ఎయిర్‌టెల్ టీవీ యాప్‌తో ఉచితంగా 6000 సినిమాలు వీక్షించండి

Posted By: BOMMU SIVANJANEYULU

భారతదేశపు అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న భారతీ ఎయిర్‌టెల్ తన ఎయిర్‌టెల్ టీవీ యాప్‌కు సంబంధించి సరికొత్త వర్షన్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది. ఈ కొత్త వర్షన్ యాప్ 300 లైవ్ టీవీ ఛానల్స్‌ను ఆఫర్ చేయగలుగుతుంది. వీటిలో 29 వరకు హెచ్‌డి ఛానల్స్ ఉన్నాయి. 6000లకు పైగా హిట్ సినిమాలతో పాటు పాపులర్ టీవీ కార్యక్రమాలను ఈ కొత్త వర్షన్ యాప్ అందుబాటులో ఉంచుతుంది.

ఎయిర్‌టెల్ టీవీ యాప్‌తో ఉచితంగా 6000 సినిమాలు వీక్షించండి

సరికొత్త యూజర్ ఇంటర్‌ఫేస్‌తో డిజైన్ కాబడిన తమ ఎయిర్‌టెల్ టీవీ యాప్ ఆధునిక స్మార్ట్ మొబైలింగ్ అవసరాలను తీర్చటంతో పాటు పనితీరుపరంగా బెస్ట్-క్లాస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్‌పీరియన్స్‌ను తమ కస్టమర్స్‌కు అందించగలుగుతుందని ఎయిర్‌టెల్ తెలిపింది. న్యూ‌వర్షన్ ఎయిర్‌టెల్ టీవీ యాప్‌ ద్వారా లభ్యమయ్యే కంటెంట్‌ను ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్లతో పాటు పోస్ట్‌పెయిడ్ యూజర్లు జూన్ 2018 వరకు ఉచితంగా సబ్‌స్ర్కైబ్ చేసుకునే వీలుంటుంది.

న్యూ‌వర్షన్ ఎయిర్‌టెల్ టీవీ యాప్‌‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాపిల్ ఐఫోన్ యూజర్లు ఐఓఎస్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే వీలుంటుంది. ప్రస్తుతానికి ఈ యాప్ 15 భాషలను సపోర్ట్ చేస్తుంది. వాటి వివరాలు.. ఇంగ్లీష్, హిందీ, పంజాబీ, బెంగాలీ, గుజరాతీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ,బోజ్ పురీ, అస్సామీస్, ఒడియా, ఫ్రెంచ్ ఇంకా ఉర్దూ.

ప్రస్తుతానికి ఎయిర్‌టెల్ టీవీ.. ఇరోస్ నౌ (Eros Now), సోనీ లైవ్ (SonyLIV), హుక్ (HOOQ) వంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలోనే మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలతో ఎయిర్‌టెల్ టీవీ ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది.

2018లో నోకియా 7 లాంచ్?

ఎయిర్‌టెల్ టీవీ యాప్ పోర్ట్‌ఫోలియోలో మొత్తం 300కు పైగా లైవ్ టీవీ ఛానళ్లు ఉంటాయి. వీటిలో వివిధ జోనర్స్‌కు సంబంధించిన కంటెంట్‌ను యూజర్లు ఆస్వాదించే వీలుంటుంది. హాలీవుడ్, బాలీవుడ్ ఇంకా రీజనల్ లాంగ్వేజెస్‌తో కూడిన 6000 పైచిలుకు బ్లాక్ బాస్టర్ సినిమాలను ఎయిర్‌టెల్ టీవీ యాప్ ద్వారా యాక్సెస్ చేసుకునే వీలుంటుంది.

English summary
The OTT app is designed to deliver the best-in-class entertainment experience to customers in India’s fast-growing smartphone market.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot