25 MHz అదనపు స్పెక్ట్రంను మరొక రాష్ట్రంలో మోహరించిన ఎయిర్‌టెల్...
భారతి ఎయిర్‌టెల్ తన యొక్క వినియోగదారులకు మెరుగైన నెట్‌వర్క్‌ను అందించడం కోసం గత కొంతకాలంగా స్పెక్ట్రం విస్తరణను అమలుచేసింది. ఈ టెలికం ఆపరేటర్ ఇప్పుడు పంజాబ్‌లో కూడా తన యొక్క అదనపు స్పెక్ట్రంను మోహరించింది. భారతి ఎయిర్‌టెల్ ఇప్పుడు ఈ రాష్ట్రంలో అదనంగా 25 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రంను జోడించింది. ఈ స్పెక్ట్రం విస్తరణతో గణనీయమైన మరియు మెరుగైన నెట్‌వర్క్‌లను అందించడం కోసం దారి తీస్తుంది. ఇప్పుడు పంజాబ్‌లో 25 MHz అదనపు స్పెక్ట్రంను జోడించడంతో భారతి ఎయిర్‌టెల్ మొత్తంగా 65 MHz స్పెక్ట్రం హోల్డింగ్స్‌ను పలు బ్యాండ్లలో కలిగి ఉంది. వినియోగదారులకు అద్భుతమైన వేగం అందించడానికి ఆపరేటర్ 2300 MHz బ్యాండ్‌లో అత్యధిక స్పెక్ట్రం కలిగి ఉన్నారు.

భారతి ఎయిర్‌టెల్ ఇప్పుడు పంజాబ్‌లో 65 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రంను కలిగి ఉంది. ఈ మొత్తం 65 MHz లో ఆపరేటర్ యొక్క 40 MHz ఎయిర్‌వేవ్‌లు 2300 MHz బ్యాండ్‌లో, 1800 MHz బ్యాండ్‌లో 15 MHz స్పెక్ట్రం మరియు 900 MHz బ్యాండ్‌లో మిగిలిన 10 MHz స్పెక్ట్రంను కలిగి ఉన్నాయి. పంజాబ్‌లో 25 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రంను మోహరించడంతో భారతి ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం నెట్‌వర్క్ సేవలను చాలా గణనీయంగా మెరుగుపరుస్తుంది. టెల్కో యొక్క నెట్‌వర్క్ ఇప్పుడు పెరిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మరియు గరిష్ట సమయంలో వినియోగదారుకు మెరుగైన డేటా అనుభవాన్ని అందిస్తుంది.

భారతీ ఎయిర్‌టెల్ యొక్క అప్పర్ నార్త్ హబ్ CEO మను సూద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని తన వినియోగదారుల కోసం ప్రపంచ స్థాయి నెట్‌వర్క్ సేవలను తీసుకురావడంపై ఆపరేటర్ అధికంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో మొత్తం 65 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌తో ఎయిర్‌టెల్ ఇప్పుడు వినియోగదారులకు ఒకదానితో ఒకటి కనెక్ట్ అవ్వడానికి మరియు వారి డేటా అవసరాలను సజావుగా తీర్చడంలో సహాయపడుతుంది.

ఈ అదనపు స్పెక్ట్రంను అమలు చేస్తున్నప్పుడు భారతి ఎయిర్టెల్ టెల్కో యొక్క దృష్టి 4G మీదనే కాకుండా 5Gని కూడా దృష్టిలో ఉంచుకుంది. ఆపరేటర్ 4G సేవలను మెరుగుపరచడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను మరియు క్యారియర్ అగ్రిగేషన్‌ను కూడా నియమించింది. దానితో పాటు ప్రీ -5G భారీ MIMO వంటి టూల్స్ లను కూడా స్థాపించింది. భారతి ఎయిర్‌టెల్‌కు పంజాబ్‌లో 11.53 మిలియన్లకు పైగా కస్టమర్లు ఉన్నారు. ఈ కస్టమర్‌లు అదనపు స్పెక్ట్రం యొక్క విస్తరణ కారణంగా గరిష్టంగా యూజర్లు డేటాను ఉపయోగించిన కూడా వారు నెట్‌వర్క్ రద్దీని ఎదుర్కోరు. భారతి ఎయిర్‌టెల్ భవిష్యత్తులో 5G సేవలను అందించడానికి స్పెక్ట్రంను ఉపయోగించుకుంటుంది.

భారతి ఎయిర్టెల్ టెల్కో ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ మరియు ఈశాన్య ప్రాంతాలతో సహా భారతదేశంలోని కీలకమైన రాష్ట్రాలలో మరియు వాటి యొక్క ప్రాంతాలలో అదనపు స్పెక్ట్రంను మోహరించింది. రాబోయే రోజుల్లో ఆపరేటర్ ఇతర సర్కిల్‌లలో కూడా తన అదనపు స్పెక్ట్రంను మోహరించవచ్చు. ఎయిర్టెల్ యొక్క పోటీ టెల్కో జియో ఇప్పటికే తన అదనపు స్పెక్ట్రంను రెండు తెలుగు రాష్ట్రాలలో మోహరించింది. జియోను ఎదురుకోవడం కోసం ఎయిర్టెల్ కూడా తన యొక్క విస్తరణను అమలుచేస్తున్నది.


Click it and Unblock the Notifications