Home
News

ఎయిర్‌టెల్ యూజర్లకు శుభవార్త!! 30 రోజులపాటు ఉచితంగా సర్వీసులు...

భారతదేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ అయిన భారతీ ఎయిర్‌టెల్ ఇటీవల తన యొక్క వినియోగదారులను మరింతగా ఆకట్టుకోవడానికి ఎయిర్‌టెల్ బ్లాక్ అనే బండిల్ కొత్త సర్వీస్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇది కూడా ఎయిర్‌టెల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఎయిర్‌టెల్ బ్లాక్ అనేది దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్ల కోసం ప్రస్తుతం అందుబాటులో ఉంది. అయితే ఈ ఎయిర్‌టెల్ ప్లాన్‌లు దేశంలో ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు భారతీ ఎయిర్‌టెల్ కొత్తగా ప్రవేశపెట్టిన ఎయిర్‌టెల్ బ్లాక్ యొక్క సర్వీసులను కస్టమర్‌లకు 30 రోజుల పాటు ఉచితంగా అందిస్తోంది. అయితే ఈ ఉచిత ఆఫర్ ను పొందడానికి కొన్ని నిబంధనలు మరియు షరతులు ఉన్నాయి. వీటి యొక్క వివరాలను మరింతగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ బ్లాక్ యూజర్లకు 30 రోజుల ఉచిత సేవలు

ఎయిర్‌టెల్ బ్లాక్ యూజర్లకు 30 రోజుల ఉచిత సేవలు

భారతీ ఎయిర్‌టెల్ తన కొత్త ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్‌లను మూడు విభిన్నవిభాగాలలో అద్భుతమైన సేవలను అందిస్తోంది. ఈ ఆఫర్‌కి అర్హత పొందడానికి వినియోగదారులు రెండు లేదా అంతకంటే ఎక్కువ సేవలను ఎంచుకునే అవకాశం ఉంది. అయితే ఎయిర్‌టెల్ బ్లాక్ ఫామిలీలో భాగం కావడానికి మీకు కనీసం ఒక ప్రాథమిక పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ ను కలిగి ఉండాలి. వినియోగదారులు ఆ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను డైరెక్ట్-టు-హోమ్ (DTH) కనెక్షన్ లేదా ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ లేదా రెండింటిలోనూ టాప్ చేయవచ్చు.

ఎయిర్‌టెల్ యొక్క 30 రోజుల ఉచిత సర్వీసును పొందే విధానం

ఎయిర్‌టెల్ యొక్క 30 రోజుల ఉచిత సర్వీసును పొందే విధానం

ఎయిర్‌టెల్ బ్లాక్ కస్టమర్లు తమ ప్రస్తుత సర్వీసుకు కొత్త సర్వీస్‌ని జోడించినప్పుడు ఉచితంగా 30 రోజులపాటు అన్ని రకాల సేవలను పొందవచ్చు. దీని అర్థం వినియోగదారుడు ఇప్పటికే టెల్కో యొక్క పోస్ట్‌పెయిడ్ మొబైల్ సేవలలో ఉంటే మరియు డిటిహెచ్ కనెక్షన్ లేదా ఫైబర్ కనెక్షన్‌తో కొత్తగా మరొక సేవను జోడించాలనుకుంటే కనుక కొత్త సర్వీసును ఒక నెల పాటు ఉచితంగా పొందుతారు.

బ్లాక్‌ ప్లాన్

టెల్కో యొక్క DTH సమర్పణలో చాలా ప్లాన్లను కలిగి ఉన్నందున రూ.465 ప్లాన్‌ను వినియోగదారులకు ఉచితంగా అందించాలని కంపెనీ నిర్ణయించింది. అయితే ఎయిర్‌టెల్ బ్లాక్‌ ప్లాన్ తో వినియోగదారులు అధిక ప్రయోజనాలను పొందుతారు. ఎయిర్‌టెల్ బ్లాక్ కస్టమర్‌గా ఉండే అతిపెద్ద దీర్ఘకాలిక ప్రయోజనాల్లో ఒకటి కంపెనీ నుండి స్టాండర్డ్ సర్వీసును పొందడం. అలాగే కంపెనీ నుండి అన్ని సేవల కోసం వినియోగదారులు ఒకే బిల్లును పొందుతారు.

భారతీ ఎయిర్‌టెల్ డేటా ప్యాక్‌ల అదనపు ఆఫర్స్

భారతీ ఎయిర్‌టెల్ డేటా ప్యాక్‌ల అదనపు ఆఫర్స్

భారతీ ఎయిర్‌టెల్ టెల్కో తన వినియోగదారుల కోసం ఇప్పుడు కొత్తగా రూ. 401, రూ .248 మరియు రూ. 78 ధరల వద్ద లభించే మూడు డేటా ప్యాక్‌లు ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాలతో వస్తాయి. ఈ మూడు ప్లాన్‌లలో రూ. 401 ప్లాన్ వినియోగదారులకు డిస్నీ+ హాట్‌స్టార్ VIP ప్రయోజనంతో 28 రోజుల చెల్లుబాటు కాలానికి 30GB మొత్తం డేటాను అందిస్తుంది. అలాగే రూ.249 మరియు రూ.78 ధరల వద్ద లభించే ప్లాన్ వినియోగదారులకు వరుసగా 25GB డేటా మరియు 5GB డేటాను వినియోగదారులకు అందిస్తుంది. ఈ రెండు ప్లాన్‌ల వ్యాలిడిటీలు యూజర్ యొక్క బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ కు సమానంగా ఉంటాయి. ఉదాహరణకు వినియోగదారుడు 30 రోజుల చెల్లుబాటును కలిగి ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్‌లో ఉంటే ఆ సమయంలో కొనుగోలు చేసిన ఈ డేటా ప్లాన్‌లలో (రూ.249 లేదా రూ.78) కూడా 30 రోజుల చెల్లుబాటుతో వస్తాయి. అంటే మీరు పొందే అదనపు డేటా ఈ వాలిడిటీ కాలంలో ఎప్పుడైనా వినియోగించడానికి అవకాశం ఇస్తుంది.

ఎయిర్‌టెల్ పేమెంట్స్

కోవిడ్ సమయంలో కస్టమర్‌లు తమ ఇంటి వద్దనే బ్యాంకింగ్ సేవలను ఉపయోగించడం కోసం చూశారు. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ మిలియన్ల మంది భారతీయులకు ఆర్థిక సేవలు అందేంత వరకు ఉండేలా తన రిటైల్ ఆధారిత బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ను పెంచడంతో తన సర్వీస్ ను ఇప్పటికి సమర్థవంతంగా నడుపుతూనే ఉంది. AePS ప్లాట్‌ఫామ్ ద్వారా ఆధార్ ఎనేబుల్ చేయబడిన బ్యాంక్ అకౌంట్ ఉన్న ఇతర బ్యాంకుల ఖాతాదారులకు కూడా బ్యాంక్ సేవలు అందించగలిగింది. FY21 లో AePS ద్వారా నగదు విత్డ్రా లావాదేవీలు ప్రతి త్రైమాసికానికి 10% పైగా వృద్ధిని నమోదు చేసింది.

Best Mobiles in India

English summary
Bharti Airtel Launches 30 days of Free Black Services: Here are Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X