Airtel అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌ల జాబితాలో మూడు కొత్త ప్లాన్‌లు

|

మీరు తరచూ విదేశాలకు వెళతారా? అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌లను యాక్టివేట్ చేయడం మీరు తరచుగా మర్చిపోతున్నారా? అలాంటి సమస్యలకు చెక్ చెప్పడానికి ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ మరియు ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్ల సమూహాన్ని విడుదల చేసింది.

ఎయిర్‌టెల్

మరి ముఖ్యంగా తరచూ విదేశాలకు వెళుతున్న వినియోగదారులకు వారి యొక్క అనుభవాన్ని మరింత సరళీకృతం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని కొన్ని కొత్త ఫీచర్లను విడుదల చేసారు. భారతీ ఎయిర్‌టెల్ ఈ రోజు అంతర్జాతీయ ప్రయాణికుల కోసం రూ .799, రూ .1,199, రూ.4,999 ధరలతో కొత్త ప్లాన్‌లను ప్రవేశపెట్టింది.

 

 

Realme 6-Series: సల్మాన్ చేతిలో కొత్త ఫోన్... కొద్దీ రోజులలోనే లాంచ్Realme 6-Series: సల్మాన్ చేతిలో కొత్త ఫోన్... కొద్దీ రోజులలోనే లాంచ్

రియల్ టైమ్ యూజ్ ట్రాకింగ్

రియల్ టైమ్ యూజ్ ట్రాకింగ్

ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్‌లతో పాటు అంతర్జాతీయ ప్రయాణికులకు వారి యొక్క అనుభవాన్ని మెరుగుపరచడానికి ఎయిర్‌టెల్ కొత్త ఫీచర్లను కూడా తీసుకువస్తోంది. ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లో ‘రియల్ టైమ్ యూజ్ ట్రాకింగ్' అనే కొత్త ఫీచర్‌ను ఎయిర్‌టెల్ చేర్చారు.

 

 

Amazon Fab Phone Fest: మతిపోయే డిస్కౌంట్ ఆఫర్స్....Amazon Fab Phone Fest: మతిపోయే డిస్కౌంట్ ఆఫర్స్....

ఐఆర్ ప్యాక్‌

ఐఆర్ ప్యాక్‌

అంతర్జాతీయ ప్రయాణికులు ఇప్పుడు ప్రయాణ తేదీకి 30 రోజుల ముందు ఐఆర్ ప్యాక్‌లను ప్రీ-బుక్ చేసుకోవచ్చు మరియు వినియోగదారు అంతర్జాతీయ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయినప్పుడే ప్యాక్ ప్రామాణికత స్వయంచాలకంగా ప్రారంభమవుతుంది. ఇంకా ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం ‘గ్లోబల్ ప్యాక్స్' తీసుకువస్తోంది. ఇది కేవలం ఒక ప్యాక్‌తో ప్రపంచవ్యాప్తంగా సజావుగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది.

 

 

Realme X50 Pro 5G,iQOO 3 5G: ఇండియా మొదటి 5G ఫోన్ల సేల్స్ & ఆఫర్స్...Realme X50 Pro 5G,iQOO 3 5G: ఇండియా మొదటి 5G ఫోన్ల సేల్స్ & ఆఫర్స్...

రోమింగ్ ప్యాక్

రోమింగ్ ప్యాక్

ఎయిర్‌టెల్ యొక్క ఈ క్రొత్త ఫీచర్లు వినియోగదారులకు వారి అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్ వాడకాన్ని సరైన సమయంలో ట్రాక్ చేయటమే కాకుండా వారి ప్రయాణ తేదీకి 30 రోజుల ముందు అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌ను ప్రీ-బుక్ చేసుకోవడానికి కూడా అనుమతిస్తుంది.

 

BSNL Vs Jio: కొత్త చందాదారుల చేరికలో అందరిని అధిగమించిన బిఎస్‌ఎన్‌ఎల్BSNL Vs Jio: కొత్త చందాదారుల చేరికలో అందరిని అధిగమించిన బిఎస్‌ఎన్‌ఎల్

అంతర్జాతీయ మొబైల్ నెట్‌వర్క్‌

అంతర్జాతీయ మొబైల్ నెట్‌వర్క్‌

వినియోగదారుడు అంతర్జాతీయ మొబైల్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయినప్పుడు మాత్రమే ముందుగా బుక్ చేసిన ఐఆర్ ప్యాక్ ప్రారంభమవుతుంది. ఐఆర్ ప్యాక్ యాక్టీవ్ అయిన వెంటనే వారికి ఎటువంటి అదనపు ఖర్చులు కూడా ఉండవని నిర్ధారిస్తుంది. ముఖ్యంగా ఈ ఫీచర్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు ఇప్పటికే అందుబాటులో ఉంది. ఇప్పుడు కంపెనీ దానిని ప్రీపెయిడ్ వినియోగదారులకు కూడా అందిస్తోంది.

 

 

WhatsApp హిడెన్ ఫీచర్ యొక్క పూర్తి సమాచారంWhatsApp హిడెన్ ఫీచర్ యొక్క పూర్తి సమాచారం

ఎయిర్‌టెల్ క్రొత్త ఫీచర్‌

ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టిన క్రొత్త ఫీచర్‌లలో భాగంగా ఎయిర్‌టెల్ వినియోగదారులు ఏదైనా అధిక వినియోగం కారణంగా వారి యొక్క ఐఆర్ ప్యాక్ అయిపోయినప్పుడు ఏదైనా అవాంఛిత ఛార్జీల నుండి రక్షించబడుతుందని నిర్ధారిస్తుంది. ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ద్వారా ప్రయాణంలో కస్టమర్లు మరొక ప్యాక్ లేదా టాప్ అప్ తీసుకోవచ్చు అని ఎయిర్టెల్ తెలిపింది.

 

 

OPPO F15: అద్భుతమైన డిజైన్లతో RS.20,000లోపు రూపొందించిన స్మార్ట్‌ఫోన్OPPO F15: అద్భుతమైన డిజైన్లతో RS.20,000లోపు రూపొందించిన స్మార్ట్‌ఫోన్

ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ట్రావెల్ బేసిక్స్  గ్లోబల్ ప్యాక్‌లు

ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ట్రావెల్ బేసిక్స్ గ్లోబల్ ప్యాక్‌లు

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రెండు అంతర్జాతీయ ట్రావెల్ బేసిక్స్ ప్యాక్‌లను ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టింది.

*** ఎయిర్‌టెల్ యొక్క రూ.1,199 ప్యాక్ 1GB డేటాతో పాటు ఇండియా మరియు హోస్ట్ కంట్రీకి 100 నిమిషాల ఇన్కమింగ్ మరియు అవుట్గోయింగ్ కాల్స్ ను అందిస్తుంది. అదనంగా వినియోగదారులు 30 రోజుల పాటు అపరిమిత ఇన్‌కమింగ్ SMS లను పొందుతారు.

 

 

Poco X2 Review in Telugu: 120HZప్యానల్,27W ఫాస్ట్ చార్జర్, బెస్ట్ ఫీచర్లుPoco X2 Review in Telugu: 120HZప్యానల్,27W ఫాస్ట్ చార్జర్, బెస్ట్ ఫీచర్లు

 

రూ.799 ప్యాక్

*** ఎయిర్‌టెల్ యొక్క రూ.799 ప్యాక్ తో వినియోగదారులు ఇండియా మరియు హోస్ట్ దేశానికి 100 నిమిషాల ఇన్‌కమింగ్ మరియు అవుట్గోయింగ్ కాల్‌లను అందిస్తుంది. యూజర్లు 30 రోజుల పాటు అపరిమిత ఇన్‌కమింగ్ ఎస్‌ఎంఎస్‌లను కూడా పొందుతారు. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు ఎటువంటి డేటా ప్రయోజనం లభించదు.

 

 

Rs.1,299 Annual Prepaid ప్లాన్ యొక్క వాలిడిటీని తగ్గించిన రిలయన్స్ జియోRs.1,299 Annual Prepaid ప్లాన్ యొక్క వాలిడిటీని తగ్గించిన రిలయన్స్ జియో

ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం అపరిమిత ప్యాక్‌లు

ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం అపరిమిత ప్యాక్‌లు

ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల ఇద్దరి కోసం రూ.4,999 ధర వద్ద 30 రోజుల వాలిడిటీ కాలంలో రోజుకు 1GB డేటాతో ప్రయోజనంతో పాటు అపరిమిత ఇన్‌కమింగ్ కాల్స్ మరియు ఇండియా మరియు హోస్ట్ కంట్రీకి 500 నిమిషాల అవుట్‌గోయింగ్ కాల్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదనంగా 10 రోజుల పాటు అపరిమిత ఇన్‌కమింగ్ ఎస్‌ఎంఎస్‌లను కూడా అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Bharti Airtel Launched International Roaming Packs

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X