తెలుగులో Airtel డిజిటల్ కేర్
దేశవ్యాప్తంగా భారతీ ఎయిర్‌టెల్‌కు 275 మిలియన్ల పై చిలుకు కస్టమర్లు ఉన్నారు. వారిలో 93.7శాతం మంది ప్రీపెయిడ్ కస్టమర్లే కావటం విశేషం.
భారతదేశపు అతిపెద్ద టెలికం ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్ తమ వినియోగదారులకు మరింత చేరువయ్యే క్రమంలో *121# డిజిటల్ కేర్ ప్లాట్‌ఫామ్‌ను లాంచ్ చేసింది. ఈ సర్వీసుతో తెలుగుతో సహా 10 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు ఈ సేవలను యాక్సిస్ చేసుకునే వీలుంటుంది.

దేశవ్యాప్తంగా భారతీ ఎయిర్‌టెల్‌కు దాదాపుగా 275 మిలియన్ల కస్టమర్లు ఉన్నారు. వారిలో 93.7శాతం మంది ప్రీపెయిడ్ కస్టమర్లే కావటం విశేషం. *121# డిజిటల్ కేర్‌ను సంప్రదించటం ద్వారా ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు తమ ఖతాలోకి అకౌంట్ బ్యాలన్స్, రీచార్జ్ వ్యాలిడిటీ, చివరిగా చేసిన లావాదేవీల తాలుకా సమాచారాన్ని తెలుసుకునే వీలుంటుంది. అంతేకాకుండా ఈ సర్వీసును ఉపయోగించుకుని వాల్యూ యాడెడ్ సర్వీసులను యాక్టివేట్ లేదా డీయాక్టివేట్ చేసుకునే వీలుంటుంది. ఎయిర్‌టెల్ డిజిటల్ కేర్ సర్వీసులను ఉపయోగించుకోవాలనుకునే యూజర్లు తమ మొబైల్ ఫోన్ నుంచి *121#కు డయల్ చేస్తే సరిపోతుంది.


Click it and Unblock the Notifications