Home
News

500MB డైలీ ఉచిత డేటాను ఈ ప్లాన్‌తో అదనంగా అందిస్తున్న ఎయిర్‌టెల్...

ఇండియాలోని టెలికాం సంస్థలలో రెండవ అతి పెద్ద అపరేటర్ గా కొనసాగుతున్న భారతీ ఎయిర్‌టెల్ ఇప్పుడు తన యొక్క వినియోగదారుల కోసం కొత్తగా మరొక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఆఫర్ విషయానికి వస్తే వినియోగదారులు 500MB రోజువారీ డేటాను ఉచితంగా పొందవచ్చు. ఈ ఆఫర్ టెల్కో నుండి రూ.249 ధర వద్ద లభించే ఒక ప్రీపెయిడ్ ప్లాన్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఇది కొత్త ప్లాన్ ఏమి కాదు. కానీ ఎయిర్‌టెల్ తాజాగా తన వినియోగదారుల కోసం అదనపు డేటా ఆఫర్‌ను జోడించింది. ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా వినియోగదారులు ప్రతిరోజూ 500MB లేదా 0.5GB డేటాను రీడీమ్ చేసుకోవచ్చు. ఈ టెల్కో యొక్క రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్‌తో వినియోగదారులు కొత్తగా పొందే అన్నిరకాల ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

భారతీ ఎయిర్‌టెల్ రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్  తో అదనపు డేటా

భారతీ ఎయిర్‌టెల్ రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్ తో అదనపు డేటా

భారతి ఎయిర్‌టెల్ రూ.249 ధర వద్ద అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌తో లభించే అన్ని పాత ప్రయోజనాలను అలాగే ఉంచింది. అయితే అదనంగా ప్రతిరోజూ 500MB అదనపు డేటాను జోడించింది. సాధారణంగా రూ.249 ప్లాన్‌తో వినియోగదారులకు 1.5GB రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రయోజనాలతో పాటు రోజుకు 100 SMSలను అందిస్తుంది. అయితే ఇప్పుడు ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రయోజనాలలో ప్రతిరోజూ అదనంగా 500MB డేటాను కలిగి ఉంటాయి. వీటిని నేరుగా Airtel థాంక్స్ మొబైల్ యాప్ ద్వారా రీడీమ్ చేసుకోవచ్చు. దీని అర్థం ప్రభావవంతంగా ప్లాన్‌తో వినియోగదారులు 2GB రోజువారీ డేటాను పొందుతారని అర్థం. రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. అంటే మొత్తం చెల్లుబాటు కాలంలో 42GB డేటాను పొందే బదులు వినియోగదారులు ఇప్పుడు 56GB డేటాను పొందుతారు.

కొత్త మార్పులతో

ఎయిర్‌టెల్ యొక్క రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్‌ కొత్త మార్పులతో ఈ ప్లాన్ కంపెనీ నుండి లభించే 2GB రోజువారీ డేటా ఆఫర్‌ విభాగంలో మారింది. ఈ ప్లాన్‌లో చేర్చబడిన ఇతర ప్రయోజనాలలో అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ట్రయల్ ఒక నెల, షా అకాడమీ 1 సంవత్సరం, అపోలో 24|7 సర్కిల్, ఉచిత హెలోట్యూన్స్ సబ్‌స్క్రిప్షన్‌లు, వింక్ మ్యూజిక్ మరియు ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్ మరియు ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రయోజనాలు ఉన్నాయి.

ప్రీపెయిడ్

ఎయిర్‌టెల్ యొక్క ప్రీపెయిడ్ విభాగంలో 1GB రోజువారీ డేటా మరియు 28 రోజుల చెల్లుబాటుతో వచ్చే రూ.219 ప్లాన్ కంటే రూ. 249 ప్లాన్ ఖచ్చితంగా మెరుగైన డీల్‌గా మారింది. రూ.219 ప్లాన్‌లోని ఇతర ప్రయోజనాలన్నీ రూ.249 ప్లాన్‌తో సరిపోతాయి. అయితే ఎవరైనా రూ.30 ఎక్కువ చెల్లించి ఎయిర్‌టెల్ నుండి రూ.249 ప్లాన్‌ను ఎందుకు పొందరు? రూ.219 ప్లాన్‌ కంటే రూ.249 ప్లాన్‌ని ఎంచుకోవడానికి కస్టమర్‌లను ఆకట్టుకోవడానికి 500MB అదనపు డేటా అనేది టెల్కోకు డికోయ్ స్ట్రాటజీగా పనిచేస్తుంది.

జియో ర.249 ప్లాన్‌ ప్రయోజనాలు

జియో ర.249 ప్లాన్‌ ప్రయోజనాలు

రిలయన్స్ జియో తన రూ.249 ప్లాన్‌తో 28 రోజుల సర్వీస్ వాలిడిటీతో 2GB రోజువారీ డేటాను అందిస్తుంది. ఇప్పుడు భారతీ ఎయిర్‌టెల్ కూడా ఇదే ఆఫర్ చేస్తోంది. ఎయిర్‌టెల్ అందించే అదనపు ప్రయోజనాలు మెరుగ్గా ఉన్నాయి మరియు సంఖ్యలో పెద్దవిగా ఉన్నాయి. Jio ప్రాథమిక Jio అప్లికేషన్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌లను మాత్రమే అందిస్తుంది మరియు JioMart మహా క్యాష్‌బ్యాక్ ఆఫర్ కింద 20% క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తుంది.

Vi రూ.249 ప్లాన్‌

Vi రూ.249 ప్లాన్‌

ప్రస్తుతం దేశంలో రూ.249 ప్లాన్‌తో 1.5GB రోజువారీ డేటాను అందిస్తున్న ఏకైక టెలికాం వోడాఫోన్ ఐడియా (Vi). అయితే వోడాఫోన్ ఐడియాలో మరొక గొప్ప ప్రయోజనం కూడా ఉంది. ఎందుకంటే టెల్కో దాని రూ. 249 ప్లాన్‌తో వీకెండ్ డేటా రోల్‌ఓవర్ మరియు బింగే ఆల్ నైట్ ఆఫర్‌ను అందిస్తుంది. Vi నుండి ఈ రెండు ఆఫర్‌లు రిలయన్స్ జియో మరియు ఎయిర్‌టెల్ రెండూ తమ కస్టమర్‌లకు అందిస్తున్న వాటి కంటే మెరుగ్గా ఉన్నాయి. Vi తన పోటీదారులకు సరిపోయేలా రూ. 249 ప్లాన్‌లో డేటా ప్రయోజనాలను పెంచకపోతే ఆశ్చర్యపోనవసరం లేదు. Vi తన మొత్తం ఆదాయాలను పెంచుకోవాలని చూస్తోంది మరియు అది మరిన్ని ప్రీమియం నెట్‌వర్క్‌లు మరియు ప్రీమియం ప్లాన్‌లతో మాత్రమే సాధ్యమవుతుంది.

ఎయిర్‌టెల్ డేటా ప్యాక్‌ల అదనపు ఆఫర్స్

ఎయిర్‌టెల్ డేటా ప్యాక్‌ల అదనపు ఆఫర్స్

భారతీ ఎయిర్‌టెల్ టెల్కో తన వినియోగదారుల కోసం ఇప్పుడు కొత్తగా రూ. 401, రూ .248 మరియు రూ. 78 ధరల వద్ద లభించే మూడు డేటా ప్యాక్‌లు ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాలతో వస్తాయి. ఈ మూడు ప్లాన్‌లలో రూ. 401 ప్లాన్ వినియోగదారులకు డిస్నీ+ హాట్‌స్టార్ VIP ప్రయోజనంతో 28 రోజుల చెల్లుబాటు కాలానికి 30GB మొత్తం డేటాను అందిస్తుంది. అలాగే రూ.249 మరియు రూ.78 ధరల వద్ద లభించే ప్లాన్ వినియోగదారులకు వరుసగా 25GB డేటా మరియు 5GB డేటాను వినియోగదారులకు అందిస్తుంది. ఈ రెండు ప్లాన్‌ల వ్యాలిడిటీలు యూజర్ యొక్క బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ కు సమానంగా ఉంటాయి. ఉదాహరణకు వినియోగదారుడు 30 రోజుల చెల్లుబాటును కలిగి ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్‌లో ఉంటే ఆ సమయంలో కొనుగోలు చేసిన ఈ డేటా ప్లాన్‌లలో (రూ.249 లేదా రూ.78) కూడా 30 రోజుల చెల్లుబాటుతో వస్తాయి. అంటే మీరు పొందే అదనపు డేటా ఈ వాలిడిటీ కాలంలో ఎప్పుడైనా వినియోగించడానికి అవకాశం ఇస్తుంది. రూ.249 మరియు రూ.78 ధరల వద్ద లభించే డేటా ప్లాన్‌లు రెండూ కూడా వినియోగదారులకు వింక్ మ్యూజిక్ ప్రీమియం యొక్క OTT ప్రయోజనాన్ని ఉచితంగా అందిస్తాయి. రూ.78 ప్లాన్ 30 రోజుల వాలిడిటీతో వింక్ మ్యూజిక్ ప్రీమియం ప్రయోజనాన్ని అందిస్తుంది. అయితే రూ.249 ప్లాన్ 1 సంవత్సరం చెల్లుబాటు కాలానికి అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Bharti Airtel Offering 500MB Daily Free Data in Addition to This Plan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X