Home
News

T20 ప్రపంచకప్ కోసం ఎయిర్‌టెల్ ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్‌లు....

ఇండియాలో క్రికెట్ కు ఉండే ఆదరణ మరొక ఆటకు లేదు. మరి ముఖ్యంగా ప్రపంచకప్ వస్తుంటే కనుక అందరు క్రికెట్ మ్యాచ్ చూడడానికి అధికంగా ఇష్టపడతారు. ఇంతకు ముందు టీవీలలో చూసే వారు ఇప్పుడు ప్రతి ఒక్కరు తమ స్మార్ట్ ఫోన్లలోనే ఎక్కడ ఉన్న కూడా చూస్తున్నారు. క్రికెట్ ప్రియులను ఆకట్టుకోవడం కోసం భారతీ ఎయిర్‌టెల్ ఇప్పుడు కొత్తగా మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది.

డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌

రూ.499, రూ.699 మరియు రూ.2,798 ధరల వద్ద లభించే ఈ మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లు వినియోగదారులకు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ప్లాన్‌కి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ని అందిస్తుంది. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటుగా ఎయిర్‌టెల్ నుండి వచ్చిన ఈ కొత్త ప్లాన్‌లు మూడు నెలల పాటు అపోలో 24/7 సర్కిల్ మెంబర్‌షిప్, దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు షా అకాడమీ కోర్సులను ఉచితంగా అందిస్తాయి. వీటి గురించి మరిన్ని వివరాలను పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ - డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌

ఎయిర్‌టెల్ - డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌

ఎయిర్‌టెల్ టెల్కో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు డిస్నీ+ హాట్‌స్టార్ లైబ్రరీకి అపరిమిత మరియు ఉచిత యాక్సెస్‌తో వస్తాయి. ఇందులో 100,000 గంటల ఆకర్షణీయమైన కంటెంట్ మరియు IPL మరియు T20 వరల్డ్ కప్ వంటి గ్లోబల్ స్పోర్ట్స్ ఈవెంట్‌ల లైవ్ కవరేజ్ ఉన్నాయి. స్పోర్ట్స్ ఈవెంట్‌ల లైవ్ స్ట్రీమింగ్‌తో పాటు ఈ కొత్త ఎయిర్‌టెల్ ప్లాన్‌లు ఎనిమిది స్థానిక భాషలలో కొత్త హాట్‌స్టార్ స్పెషల్ సిరీస్‌లు, హాట్‌స్టార్ మల్టీప్లెక్స్ బ్యానర్‌లో విడుదలైన సినిమాలు, డిస్నీ లైబ్రరీ టైటిల్స్, డిస్నీ+ ఒరిజినల్స్ మరియు స్టార్ ఇండియా నెట్‌వర్క్ యొక్క టీవీ షోల విస్తృత టీవీ ప్రీమియర్లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తాయి.

ఎయిర్‌టెల్ రూ.499 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.499 ప్లాన్

ఎయిర్‌టెల్ కొత్తగా ప్రారంభించిన మొదటి ప్లాన్ రూ.499 ధర వద్ద లభించే ప్లాన్ యొక్క పూర్తి వివరాల విషయానికి వస్తే ఇది వినియోగదారులకు రోజుకు 3GB డేటా, రోజుకు 100 SMS మరియు అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాల్‌ల ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాకుండా అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే ఇది డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచిత యాక్సెస్‌ మరియు షా అకాడమీ కోర్సులకు ఉచిత యాక్సెస్ తో పాటుగా 3 నెలల అపోలో 24/7 సర్కిల్ మెంబర్‌షిప్ అందిస్తుంది. ఇది 28 రోజుల చెల్లుబాటు కాలంతో లభిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ.699 ప్లాన్‌

ఎయిర్‌టెల్ రూ.699 ప్లాన్‌

ఎయిర్‌టెల్ టెల్కో రూ.699 ధర వద్ద అందించే రీఛార్జ్ ప్లాన్‌ యొక్క అన్ని రకాల ప్రయోజనాల విషయానికి వస్తే ఇది రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMS మరియు అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాల్‌లను అందిస్తుంది. అలాగే అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే ఒక సంవత్సరం ఉచిత డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, అపోలో 24/7 సర్కిల్‌కు మూడు నెలల సభ్యత్వం మరియు షా అకాడమీ కోర్సులకు ఉచిత యాక్సెస్‌ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా ఎయిర్‌టెల్ యొక్క రూ.699 ప్లాన్ 56 రోజుల చెల్లుబాటును కలిగి ఉంది.

ఎయిర్‌టెల్ రూ.2,798 ప్లాన్‌

ఎయిర్‌టెల్ రూ.2,798 ప్లాన్‌

చివరగా ఎయిర్‌టెల్ రూ.2,798 ధర వద్ద లభించే ప్లాన్‌లో రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMS మరియు అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాల్‌ల ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే ఏడాది పాటు ఉచిత డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ మెంబర్‌షిప్, అపోలో 24/7 సర్కిల్ సభ్యత్వం మరియు షా అకాడమీ ఉచిత కోర్సులు వంటివి అదనంగా కూడా ఉన్నాయి. ఇది 365 రోజులకు చెల్లుబాటు అయ్యే దీర్ఘకాలిక ప్రణాళిక కావున సంవత్సరంలో ఒకసారి రీఛార్జ్ చేస్తే సరిపోతుంది. ఎయిర్‌టెల్ వినియోగదారులు ఈ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకుంటే కనుక ఎటువంటి అదనపు సబ్‌స్క్రిప్షన్ చెల్లించకుండానే T20 ప్రపంచకప్‌ యొక్క అన్ని మ్యాచ్ లను ఉచితంగా చూడటానికి అవకాశం ఉంటుంది.

జియో యొక్క 4.7% వృద్ధికి వ్యతిరేకంగా ఎయిర్‌టెల్ 7.1% సీక్వెన్షియల్ గ్రోత్‌

జియో యొక్క 4.7% వృద్ధికి వ్యతిరేకంగా ఎయిర్‌టెల్ 7.1% సీక్వెన్షియల్ గ్రోత్‌

2021 జూలై-సెప్టెంబర్ కాలంలో జియో 4.7% తో పోలిస్తే భారతీ ఎయిర్‌టెల్ 7.1% సీక్వెన్షియల్ వృద్ధిని సాధించింది. ఇంకా భారతీ ఎయిర్‌టెల్ యొక్క ARPU 7.3% QoQ నుండి రూ.157 కి జంప్ చేయవచ్చని జెఫరీస్ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో జియో యొక్క ARPU 1.3% పెరిగి రూ.140 కి చేరుకున్నది. ఏదేమైనా రిలయన్స్ జియో త్రైమాసికంలో దాదాపు 14 మిలియన్ వినియోగదారుల బలమైన చందాదారుల చేర్పును నివేదిస్తుందని భావిస్తున్నారు. వృద్ధి వెనుక కారణం జియోఫోన్ 2021 ఆఫర్ అని భావిస్తున్నారు మరియు టెల్కో యొక్క మొత్తం చందాదారుల సంఖ్య FY22 రెండవ త్రైమాసికంలో 454 మిలియన్లకు చేరుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Bharti Airtel Introduced Special Prepaid Plans For The T20 Cricket World Cup
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X