ఎయిర్‌టెల్‌ కొత్త ప్లాన్ తో 336రోజులు ఉచితంగా మాట్లాడుకోండి

సునీల్ మిట్టల్ అధినేతగా ముందుకు వెళుతున్న దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది.

|

సునీల్ మిట్టల్ అధినేతగా ముందుకు వెళుతున్న దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది.జియోతో పోటాపోటీగా దూసుకుపోతున్న ఈ దిగ్గజం మార్కెట్లోకి రెండు కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది. ప్రీపెయిడ్‌ కస్టమర్లకోసం ఈ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్లతో ముందుకు వచ్చింది . టెలికాం కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం భారతీ ఎయిర్‌టెల్‌ రెండు ప్లాన్లను లాంచ్‌ చేసింది. వాటిల్లో ఒకటి రూ.998 ప్లాన్ కాగా, రెండవది రూ. 597 ప్లాన్.

 

ఫిబ్రవరి 7న దిగ్గజాలకు షాక్ ఇవ్వడానికి రెడీ అయిన మోటోరోలాఫిబ్రవరి 7న దిగ్గజాలకు షాక్ ఇవ్వడానికి రెడీ అయిన మోటోరోలా

రూ.998 ప్లాన్....

రూ.998 ప్లాన్....

ఈ కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌ కింద ఎలాంటి రోజువారీ పరిమితులు లేకుండా 336 రోజుల పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌, నెలకు 300 ఎస్‌ఎంఎస్‌లు, 12 జీబీ డేటాను యూజర్లు పొందవచ్చు .

రూ. 597 ప్లాన్...

రూ. 597 ప్లాన్...

ఈ కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌ కింద ఎలాంటి రోజువారీ పరిమితులు లేకుండా 168 రోజుల పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌, నెలకు 300 ఎస్‌ఎంఎస్‌లు, 6 జీబీ డేటాను యూజర్లు పొందవచ్చు .

తక్కువ డేటా వినియోగించే వారు....
 

తక్కువ డేటా వినియోగించే వారు....

తక్కువ డేటా వినియోగించే వారు, దీర్ఘకాలం వ్యాలిడిటీని కోరుకునే కస్టమర్లను ఉద్దేశించి తీసుకొచ్చిన ప్లాన్లు గా ఇది అనిపిస్తుంది.అయితే ఈ ప్లానల్ను రీఛార్జి హెసుకున్న యూజర్లు ఎయిర్‌టెల్‌ యాప్ ను ఫ్రీ గా యాక్సిస్ చేసుకోవచ్చు.

ఎయిర్‌టెల్‌ రెండు రోజుల క్రితం  రూ.1699 వార్షిక ప్లాన్ ను లాంచ్చేసింది

ఎయిర్‌టెల్‌ రెండు రోజుల క్రితం రూ.1699 వార్షిక ప్లాన్ ను లాంచ్చేసింది

365 రోజుల వ్యాలిడిటీతో ఎయిర్‌టెల్ అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రీపెయిడ్ ప్లాన్ రూ.1,699 ధర ట్యాగ్‌తో లభ్యమవుతోంది. 365 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో భాగంగా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజు 100 ఎస్సెమ్మెస్‌లు, 1జీబీ డేటాను వినియోగించుకోవచ్చు.

 

 

Best Mobiles in India

English summary
Bharti Airtel Launches Rs 998 and Rs 597 Long-Validity Prepaid Plans.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X