు సమానమైన చెల్లుబాటును కలిగి ఉంటుంది. అన్ని నిబంధనలు మరియు షరతులు పైన పేర్కొన్న ప్లాన్‌ల మాదిరిగానే ఉంటాయి. అంతేకాకుండా ఈ ప్లాన్ ఒక అదనపు ప్రయోజనాన్ని మాత్రమే అందిస్తుంది మరియు అది Wynk music Premiumకి యాక్సెస్.

Best Mobiles in India

English summary
Bharti Airtel 4G Data Recharge Vouchers Prices Increased After Tariff Hike
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X