పోస్ట్‌పెయిడ్ సర్వీస్ విభాగంలో అందరిని వెనక్కి నెట్టి రారాజుగా ఎదిగిన Bharti Airtel
భారతదేశంలో అపరిమిత డేటా మరియు వాయిస్ కాలింగ్ ప్రయోజనాలతో ప్రీపెయిడ్ ప్లాన్లు ప్రవేశపెట్టినప్పటి నుండి మార్కెట్ లో పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల గురించి చాలా తక్కువగా చర్చించుకుంటున్నారు. వోడాఫోన్ ఐడియా (Vi) టెల్కో అనేక టన్నుల కొద్దీ ప్రయోజనాలతో కొన్ని అద్భుతమైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్ లను అందిస్తుంది. వీటిలో 'VIP RedX' అని పిలువబడే పోస్ట్‌పెయిడ్ ప్లాన్ అందించే యుటిలిటీ కారణంగా దేశవ్యాప్తంగా వినియోగదారుల నుంచి మంచి ఆదరణను పొందింది. అయితే భారతి ఎయిర్‌టెల్ టెల్కో పోస్ట్‌పెయిడ్ ప్లాన్ మార్కెట్‌కు రాజుగా పేరును పొందింది. దీని గురించి మరిన్నివివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

నంబర్ వన్ పోస్ట్‌పెయిడ్ సర్వీస్ ప్రొవైడర్‌గా ఎయిర్‌టెల్
ఇండియాలో ఎయిర్‌టెల్ టెల్కో పోస్ట్‌పెయిడ్ సర్వీస్ ప్రొవైడర్‌లలో నంబర్ వన్ స్థానాన్ని పొందింది. పోస్ట్‌పెయిడ్ సేవల విషయానికి వస్తే బిజినెస్ టు కన్స్యూమర్ (B2C) కు బదులుగా టెల్కో మార్కెట్‌లోని బిజినెస్ టు బిజినెస్ (B2B) పై ఎక్కువ దృష్టి పెట్టడం కారణంగా మొదటి స్థానాన్ని అందుకోగలిగింది. ఈ టెల్కో ప్రైవేట్ సంస్థలతో మరింత ఎక్కువ భాగస్వామ్యాన్ని అన్వేషిస్తు దాని పోస్ట్ పెయిడ్ సేవలను విక్రయిస్తోంది. ఇది టెల్కో యొక్క స్ట్రోక్‌లో పెద్ద సంఖ్యలో చందాదారులను పొందటానికి సహాయపడుతుంది.

ఎయిర్‌టెల్ టెల్కో 2020 చివరి రెండు త్రైమాసికాలలో సుమారు 1.4 మిలియన్లకు పైగా కొత్త పోస్ట్‌పెయిడ్ చందాదారులను చేర్చుకోగలిగింది. ఈ కొత్త చందాదారులలో B2B భాగస్వామ్యాల నుండి ఎంతమంది వచ్చారో అన్నదాని మీద ఖచ్చితమైన సమాధానం లేదు. ఇది అధిక శాతం వినియోగదారులను కలిగి ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

2020 సెప్టెంబరులో తక్కువ ధరలో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను ప్రారంభించినప్పుడు జియో పోస్ట్‌పెయిడ్ మార్కెట్‌లో మొదటి స్థానానికి చేరుకుంటుంది అని చాలామంది ఉహించిన విషయం. అయితే దీనికి విరుద్ధంగా ఎయిర్‌టెల్ నిరంతరం మార్కెట్లో ఎక్కువ మంది పోస్ట్‌పెయిడ్ వినియోగదారులను జోడిస్తోంది. పోస్ట్‌పెయిడ్ విభాగంలో ఎయిర్‌టెల్ వృద్ధి రేటు స్థిరంగా కొనసాగుతున్నది. పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు చాలా మంది ప్లాన్ ల ధర గురించి పెద్దగా పట్టించుకోకపోయిన అందులో లభించే ప్రయోజనాలు మెరుగ్గా ఉన్నాయి. నెట్‌వర్క్ కవరేజ్, వేగం, జాప్యం మరియు ప్రయోజనాల పరంగా, ఎయిర్‌టెల్ చాలా స్థిరంగా ఉంది మరియు పోస్ట్‌పెయిడ్ మార్కెట్లో ఇది చాలా విజయవంతమైంది.


Click it and Unblock the Notifications








