Airtel కొత్తగా 'స్మార్ట్ మిస్డ్ కాల్ అలర్ట్' ఫీచర్‌ని ప్రారంభించింది!! ప్రయోజనాలు ఎలా ఉన్నాయో తెలుసా

|

ఇండియాలోని టెలికాం రంగంలో గల రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్ తన యొక్క వినియోగదారుల కోసం 'స్మార్ట్ మిస్డ్ కాల్ అలర్ట్‌' అనే కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో వినియోగదారులు తమ యొక్క సిమ్ నెట్‌వర్క్ కవరేజీలో లేనప్పుడు తమకు వచ్చిన మిస్డ్ కాల్ ల యొక్క హెచ్చరికలను చూడగలరు. ఇది ప్రత్యేకమైన ఫీచర్ ఏమి కాదు జియో వినియోగదారులు ఇప్పటికే ఈ మిస్డ్ కాల్ అలెర్ట్ ఫీచర్ ని పొందుతున్నది. ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌కి వెళ్ల మిస్డ్ కాల్ అలర్ట్‌ల విభాగాన్ని ఎంచుకున్నప్పుడు యూజర్‌లకు ఎయిర్‌టెల్ స్మార్ట్ మిస్డ్ కాల్ అలర్ట్‌లు కనిపిస్తాయి.

 

స్మార్ట్ మిస్డ్ కాల్ అలర్ట్‌లు

స్మార్ట్ మిస్డ్ కాల్ అలర్ట్‌లు అనేది వాస్తవానికి అవసరమైన సర్వీసులలో అతి ముఖ్యమైనది. ఇది టెల్కో వినియోగదారులకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ప్రయాణం అధికంగా చేసే వారు కొన్నిసార్లు నెట్‌వర్క్ కవరేజీలో లేని ప్రాంతాలలో ఉన్నప్పుడు చాలా ముఖ్యమైన కాల్‌లను కోల్పోతు ఉంటారు. అంతేకాకుండా కాలింగ్ యాప్‌లో రింగ్‌టోన్ వినబడనందున లేదా మిస్డ్ కాల్ నోటిఫికేషన్‌ను చూడనందున వాటి గురించి ఎప్పటికీ తెలుసుకోలేము. కానీ స్మార్ట్ మిస్డ్ కాల్ అలర్ట్‌లతో వినియోగదారులు తమ సిమ్ నెట్‌వర్క్ కవరేజీలో లేనప్పుడు వారు మిస్ అయిన ప్రతి కాల్‌ను చూడగలరు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఆండ్రాయిడ్ & ఐఫోన్‌లోని ఫోటోల నుండి టెక్స్ట్ ని కాపీ చేయడం ఎలా?ఆండ్రాయిడ్ & ఐఫోన్‌లోని ఫోటోల నుండి టెక్స్ట్ ని కాపీ చేయడం ఎలా?

స్మార్ట్ మిస్డ్ కాల్ అలర్ట్ ఫీచర్‌ని ఉపయోగించే కస్టమర్‌లు
 

స్మార్ట్ మిస్డ్ కాల్ అలర్ట్ ఫీచర్‌ని ఉపయోగించే కస్టమర్‌లు

మీరు ఎయిర్‌టెల్ సిమ్ ని వినియోగిస్తున్న మొబైల్ కస్టమర్ అయితే కనుక మీరు ప్రీపెయిడ్ యూజర్ అయినా లేదా పోస్ట్‌పెయిడ్ యూజర్ అయినా సరే మీరు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ నుండి 'స్మార్ట్ మిస్డ్ కాల్' సరికొత్త ఫీచర్‌ను ఉపయోగించగలరు. యాక్టివ్ వాయిస్ కాలింగ్ కనెక్షన్‌ని కలిగి ఉన్న ఏ ఎయిర్‌టెల్ వినియోగదారు అయినా వారు సబ్‌స్క్రయిబ్ చేసుకున్న ప్లాన్‌తో సంబంధం లేకుండా ఈ ఫీచర్ యొక్క అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు.

Spotify ప్లాట్‌ఫారమ్‌లో త్వరలో 'ఆడియోబుక్స్' కొత్త ఫీచర్!! ఇక బుక్స్ వినవచ్చు...Spotify ప్లాట్‌ఫారమ్‌లో త్వరలో 'ఆడియోబుక్స్' కొత్త ఫీచర్!! ఇక బుక్స్ వినవచ్చు...

నెట్‌వర్క్ కవరేజీ

రిలయన్స్ జియో వినియోగదారులు ఇప్పటికే ఇటువంటి సర్వీసును పొందుతున్నారు. జియో టెల్కో తన కస్టమర్‌లు నెట్‌వర్క్ కవరేజీలో లేనప్పుడు తమకు మిస్డ్ కాల్ వచ్చిందని SMS ద్వారా తెలియజేస్తుంది. ఇది ప్రతిసారీ మొబైల్ యాప్‌కి వెళ్లడం కంటే మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. మీరు ఎయిర్‌టెల్ కస్టమర్ కాకపోతే కనుక మీరు సిమ్ పొందాలని చూస్తే కనుక కంపెనీకి సంబంధించిన ఏదైనా సమీప రిటైల్ స్టోర్‌లను సందర్శించండి లేదా టెల్కో అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు. మీరు మీ ఇంటివద్దనే ఉండి కూడా కొత్త సిమ్‌ని పొందవచ్చు.

భారతీ ఎయిర్‌టెల్ రూ. 1799 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

భారతీ ఎయిర్‌టెల్ రూ. 1799 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

రూ.1799 ధర వద్ద లభించే భారతీ ఎయిర్‌టెల్ యొక్క లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్ మొత్తం 365 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. అయితే ఈ సంవత్సర కాలంలో వినియోగదారులు కేవలం 24GB డేటాను మాత్రమే పొందగలుగుతారు. మీరు మొదటి నెలలోనే 24GB డేటాను ఉపయోగిస్తే కనుక తరువాత ఉచిత డేటా ఉండదు. 24GB డేటా ముగిసిన తర్వాత వినియోగదారుల నుండి 1MBకి 50 పైసలు వసూలు చేస్తామని ఎయిర్‌టెల్ తెలిపింది. అయినప్పటిక మీకు డేటా అవసరమైనప్పుడు మీరు 4G డేటా వోచర్‌ల కోసం వెళ్లవచ్చు. ఇది కాకుండా వినియోగదారులు మొత్తం చెల్లుబాటు కాలంలో అపరిమిత వాయిస్ కాలింగ్ ను పొందుతారు. ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌తో మొత్తం 3600 SMSలను కూడా అదనంగా అందిస్తుంది. అదనంగా మూడు నెలల పాటు అపోలో 24|7 సర్కిల్ సబ్‌స్క్రిప్షన్, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.100 నగదు, ఉచిత హెలోట్యూన్స్ మరియు వింక్ మ్యూజిక్ వంటి ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ఎయిర్‌టెల్ స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్

ఎయిర్‌టెల్ స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్

మీరు మీ యొక్క ఎయిర్‌టెల్ సిమ్‌ను ఎక్కువ కాలం రీఛార్జ్ చేయకపోతే కనుక దానిని కంపెనీ డీయాక్టివేట్ చేయవచ్చు. అంతేకాకుండా SIM యాక్టీవ్ కాకముందే మీరు ఇన్‌కమింగ్ కాల్ సౌకర్యాన్ని కూడా పొందలేరు. మీరు ఎయిర్‌టెల్ నెంబర్ ని అనేక అవసరాల కోసం వినియోగించి ఉండవచ్చు కావున SIM యాక్టివ్‌లో లేకపోతే కనుక మీ యొక్క అన్ని రకాల సేవలు మిస్ అవ్వవచ్చు. అందువల్ల మీ ఎయిర్‌టెల్ SIMని యాక్టివ్‌గా ఉంచుకోవడానికి మీకు అందుబాటులో ఉండే ఎంపిక రూ.99 ధర వద్ద లభించే స్మార్ట్ ప్లాన్. ఈ ప్లాన్ సెకండరీ సిమ్ వినియోగదారుల కోసం మాత్రమే ప్రత్యేకంగా ఉద్దేశించబడింది. సరసమైన ధరల ఎంపికను కోరుకునే వ్యక్తుల కోసం ఇది ఉపయోగకరంగా ఉంటుంది అని గుర్తుంచుకోండి.

ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ ఇప్పుడు తన యొక్క వినియోగదారులకు ఊహించని బహుమతిగా ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండానే రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. అది కూడా ఒక నెల పూర్తి చెల్లుబాటుతో. టెల్కో యొక్క కొత్త ప్లాన్లు రెగ్యులేటర్ TRAI యొక్క ఆర్డర్‌కు అనుగుణంగా వస్తుంది. దీని ప్రకారం ప్రతి సర్వీస్ ప్రొవైడర్ ప్రతి నెలా అదే తేదీన రీఛార్జ్ చేసుకోవడానికి వీలుగా ప్రీపెయిడ్ ప్లాన్‌లను కలిగి ఉండాలి. ఎయిర్‌టెల్ యొక్క ప్రత్యర్థి జియో కూడా ఇటీవల రూ.296 మరియు రూ.259 ధర వద్ద 1-నెల పూర్తి వాలిడిటీతో వచ్చే రెండు ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. మరోవైపు వోడాఫోన్ ఐడియా లేదా Vi కూడా నెలవారీ చెల్లుబాటుతో రూ.337 మరియు రూ.327 వద్ద రెండు ప్లాన్‌లను అందిస్తోంది.

టారిఫ్ పెంపు

టారిఫ్ పెంపు తరువాత భారతీ ఎయిర్‌టెల్ తన యొక్క ప్రీపెయిడ్ ప్లాన్‌ల ARPU ప్రారంభ ధర రూ.200 లక్ష్యంను చేరుకోవడానికి అనుమతిస్తుంది. కానీ మీడియం-టు-లాంగ్ రన్‌లో ఎయిర్‌టెల్ దాని ARPU రూ.300 స్థాయిని అధిగమించాలని కోరుకుంటోంది. దీని అర్థం రాబోయే రోజులలో మరిన్ని ధరల పెంపుదలలను చూడబోతున్నాం.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ విభాగం సర్వీసు కింద నేడు కొత్తగా మూడు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను భారతదేశంలో విడుదల చేసింది. ఈ కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు వినియోగదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఈ జాబితాలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్, సోనీలివ్, లయన్స్‌గేట్, హోయిచోయ్ మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియంతో సహా 17 OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

Best Mobiles in India

English summary
Bharti Airtel Announced 'Smart Missed Call Alert' New Feature: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X