జియోకి Airtel నుంచి భారీ షాక్

Written By:

టెల్కోలకు షాకుల మీద షాకులు ఇస్తున్న జియోకు దేశంలోనే అతిపెద్ద మొబైల్‌ కంపెనీ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ గట్టి షాక్ ఇవ్వబోతోంది. దీపావళి కానుకగా ఓ సరికొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్దమవుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టడం కోసం హ్యాండ్‌సెట్‌ తయారీదారులతో ఎయిర్‌టెల్‌ జరుపుతున్న చర్చలు తుది దశలో ఉన్నట్టు కూడా తెలిసింది.

రూ. 299కే ఫీచర్ ఫోన్, ఇక జియో ఫోన్ తుస్సేనా ..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎక్కువమొత్తంలో డేటా, వాయిస్‌ మినిట్స్‌తో

2,500 రూపాయలతో ఈ డివైజ్‌ మార్కెట్‌లోకి రాబోతుందని, ఎక్కువమొత్తంలో డేటా, వాయిస్‌ మినిట్స్‌తో ఎయిర్‌టెల్‌ దీన్ని తీసుకొస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను

పాపులర్‌ ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను ఆధారితంగా ఇది రూపొందుతుంది. ఈ 4జీ డివైజ్‌ను టాప్‌ దేశీయ టెల్కో, హ్యాండ్‌సెట్‌ తయారీదారి కో-ప్రమోట్‌ చేయనుందనే వార్తలు వస్తున్నాయి.

గూగుల్‌ ప్లే యాప్‌ స్టోర్‌లో

గూగుల్‌ ప్లే యాప్‌ స్టోర్‌లో లభించే అన్ని రకాల యాప్స్‌ను యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకునేలా ఈ టెల్కో అనుమతి కల్పించనుంది. ఈ ఫోన్‌ లాంచింగ్‌ సెప్టెంబర్‌ చివరిలో లేదా అక్టోబర్‌ మొదట్లో ఉండొచ్చని సమాచారం.

మెరుగైన బ్యాటరీ సామర్థ్యం

రూ.2,500 కోసం ఎయిర్‌టెల్‌ కొన్ని హ్యాండ్‌సెట్‌ తయారీదారులతో చర్చలు జరుపుతోందని ఆ స్మార్ట్‌ఫోన్‌, రిలయన్స్‌జియో ఆఫర్‌ చేసిన ఫీచర్‌ ఫోన్‌ కంటే మెరుగ్గా, పెద్ద స్క్రీన్‌, మంచి కెమెరా, మెరుగైన బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉండేలా రూపొందించాలని ప్లాన్‌ చేస్తుందని ఎయిర్‌టెల్‌ ప్లాన్స్‌కు సంబంధించిన సీనియర్‌ ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్‌ ఒకరు చెప్పారు. ఈ చర్చలు చాలా అడ్వాన్స్‌ దశలో కూడా ఉన్నట్టు పేర్కొన్నారు.

లావా, కార్బన్‌ కంపెనీలు వేరువేరుగా చర్చలు

4జీ స్మార్ట్ఫోన్‌ మార్కెట్‌ కోసం టెలికాం మార్కెట్‌ లీడర్‌తో లావా, కార్బన్‌ కంపెనీలు వేరువేరుగా చర్చలు జరిపినట్టు ఆ కంపెనీలు ధృవీకరించాయి.

మార్కెట్‌లో వచ్చే ఊహాగానాలపై

అయితే మార్కెట్‌లో వచ్చే ఊహాగానాలపై స్పందించేది లేదని భారతీ ఎయిర్‌టెల్‌ అధికార ప్రతినిధి చెప్పారు.

జియోకు ఇది గట్టిపోటీ

ఒకవేళ ఎయిర్‌టెల్‌ నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ విడుదలైతే, జియోకు ఇది గట్టిపోటీగా నిలువనుంది. మరోవైపు జియో ఫోన్‌ కూడా సెప్టెంబర్‌లోనే మార్కెట్‌లోకి వస్తుంది. రెండు డివైజ్‌లు ఒకేసారి పోటాపోటీగా విడుదలకు సిద్ధమవుతున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Bharti Airtel plans to launch bundled 4G smartphone at Rs 2,500 before Diwali to counter Jio Read more At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot