Home
News

అదనపు OTT ఆఫర్లతో ఎయిర్‌టెల్ డేటా ప్యాక్‌లు!! పూర్తి వివరాలు ఇవిగో

ఇండియాలోని ప్రైవేట్ టెలికాం సంస్థలలో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం గత సంవత్సరంలో డేటా ప్రీపెయిడ్ ప్యాక్‌ల శ్రేణిని విస్తరించింది. ఈ డేటా ప్యాక్‌లను ఉపయోగించి వినియోగదారులు అపరిమిత ప్లాన్‌లపై అందించే ఫెయిర్-యూసేజ్-పాలసీ (FUP) డేటా వినియోగం తరువాత అదనపు డేటాను పొందడానికి అవకాశం ఇస్తుంది. ఇంతకుముందు భారతీ ఎయిర్‌టెల్ నుండి ఒక డేటా ప్లాన్ మాత్రమే అందుబాటులో ఉండేది.

 డిస్నీ+ హాట్ స్టార్

అది వినియోగదారులకు డిస్నీ+ హాట్ స్టార్ VIP యొక్క అదనపు ప్రయోజనాన్ని అందించేది. అయితే ఇటీవలి నెలల్లో భారతీ ఎయిర్‌టెల్ కొత్తగా మరికొన్ని ప్రీపెయిడ్ డేటా ప్యాక్‌లను జోడించింది. ఇది వింక్ మ్యూజిక్ ప్రీమియం మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ వంటి అదనపు ప్రయోజనాలతో కూడా వస్తుంది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

భారతీ ఎయిర్‌టెల్ డేటా ప్యాక్‌ల అదనపు ఆఫర్స్

భారతీ ఎయిర్‌టెల్ డేటా ప్యాక్‌ల అదనపు ఆఫర్స్

భారతీ ఎయిర్‌టెల్ టెల్కో తన వినియోగదారుల కోసం ఇప్పుడు కొత్తగా రూ. 401, రూ .248 మరియు రూ. 78 ధరల వద్ద లభించే మూడు డేటా ప్యాక్‌లు ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాలతో వస్తాయి. ఈ మూడు ప్లాన్‌లలో రూ. 401 ప్లాన్ వినియోగదారులకు డిస్నీ+ హాట్‌స్టార్ VIP ప్రయోజనంతో 28 రోజుల చెల్లుబాటు కాలానికి 30GB మొత్తం డేటాను అందిస్తుంది. అలాగే రూ.249 మరియు రూ.78 ధరల వద్ద లభించే ప్లాన్ వినియోగదారులకు వరుసగా 25GB డేటా మరియు 5GB డేటాను వినియోగదారులకు అందిస్తుంది. ఈ రెండు ప్లాన్‌ల వ్యాలిడిటీలు యూజర్ యొక్క బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ కు సమానంగా ఉంటాయి. ఉదాహరణకు వినియోగదారుడు 30 రోజుల చెల్లుబాటును కలిగి ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్‌లో ఉంటే ఆ సమయంలో కొనుగోలు చేసిన ఈ డేటా ప్లాన్‌లలో (రూ.249 లేదా రూ.78) కూడా 30 రోజుల చెల్లుబాటుతో వస్తాయి. అంటే మీరు పొందే అదనపు డేటా ఈ వాలిడిటీ కాలంలో ఎప్పుడైనా వినియోగించడానికి అవకాశం ఇస్తుంది.

డేటా ప్లాన్‌లు

రూ.249 మరియు రూ.78 ధరల వద్ద లభించే డేటా ప్లాన్‌లు రెండూ కూడా వినియోగదారులకు వింక్ మ్యూజిక్ ప్రీమియం యొక్క OTT ప్రయోజనాన్ని ఉచితంగా అందిస్తాయి. రూ.78 ప్లాన్ 30 రోజుల వాలిడిటీతో వింక్ మ్యూజిక్ ప్రీమియం ప్రయోజనాన్ని అందిస్తుంది. అయితే రూ.249 ప్లాన్ 1 సంవత్సరం చెల్లుబాటు కాలానికి అందిస్తుంది.

ఎయిర్‌టెల్

భారతీ ఎయిర్‌టెల్ టెల్కో ముందు రూ.89 మరియు రూ.131 ధరల వద్ద రెండు ప్యాక్‌లను అందిస్తున్నాయి. ఈ రెండూ ప్యాక్ లు యూజర్లకు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ట్రయల్‌ను ఉచితంగా అందిస్తున్నాయి. భారతీ ఎయిర్‌టెల్ నుండి లభించే రూ.89 ప్లాన్ 6GB డేటాతో వస్తుంది మరియు వినియోగదారులకు అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్‌ను 28 రోజుల పాటు అందిస్తుంది. అయితే రూ.131 ప్లాన్ 100MB డేటా మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్‌ని 30 రోజుల పాటు అందిస్తుంది.

డేటా ప్యాక్‌లు

భారతీ ఎయిర్‌టెల్ యూజర్లు ఎంచుకునే అనేక డేటా ప్యాక్‌లు ఉన్నాయి. కంపెనీ మొత్తం 8 డేటా ప్యాక్‌లను వినియోగదారులకు అందిస్తుంది. ఈ ప్యాక్‌లు రూ.48 నుండి ప్రారంభమై రూ. 401 ధర వరకు అనేక విభాగాలలో వస్తుంది. రూ.48 వోచర్ వినియోగదారులకు 3GB డేటాను అందిస్తుంది. ఇది ఒక వినియోగదారు కొనుగోలు చేసిన అపరిమిత ప్లాన్ యొక్క అదే చెల్లుబాటుతో వస్తుంది. యూజర్ ఎంచుకుంటున్న అపరిమిత ప్లాన్ యొక్క అదే చెల్లుబాటుతో రూ.251 ప్లాన్ కూడా 50GB డేటాను అందిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Bharti Airtel Prepaid Data Packs Comes With Additional OTT Benefits: Here are Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X