Home
News

యూజర్లకు Airtel భారీ షాక్, 3జీ నెట్‌వర్క్ షట్‌డౌన్ !

టెల్కోల్లో అగ్రస్థానంలో దూసుకుపోతున్న Airtel యూజర్లకు భారీగానే షాకివ్వబోతోందని కథనాలు వెలువడుతున్నాయి.

టెల్కోల్లో అగ్రస్థానంలో దూసుకుపోతున్న Airtel యూజర్లకు భారీగానే షాకివ్వబోతోందని కథనాలు వెలువడుతున్నాయి. తమ 3జీ నెట్‌వర్క్ సర్వీసులను మూసివేయనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. 3జీ మీద ఇకపై ఎలాంటి ఖర్చు చేయబోమని 4జీ వైపే మా దృష్టిని నిలుపుతున్నామని కంపెనీకి చెందిన అధికారులు చెబుతున్నారు.

వచ్చే 3-4 ఏళ్లలో..

వచ్చే 3-4 ఏళ్లలో..

టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ వచ్చే 3-4 ఏళ్లలో కంపెనీ తన 3జీ సర్వీసులను రద్దు చేయబోతున్నట్టు తెలిసింది. వాటి స్పెక్ట్రమ్‌లను 4జీ సర్వీసులకు జత చేయనున్నట్టు కంపెనీకి చెందిన ఓ టాప్‌ అధికారి చెప్పారు.

 3జీ సర్వీసులపై ఎలాంటి ఖర్చులు..

3జీ సర్వీసులపై ఎలాంటి ఖర్చులు..

ప్రస్తుతం 3జీ సర్వీసులపై ఎలాంటి ఖర్చులు చేయడం లేదని, వచ్చే 3 లేదా 4 ఏళ్లలో 2జీ నెట్‌వర్క్‌ కంటే ఎంతో వేగవంతంగా 3జీ నెట్‌వర్క్‌ మూతపడే అవకాశముందని భారతీ ఎయిర్‌టెల్‌ దక్షిణాసియా, ఇండియా సీఈవో, ఎండీ గోపాల్‌ విట్టల్‌ తెలిపారు.

4జీ టెక్నాలజీలో కంపెనీ ఎక్కువగా పెట్టుబడులు ..

4జీ టెక్నాలజీలో కంపెనీ ఎక్కువగా పెట్టుబడులు ..

తమ నెట్‌వర్క్‌లో ఎక్కువ డేటా సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం కోసం 4జీ టెక్నాలజీలో కంపెనీ ఎక్కువగా పెట్టుబడులు పెట్టనున్నట్టు ఆయన చెప్పారు.

అధికభాగం 4జీకి ..

అధికభాగం 4జీకి ..

ప్రస్తుతం 3జీ, 4జీ సర్వీసుల కోసం కంపెనీ 2100 మెగాహెడ్జ్‌ బ్యాండ్‌లను వాడుతోంది. తమ స్పెక్ట్రమ్‌లో అధికభాగం 4జీకి కేటాయిస్తున్నామని, దీని కోసం తాము రేడియో యూనిట్లను కలిగి ఉండాలని విట్టల్‌ పేర్కొన్నారు.

కొన్ని టెలికాం సర్కిళ్లలో..

కొన్ని టెలికాం సర్కిళ్లలో..

కొన్ని టెలికాం సర్కిళ్లలో కంపెనీ మోడరన్‌ 3జీ పరికరాలను ఇన్‌స్టాల్‌ చేస్తుందని, అవి 4జీ సర్వీసులను సపోర్టు చేస్తాయని  గోపాల్ విట్టల్ తెలిపారు.

3జీ సర్వీసుల కోసం అమర్చిన పరికరాలను..

3జీ సర్వీసుల కోసం అమర్చిన పరికరాలను..

ప్రారంభంలో 3జీ సర్వీసుల కోసం అమర్చిన పరికరాలను తర్వాత రీప్లేస్‌ చేస్తామన్నారు. కొన్ని పాత రేడియోలన్నీ పూర్తిగా 3జీకి చెందినవని, వాటిని రీప్లేస్‌ చేయాల్సినవసరం ఉందన్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Bharti Airtel may shut down 3G network in 3-4 years Read more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X