స్కైప్, వైబర్ కాల్స్‌కు అదనపు చార్జ్ లేదు

Posted By:

స్కైప్, వైబర్ వంటి ఉచిత వాయిస్ కాలింగ్ అప్లికేషన్ లను వినియోగించుకుని మొబైల్ ఇంటర్నెట్ ద్వారా వాయిస్ కాల్స్ కు పాల్పడితే చార్జ్ వసూలు చేస్తామన్న ప్రతిపాదనను ప్రముఖ టెలికం ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్ ఉపసంహరించుకుంది.

స్కైప్, వైబర్ కాల్స్‌కు అదనపు చార్జ్ లేదు

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఉచిత వాయిస్ కాలింగ్ యాప్స్ ద్వారా మొబైల్‌తో చేసే ఇంటర్నెట్ కాల్స్‌కు చార్జ్ చేయనున్నట్లు ఎయిర్‌టెల్ కొద్ది రోజుల క్రింత ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ నేపధ్యంలో అన్ని వైపుల నుంచి తీవ్రమైన నిరసన వ్యక్తం కావటంతో ప్రతిపాదనను ఎయిర్ టెల్ విరమించుకుంది.

వాయిస్ ఆన్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (వీఓఐపీ) కోసం ప్రత్యేక డేటా ప్యాక్‌లను తీసుకురావటం లేదని ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది. ఈ అంశానికి సంబంధించి టెలికం శాఖ త్వరలోనే ఓ పత్రాన్ని విడుదల చేయనున్న నేపధ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపింది. స్కైప్, వైబర్ తదితర ఉచిత వాయిస్ కాలింగ్ యాప్‌లు ఉచిత ఇంటర్నెట్ కాల్స్‌కు అనమతిస్తున్న విషయం తెలిసిందే.

English summary
Bharti Airtel Drops Plan to Charge Extra on Voip Calls. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot