బెంగుళూరు వాసులకు త్వరలో ఎయిర్‌టెల్ 4జీ వాయిస్ సేవలు!!

Posted By:

బెంగుళూరు వాసుల కోసం భారతీ ఎయిర్‌టెల్ త్వరలో 4జీ ఎల్టీఈ వాయిస్ సర్వీసులను అందుబాటులోకి తీసుకు రాబోతుంది. ఎల్టీఈ ఆధారిత ఫోన్‌లను ఈ సర్వీస్ సపోర్ట్ చేస్తుంది. రాబోయే మూడు వారాల్లో ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకురానున్నారు. భారతీ ఎయిర్‌టెల్ ఇప్పటికే 4జీ డేటా సర్వీసులను బెంగుళూరు, కోల్‌కతా, పూణే, చంఢీగఢ్, మెహాలీ వంటి పట్టణాల్లో విడుదల చేసింది.

బెంగుళూరు వాసులకు త్వరలో ఎయిర్‌టెల్ 4జీ వాయిస్ సేవలు!!

భారతదేశపు స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలలో ఒకటైన జోలో తన మొట్టమొదటి 4జీఎల్టీఈ ఫోన్‌ను త్వరలో విడుదల చేయబోతోంది. మరోవైపు మైక్రోమ్యాక్స్ తన మొట్టమొదటి 4జీ ఎల్టీఈ స్మార్ట్‌ఫోన్‌ను డిసెంబర్‌లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే జోలో స్మార్ట్‌ఫోన్ పేరు ‘ఎల్ టి900'. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి అనుమానాస్పద ఫోటో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత వేగవంతం చేస్తూ ఆవిర్భవించిన ‘4జీ' నెట్‌వర్క్ దాటికి ‘3జీ' విప్లవం చప్పబడుతోంది. 4జీ నెట్‌వర్క్ డేటా‌స్పీడ్ సామర్యం హై మొబిలిటీ కమ్యూనికేషన్ వాతావరణంలో సెకనుకు 100MBగా, ‘లో మొబిలిటీ కమ్యూనికేషన్ వాతావరణంలో సెకనుకు 1 జీబిగా ఉంది. ఈ నేపధ్యంలో అందరి దృష్టి 4జీ వ్యవస్థను సపోర్ట్ చేసే గ్యాడ్జెట్ల పైనే పడింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot