Just In
- 25 min ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 5 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 7 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 1 day ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
Don't Miss
- News
హైదరాబాద్‌లో మరో దిగ్గజ సంస్థ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్: 1800 మందికి ఉపాధి
- Sports
టీ20ల్లో టాప్ ప్లేయర్లు.. వన్డేల్లో మాత్రం వేస్ట్.. టీమిండియా స్టార్ కూడా!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Movies
ఎద, నాభి అందాలతో సిరి హనుమంత్ హాట్ ట్రీట్.. ఎన్నడూ చూపించని విధంగా బోల్డ్ షో!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Airtel & Google కంపెనీల $700 మిలియన్ల బిజినెస్ డీల్ కు CCI ఆమోదం...
భారతదేశంలో రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన భారతి ఎయిర్‌టెల్ కంపెనీ గూగుల్ నుండి $1 బిలియన్ పెట్టుబడిని పొందుతున్నట్లు ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రకటించింది. గూగుల్ సంస్థ యొక్క $1 బిలియన్ పెట్టుబడిలో $700 మిలియన్లను టెల్కోలోని 1.28% వాటా పెట్టుబడి కోసం వినియోగించబడింది. మిగిలిన $300 మిలియన్ల మొత్తాన్ని బహుళ-సంవత్సరాలలో అనేక ఒప్పందాలను రూపొందించడం కోసం ఉద్దేశించబడనున్నట్లు ప్రకటించింది. గూగుల్ కంపెనీ ఎయిర్‌టెల్‌లో పెట్టుబడులను పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం భారతదేశంలో నిర్దిష్ట 5G వినియోగ సామర్ధ్యంను మెరుగ్గా సృష్టించడం. కంపెనీల మధ్య జరిగిన ఒప్పందాన్ని టెల్కో వాటాదారులు అందరు కూడా ఆమోదం తెలిపారు. అయితే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) నుండి తుది నిర్ణయం రావాల్సి ఉంది.

భారతీ ఎయిర్‌టెల్ టెలికాం సంస్థలో $700 మిలియన్ల (రూ. 52,243.80 మిలియన్లు) గూగుల్ పెట్టుబడికి జూన్ 30, 2022న CCI నుండి గ్రీన్ లైట్ పొందినట్లు తెలిపింది. రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరును రూ.734 చొప్పున మొత్తంగా 71,176,839 ఈక్విటీ షేర్లను ఎయిర్‌టెల్ సంస్థ గూగుల్‌కు జారీ చేయనున్నది. అంటే ఇప్పుడు భారతీ ఎయిర్‌టెల్‌లో గూగుల్ 1.28% వాటాను కలిగి ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

భారతదేశం యొక్క నంబర్ వన్ టెలికాం ఆపరేటర్ మరియు భారతీ ఎయిర్‌టెల్ యొక్క ప్రాధమిక పోటీ అయిన రిలయన్స్ జియోలో కూడా గూగుల్ సంస్థ వాటాను కొనుగోలు చేసి సన్నిహితంగా పనిచేస్తోంది. అయితే ఎయిర్‌టెల్ మరియు గూగుల్ సంస్థల యొక్క ఒప్పందంలో ఎలాంటి వివాదాస్పద ప్రయోజనాలకు తావు ఉండదని భారతీ ఎయిర్‌టెల్ సీఈఓ గోపాల్ విట్టల్ గతంలోనే తెలిపారు. ఎయిర్‌టెల్ మరియు గూగుల్ మధ్య ఉన్న ఒప్పందం గూగుల్ మరియు జియో మధ్య ఉన్నదానికంటే భిన్నమైనదని విట్టల్ స్పష్టం చేశారు.

గూగుల్ మరియు ఎయిర్‌టెల్ సంస్థలు రెండు కూడా భవిష్యత్తులో మరిన్ని బహుళ వాణిజ్య ఒప్పందాలను ఏర్పరచుకోవాలని చూస్తున్నాయి. ఇది సెర్చ్-ఇంజిన్ దిగ్గజం గూగుల్ సంస్థతో జియో టెల్కో చేయాలనుకుంటున్న దానికి భిన్నంగా ఉంటుంది. గూగుల్ తో జరిగే కొత్త ఒప్పందాలు ముందు ముందు భారతీ ఎయిర్‌టెల్‌కు పెద్ద విజయాలను అందించడంలో సహాయపడతాయి.

నాలుగు సంవత్సరాల పాటు FY2018-19 వరకు అదనపు AGR (సర్దుబాటు చేసిన స్థూల రాబడి) బకాయిల వాయిదాను ప్రకటించడం ద్వారా ఎయిర్‌టెల్ ఆదా చేసే వేల కోట్లతో పాటు ఈ డబ్బు కూడా జియోకి వ్యతిరేకంగా ఎయిర్‌టెల్‌ను చాలా బలమైన స్థితిలో ఉంచుతుంది. 5G యుగంలో అధిక మంది కస్టమర్లను పొందడం కోసం ఎయిర్టెల్ మరియు జియో టెల్కోల మధ్య మళ్ళి యుద్ధం ప్రారంభం కానున్నది. అయితే ఇండియాలో ఈసారి జియోకి సమాన పోటీదారుగా ఎయిర్‌టెల్ ఉంటుంది అని కొన్ని నిఘా వర్గాలు సూచిస్తున్నాయి.

Jio-Google భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశం
గూగుల్ మరియు జియో కొత్త భాగస్వామ్యంలో గూగుల్ తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను జియో సంస్థ మార్కెట్లో ప్రారంభించబోయే స్మార్ట్‌ఫోన్‌ల యొక్క ప్లే స్టోర్‌లకు ఆప్టిమైజేషన్లను అందిస్తుంది. రిలయన్స్ జియో మరియు గూగుల్ రెండు సంస్థల స్మార్ట్‌ఫోన్‌లు తక్కువ ధరల వద్ద తక్కువ-ఆదాయ వినియోగదారులను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే రూ .10,000 నుంచి రూ.20,000 ధరల పరిధిలో సరసమైన 5G వేరియంట్‌ను విడుదల చేయడం అనేది తక్కువ ఆదాయ వినియోగదారులతో పాటు మధ్య తరగతి ఆదాయం మీద కూడా ప్రభావం చూపుతుంది.

ఎయిర్‌టెల్ స్మార్ట్ మిస్డ్ కాల్ అలర్ట్ ఫీచర్
మీరు ఎయిర్‌టెల్ సిమ్ ని వినియోగిస్తున్న మొబైల్ కస్టమర్ అయితే కనుక మీరు ప్రీపెయిడ్ యూజర్ అయినా లేదా పోస్ట్‌పెయిడ్ యూజర్ అయినా సరే మీరు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ నుండి 'స్మార్ట్ మిస్డ్ కాల్' సరికొత్త ఫీచర్‌ను ఉపయోగించగలరు. యాక్టివ్ వాయిస్ కాలింగ్ కనెక్షన్‌ని కలిగి ఉన్న ఏ ఎయిర్‌టెల్ వినియోగదారు అయినా వారు సబ్‌స్క్రయిబ్ చేసుకున్న ప్లాన్‌తో సంబంధం లేకుండా ఈ ఫీచర్ యొక్క అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు. రిలయన్స్ జియో వినియోగదారులు ఇప్పటికే ఇటువంటి సర్వీసును పొందుతున్నారు. జియో టెల్కో తన కస్టమర్‌లు నెట్‌వర్క్ కవరేజీలో లేనప్పుడు తమకు మిస్డ్ కాల్ వచ్చిందని SMS ద్వారా తెలియజేస్తుంది. ఇది ప్రతిసారీ మొబైల్ యాప్‌కి వెళ్లడం కంటే మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. మీరు ఎయిర్‌టెల్ కస్టమర్ కాకపోతే కనుక మీరు సిమ్ పొందాలని చూస్తే కనుక కంపెనీకి సంబంధించిన ఏదైనా సమీప రిటైల్ స్టోర్‌లను సందర్శించండి లేదా టెల్కో అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు. మీరు మీ ఇంటివద్దనే ఉండి కూడా కొత్త సిమ్‌ని పొందవచ్చు.

భారతదేశంలో 5G డిజిటల్ సేవలు
5G అందుబాటులోకి రావడంతో ప్రపంచంతో మరింత స్మార్ట్ గా కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది. 5G యొక్క ప్రారంభ దశలలో మెరుగైన మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ (eMBB) మరియు ఫిక్సడ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA) వంటి వినియోగ సందర్భాలను చూడవచ్చు. భారతదేశంలో స్థిర బ్రాడ్‌బ్యాండ్ వ్యాప్తి సమస్యను పరిష్కరించడంలో మరియు ప్రయాణంలో ఉన్నప్పుడు వినియోగదారుల డేటా అనుభవాన్ని మెరుగుపరచడంలో ఇవి సహాయపడతాయి. పెరుగుతున్న డేటా అవసరాలను మరింత ప్రభావవంతంగా తీర్చడంలో 5G కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్లకు ఇది సహాయంగా ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం 5G అందుబాటులోకి వచ్చిన తరువాత గిగాబైట్ ధర ప్రస్తుత 4G కంటే 10 రెట్లు తక్కువగా ఉంటుంది అని ఇండియా హెడ్-నెట్‌వర్క్స్, మార్కెట్ ఏరియా సౌత్-ఈస్ట్ ఆసియా, ఓషియానియా మరియు ఇండియా ఎరిక్సన్‌లో మేనేజింగ్ డైరెక్టర్ నితిన్ బన్సల్ తెలిపారు. 5G అందుబాటులోకి వచ్చిన తరువాత వినియోగదారులు వారి స్మార్ట్‌ఫోన్‌లలో 4K వీడియోను వీక్షించడాన్ని, AR/VR మొబైల్ గేమింగ్ యాప్‌లు మరియు అనేక ఇతర లీనమయ్యే కార్యకలాపాలు మరియు కొత్త అప్లికేషన్‌లను మరింత మెరుగ్గా ఉపయోగించడానికి అనుమతిస్తుంది. సెక్యూరిటీ నుండి వినోదం వరకు అన్ని రకాల ప్రమాణాలు అంతకు మించివ అనుభవంతో అన్ని రకాల ప్రయోజనాలను అందివ్వనున్నట్లు 5G వాగ్దానం చేస్తుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470