Home
News

ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లతో డేటా కూపన్‌లను ఉచితంగా అందిస్తున్న Airtel...

భారతి ఎయిర్‌టెల్ ప్రస్తుతం తన యొక్క వినియోగదారులకు 'డేటా కూపన్లను' ఆఫర్‌ రూపంలో అందిస్తున్నది. ఇందులో భాగంగా ప్రీపెయిడ్ చందాదారులు 6GB వరకు డేటాను ఉచితంగా పొందవచ్చు. ఎయిర్టెల్ సంస్థ కేవలం రూ.219 ధర వద్ద నుండి రోజువారీ డేటా ప్రయోజనంతో వివిధ రకాల అపరిమిత కాంబో ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నది.

ఉచిత డేటా కూపన్ల ఆఫర్

ప్రస్తుత ఉచిత డేటా కూపన్ల ఆఫర్ వినియోగదారులకు వారు రీఛార్జ్ చేసే ప్యాక్‌ని బట్టి ఒక్కొక్కటి 1GB డేటా నుండి ఆరు వోచర్‌లను సంపాదించడానికి అనుమతిస్తుంది. ఉదాహరణకు ఒక కస్టమర్ 28 రోజుల చెల్లుబాటుతో ఏదైనా ఎయిర్టెల్ అపరిమిత కాంబో ప్యాక్ ను ఎంచుకుంటే వారు ఒక్కొక్కటి 1GB డేటాతో రెండు కూపన్లను పొందడానికి అర్హులు అవుతారు. ఎయిర్‌టెల్ ఫ్రీ డేటా కూపన్‌ల ఆఫర్‌కు ఏ ప్లాన్ అర్హత కలిగి ఉన్నాయో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

భారతి ఎయిర్‌టెల్ ఉచిత డేటా కూపన్లు ఆఫర్ కు అర్హత గల ప్లాన్ లు

భారతి ఎయిర్‌టెల్ ఉచిత డేటా కూపన్లు ఆఫర్ కు అర్హత గల ప్లాన్ లు

భారతి ఎయిర్‌టెల్ టెలికాం సంస్థ ఫ్రీ డేటా కూపన్ల ఆఫర్‌కు అర్హత ఉన్న ప్లాన్ లు ఇవే

*** రూ.219, రూ.249, రూ.279, రూ .289, రూ .298, రూ. 349, రూ .398, రూ .448 ధరల వద్ద లభించే ప్లాన్ లు వినియోగదారులకు 28 రోజుల చెల్లుబాటు కాలానికి 1GB డేటా రెండు కూపన్లను అందిస్తాయి.

*** రూ .399, రూ.449, రూ. 558, రూ .599 ధరల వద్ద లభించే ప్లాన్ లు వినియోగదారులకు 56 రోజుల చెల్లుబాటు కాలానికి 1GB డేటాతో నాలుగు కూపన్లును అందిస్తాయి.

*** రూ .598, రూ .698 ధరల వద్ద లభించే ప్లాన్ లు వినియోగదారులకు 84 రోజుల చెల్లుబాటు కాలంలో 1GB డేటా ఆరు కూపన్లతో వస్తాయి.

పైన పేర్కొన్న ఏదైనా ప్లాన్ తో రీఛార్జ్ చేసిన తర్వాత ఉచిత డేటా కూపన్లు కస్టమర్ అకౌంటుకు స్వయంచాలకంగా జమ చేయబడతాయి. ఇంకా ఆఫర్‌కు అర్హత పొందడానికి భారతి ఎయిర్‌టెల్ యొక్క ప్రీపెయిడ్ చందాదారుడు ఎయిర్‌టెల్ థాంక్స్ మొబైల్ అప్లికేషన్ ద్వారా రీఛార్జ్ చేయవలసి ఉంటుంది.

 

భారతి ఎయిర్‌టెల్ ఉచిత డేటా కూపన్లను రిడీమ్ చేయడం ఎలా?

భారతి ఎయిర్‌టెల్ ఉచిత డేటా కూపన్లను రిడీమ్ చేయడం ఎలా?

ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ లోని ‘మై కూపన్లు' విభాగం నుండి వినియోగదారులు తమ కూపన్‌లను చూడవచ్చు మరియు క్లెయిమ్ చేయవచ్చు కూడా. కూపన్ల చెల్లుబాటును కూడా అక్కడే పేర్కొనబడుతుంది. వినియోగదారులు ఈ విభాగం నుండే కూపన్లను రీడీమ్ చేయవచ్చు. కూపన్‌ను క్లెయిమ్ చేసిన ఒక రోజులోనే డేటా ప్రయోజనం ముగుస్తుందని గమనించండి.

Best Mobiles in India

English summary
Bharti Airtel Offers Free Data Coupons: Eligible Plans and Redeem Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X