ఆ 20కోట్లలో మీరు ఒకరా..?

Posted By: Prashanth

ఆ 20కోట్లలో మీరు ఒకరా..?

 

ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని 20 దేశాలకు టెలీ కమ్యూనికేషన్ సర్వీస్‌లను అందిస్తున్న ప్రముఖ సంస్థ ఎయిర్‌టెల్ భారత్‌లో 20కోట్ల మంది వినియోగదారులు సంఖ్యను దాటింది. భారతి ఎయిర్‌టెల్ ఆఫర్ చేస్తున్న 2జీ, 3జీ, 4జీ, ఫిక్సుడ్ లైన్, డీఎస్ఎల్ బ్రాడ్ బ్యాండ్, ఐపీటీవీ, డీటీహెచ్ సర్వీస్‌లను దేశ వ్యాప్తంగా 20 కోట్ల మంది వినియోగించుకుంటున్నారు. గడిచిన మూడు సంవత్సరాల కాలంలో ఏకంగా 10 కోట్ల మంది కొత్త వినియోగదారులను భారతీ ఎయిర్‌టెల్ రాబట్టుకోగలిగింది.

ఈ అంశం పై భారతీ ఎయిర్‌టెల్ సీఈవో(భారత్, దక్షిణ ఆసియా దేశాలు) సంజయ్ కపూర్ స్పందిస్తూ భారతీయ టెలికాం విభాగంలో తాము క్రీయాశీలక బాధ్యతలు చేపట్టటం గర్వకారణంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. పోటీ మార్కెట్‌కు అనుగుణంగా వ్యవహరించటంతో పాటు ఉత్తమమైన సేవలను వినియోగదారుకు అందించడం కారణంగానే మొదటి 14 సంవత్సరాల్లో 10 కోట్లు, తరువాతి మూడు సంవత్సరాల కాలంలో మరో 10 కోట్ల మంది వినియోగదారులను ఆకట్టుకోగలిగినట్లు ఆయన వెల్లడించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot