Airtel ప్రీపెయిడ్ యూజర్లకు కొత్త సర్వీస్!! రీఛార్జ్ గురించి ఆందోళన అవసరం లేదు....
ఇండియాలోని ప్రముఖ టెలికం ఆపరేటర్లలో ఒకటిగా ఉన్న భారతి ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం కొత్త రకం సేవలను అందిస్తున్నది. కస్టమర్ నిరంతరం ఆందోళన చెందుతున్న విషయాలలో మొదటిది తన ప్రస్తుత ప్లాన్ గడువు తేదీకి చేరుకున్న ప్రతిసారీ కొత్త ప్లాన్‌తో రీఛార్జ్ చేయడం. తక్కువ చెల్లుబాటు యాక్సిస్ తో ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఎంచుకునే వ్యక్తులకు ఇది ఎల్లప్పుడూ ఒక సమస్యగా ఉంటుంది. ఎయిర్‌టెల్ యొక్క సర్వీస్ స్టోర్‌లో దీనికి పరిష్కారంగా వినియోగదారులు మళ్లీ రీఛార్జ్ చేయడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం కొత్తగా 'ఆటోపే' సర్వీసును ప్రారంభించింది. ఇంతకుముందు ఇది టెల్కో యొక్క పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు మాత్రమే అందించేది. ఈ ప్రయోజనం ఇప్పుడు ప్రీపెయిడ్ కస్టమర్లకు కూడా అందుబాటులో ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులకు "ఆటోపే" సర్వీస్
ఎయిర్టెల్ కొత్తగా ప్రారంభించిన "ఆటోపే" సర్వీసుతో వినియోగదారులకు ఎటువంటి ఆలస్యం కాకుండా తదుపరి రీఛార్జిని చేయడానికి సహాయపడుతుంది. ఆటోపే సర్వీస్ తో కస్టమర్ యొక్క తన తదుపరి రీఛార్జిని ఆటోమేట్ చేస్తుంది. కస్టమర్ మళ్లీ రీఛార్జ్ చేయడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆటోపే సర్వీస్ నిర్ధారిస్తుంది. వినియోగదారులు ఎంచుకున్న డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులను జోడించి భవిష్యత్తులో రీఛార్జిల కోసం పేమెంట్ మాధ్యమంగా సెట్ చేయవచ్చు.

ఎయిర్టెల్ "ఆటోపే" సర్వీస్ పనిచేసే విధానం
ఎయిర్‌టెల్ "ఆటోపే" సర్వీస్ గురించి మీరు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. మీ ప్రస్తుత ప్లాన్ గడువు తేదీకి మూడు రోజుల ముందు ఎయిర్‌టెల్ ఆటోపే సర్వీస్ మీ అకౌంటును రీఛార్జ్ చేస్తుంది. ఇందుకోసం మీ బ్యాంక్ అకౌంటు నుండి తగిన మొత్తాన్ని ఆటొమ్యాటిక్ గా కట్ చేయబడుతుంది. ఈ లావాదేవీ గురించి వినియోగదారుల యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో ఎస్ఎంఎస్ ద్వారా రీఛార్జ్ చేయడం గురించి కస్టమర్‌కు తెలియజేయబడుతుంది.

ఎయిర్టెల్ "ఆటోపే" సర్వీస్ ఆన్‌లైన్ పోర్టల్
వినియోగదారులు తమ ప్లాన్ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుత ప్యాక్ గడువుకు మూడు రోజుల ముందు కొత్త ప్యాక్ రీఛార్జ్ అయినప్పటికీ ప్రస్తుత ప్లాన్ యొక్క చెల్లుబాటు ముగిసిన తరువాత మాత్రమే కొత్త రీఛార్జ్ ప్లాన్ యొక్క అన్ని ప్రయోజనాలు యాక్టివేట్ చేయబడతాయి. కస్టమర్ ఆటోపే సర్వీస్ ద్వారా కాకుండా ఏదైనా ఆన్‌లైన్ పోర్టల్ ఉపయోగించి కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఆ సమయంలో ఎయిర్టెల్ ఆటోపే సేవను ఉపయోగించి తదుపరి రీఛార్జ్ తేదీ కొత్తగా రీఛార్జ్ చేయబడిన ప్లాన్ యొక్క గడువు తేదీకి మారుతుంది.

ఎయిర్టెల్ "ఆటోపే" సర్వీసును తొలగించడం
ఏవైనా కొన్ని కారణాల వల్ల కస్టమర్ ఎయిర్‌టెల్ యొక్క "ఆటోపే" సర్వీస్ పట్ల అసంతృప్తిగా ఉంటే కనుక అతడు / ఆమె ఎప్పుడైనా సరే దీనిని డియాక్టీవేట్ చెయ్యవచు. దీని కోసం కస్టమర్ చేయాల్సిందల్లా ఎయిర్‌టెల్ యాప్ లోని వారి అకౌంటుకు వెళ్లి సర్వీస్ పేమెంట్ సెట్టింగ్‌ల నుండి ఆటోపేను తొలగించడం. కానీ అది జరగడానికి కస్టమర్ దాన్ని యాక్టీవేట్ చేసి ఉండాలి. అది కూడా ఎయిర్‌టెల్ యాప్ సహాయంతో చేయవచ్చు.


Click it and Unblock the Notifications