జియోపై కసి: రూ. 32,000 కోట్లతో Airtel భారీ స్కెచ్

Written By:

టెలికం రంగంలో దిగ్గజాలకు వణుకు పుట్టిస్తున్న జియోని ఎలాగైనా కూల్చేయడానికి కంపెనీలన్నీ ఏకమయ్యాయి. చెక్ పెట్టేందుకు దిగ్గజ కంపెనీలన్నీ భారీ ఎత్తున్న ప్లాన్లు వేస్తున్నాయి. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్‌ అయితే ఏకంగా రూ.32వేల కోట్లను వెచ్చించబోతుంది.

ఈ ఏడు ఫీచర్లు లేని ఆండ్రాయిడ్ ఫోన్ కొనకండి !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నెట్‌వర్క్‌ను విస్తరించుకోవడానికి

తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకోవడానికి Airtel వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ.32వేల కోట్లకు పైగా వెచ్చించేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. రెవెన్యూ మార్కెట్‌ షేరులో 3-4 శాతం పాయింట్లను అధికంగా ఇది దక్కించుకోవాలనుకుంటోంది.

జియోకు అడ్డుకట్ట వేయడానికి

మిగతా కంపెనీలు ఐడియా సెల్యులార్‌, వొడాఫోన్‌ ఇండియాలు కూడా జియోకు అడ్డుకట్ట వేయడానికి విలీన ప్రక్రియకు తెరతీశాయి. ఇందులో భాగంగా వొడాఫోన్‌ రూ.8300 కోట్లను, ఐడియా రూ.8000 కోట్లను తమ నెట్‌వర్క్‌ల అప్‌గ్రేడ్‌ కోసం ఖర్చు చేసినట్టు తెలిసింది.

కమర్షియల్‌ సర్వీసులతో

జియో గతేడాది సెప్టెంబర్‌లో లాంచ్‌ చేసిన కమర్షియల్‌ సర్వీసులతో టెలికాం ఇండస్ట్రిలోని ఇంక్యుబెంట్లు భారీ ఎత్తున నష్టపోతున్నాయి. జియోను తట్టుకోవడానికి ఎన్ని ప్లాన్స్‌ వేసినా.. అవి వర్క్‌వుట్‌ కావడం లేదు.

ఈ సారి ఎయిర్‌టెల్‌ పెద్ద ఎత్తునే ప్లాన్‌

అయితే ఈ సారి ఎయిర్‌టెల్‌ పెద్ద ఎత్తునే ప్లాన్‌ వేస్తోంది.ఈ టెలికాం దిగ్గజం ఆర్పూ(ఒక్కో యూజర్‌పై ఆర్జించే కనీస రెవెన్యూ)ను కాపాడుకోవడం కోసం ధరలను తగ్గించకుండా డేటా నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు కసరత్తులు చేస్తోంది.

రూ.16వేల కోట్ల నుంచి రూ.17వేల కోట్ల వరకు

ఈ ఏడాది రూ.16వేల కోట్ల నుంచి రూ.17వేల కోట్ల వరకు మూలధన ఖర్చు రూపంలో వెచ్చించనున్నామని, వచ్చే రెండేళ్లలో కూడా అంతేమొత్తంలో ఇన్వెస్ట్‌ చేయనున్నట్టు కంపెనీకి చెందిన ఓ అధికారి తెలిపారు. ఈ మొత్తాన్ని స్పెక్ట్రమ్‌ కొనుగోలుకు వెచ్చించనుంది.

క్యాష్‌ఫ్లోస్‌ కూడా

ఈ కంపెనీకి క్యాష్‌ఫ్లోస్‌ కూడా వార్షికంగా రూ.20వేల కోట్లు మేర ఉన్నట్టు తెలిసింది. గతేడాది కూడా ఎయిర్‌టెల్‌ తన నెట్‌వర్క్‌లను అప్‌గ్రేడ్‌ చేసుకోవడానికి భారీగానే వెచ్చించింది. వీటికోసం రూ.15వేల కోట్లను ఖర్చుచేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Bharti Airtel plans to spend over Rs 32,000 crore in next two fiscals Read more at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot