Airtel యూజర్లకు ఉచితంగా 5GB డేటా!! అయితే వీరికి మాత్రమే...

|

భారతీ ఎయిర్‌టెల్ 'న్యూ 4G సిమ్ లేదా 4G అప్‌గ్రేడ్ ఫ్రీ డేటా కూపన్లు' అనే కొత్త ఆఫర్‌ను ఇప్పుడు వినియోగదారులకు అందిస్తున్నది. ఇందులో భాగంగా కొత్త ఎయిర్‌టెల్ 4G కస్టమర్లకు 5GB డేటాను ఉచితంగా అందిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఎయిర్‌టెల్ కొత్త వినియోగదారులు మొదటిసారి 'ఎయిర్‌టెల్ థాంక్స్' యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఐదు 1GB కూపన్ల రూపంలో 5GB డేటాను ఉచితంగా పొందవచ్చు. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ చందాదారులు కొత్త 4G సిమ్‌ను కొనుగోలు చేసిన లేదా 4Gకి అప్‌గ్రేడ్ చేసిన తరువాత ప్రీపెయిడ్ మొబైల్ నంబర్‌ను ఉపయోగించి ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లో మొదటిసారి నమోదు చేసుకోవడం ద్వారా ఈ ఉచిత ఆఫర్‌ను పొందవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్టెల్ థాంక్స్ యాప్ 5GB ఉచిత డేటా ఆఫర్ పొందే విధానం

ఎయిర్టెల్ థాంక్స్ యాప్ 5GB ఉచిత డేటా ఆఫర్ పొందే విధానం

ఎయిర్టెల్ థాంక్స్ యాప్ 5GB ఉచిత డేటా ఆఫర్‌కు అర్హత పొందడానికి 4G ప్రీపెయిడ్ చందాదారులు గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుండి ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ యొక్క తాజా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ చేసిన తర్వాత మొబైల్ నంబర్ యాక్టీవ్ అయిన 30 రోజుల్లోపు వినియోగదారుడు వారి ప్రీపెయిడ్ మొబైల్ నంబర్‌ను ఉపయోగించి యాప్ లో రిజిస్టర్ అవ్వవలసి ఉంటుంది. తరువాత 1GB యొక్క ఐదు కూపన్లు 72 గంటల్లోపు వినియోగదారుడి యొక్క అకౌంటులో ఆటొమ్యాటిక్ గా జమ అవుతాయని ఎయిర్టెల్ తెలిపింది.

 

Also Read: Samsung నుంచి కొత్త గేమింగ్ మానిటర్లు! ఈ రోజునుంచి ప్రీ బుకింగ్ మొదలు.Also Read: Samsung నుంచి కొత్త గేమింగ్ మానిటర్లు! ఈ రోజునుంచి ప్రీ బుకింగ్ మొదలు.

ఎయిర్టెల్ ఉచిత 5GB డేటా ఆఫర్ నిబంధనలు
 

ఎయిర్టెల్ ఉచిత 5GB డేటా ఆఫర్ నిబంధనలు

ఎయిర్టెల్ అందిస్తున్న 5GB ఉచిత డేటా ఆఫర్‌లో కొన్ని నిబంధనలు మరియు షరతులు కూడా ఉన్నాయి. వినియోగదారుడు ఎవరైనా సరే ఒక మొబైల్ నంబర్‌ను ఉపయోగించి ఒకసారి మాత్రమే ఈ ఆఫర్‌ను పొందగలరు. 5GB ఉచిత డేటా యొక్క ఈ ఆఫర్‌కు వినియోగదారు అర్హత ఉంటే కనుక వారికి ఆటొమ్యాటిక్ గా ఉచిత డేటా ఆఫర్ నుండి అదనంగా 2GB మినహాయించబడుతుందని ఎయిర్‌టెల్ ధృవీకరించింది.

ఎయిర్టెల్ 5GB డేటా క్లెయిమ్

ఎయిర్టెల్ 5GB డేటా క్లెయిమ్

ఎయిర్టెల్ యొక్క 5GB డేటా విజేతలు ఆటోమ్యాటిక్ గా కూపన్ యొక్క క్రెడిట్ మెసేజ్ పోస్ట్ అర్హతను స్వీకరిస్తారని ఎయిర్టెల్ తెలిపింది. ఈ ప్రక్రియలో SMS అందుకున్న తర్వాత వినియోగదారులు ఎయిర్టెల్ థాంక్స్ యాప్ లోని ‘మై కూపన్స్' విభాగంలో ఈ ఉచిత కూపన్లను చూడవచ్చు. ఈ 1GB కూపన్ ను 90 రోజులలో క్లెయిమ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. అయితే క్లెయిమ్ చేసుకున్న తరువాత ఇది కేవలం మూడు రోజుల వరకు మాత్రమే వినియోగానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ క్లెయిమ్ సమయంలో వినియోగదారులు ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కనెక్షన్ యాక్టీవ్ లో ఉంటేనే కూపన్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

Best Mobiles in India

English summary
Bharti Airtel Offers 5GB Data Free Coupons For New 4G SIM Users

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X