ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు మిగిలిన వారికి బిన్నంగా ఎందుకు ఉన్నాయో తెలుసా
ఇండియాలోని టెలికామ్ సంస్థలలో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ తన వినియోగదారులను కాపాడుకోవడంతో పాటుగా యూజర్ బేస్ ను పెంచుకోవడం కోసం కొత్తగా కొన్ని ప్లాన్‌లను అందిస్తున్నది. ప్రీపెయిడ్ మరియు పోస్ట్ పైడ్ విభాగాలలో కొన్ని ప్లాన్‌లను అందిస్తూ వినియోగదారుల యొక్క దృష్టిని తన వైపుకు తిప్పుకుంటున్నది. ఈ సంస్థ తన యొక్క ప్రీపెయిడ్ ప్లాన్‌లతో డేటాను అందివ్వడమే కాకుండా అదనంగా OTT లకు కూడా ఉచిత యాక్సిస్ ను అందిస్తున్నది. సిగ్నల్ కవరేజ్ పరంగా కూడా అద్భుతంగా ఉన్నది. ఎయిర్టెల్ ఇతరుల కంటే ఎందులో గొప్పగా ఉందొ తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

భారతీ ఎయిర్‌టెల్ 1.5GB రోజువారీ డేటా ప్లాన్‌లు
ఎయిర్‌టెల్ టెల్కో 1.5GB రోజువారీ డేటాను రూ.249, రూ.289, రూ .399 ధరల వద్ద లభించే ప్లాన్‌లతో అందిస్తోంది. ఈ ప్లాన్‌లన్ని కూడా అనేక ప్రయోజనాలతో లభిస్తాయి. ఇవి అన్ని కూడా 1.5GB రోజువారీ డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తారు. ఇంకా అన్ని ప్లాన్‌లు కూడా అదనంగా ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రయోజనాలను అందిస్తాయి. ఇందులో అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ యొక్క ఉచిత ఒక నెల ట్రయల్ మరియు వింక్ మ్యూజిక్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సబ్‌స్క్రిప్షన్, ఒక సంవత్సరం షా అకాడమీ ఉచిత కోర్స్, అపోలో 24 | 7 సర్కిల్ , ఫ్రీ Hellotunes, FASTag లావాదేవీలపై రూ .100 క్యాష్‌బ్యాక్ వంటివి లభిస్తాయి. రూ.249 మరియు రూ.289 డ్రాల వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్‌లు 28 రోజుల చెల్లుబాటుతో వస్తాయి. అలాగే రూ.399 ప్లాన్ 56 రోజుల చెల్లుబాటుతో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. రూ.289 ప్రీపెయిడ్ ప్లాన్‌లో ఉన్న విషయం ఏమిటంటే వినియోగదారులు దానితో పాటు ZEE5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ని కూడా ఉచితంగా పొందుతారు. లేకపోతే రూ .249 మరియు రూ.289 ప్లాన్‌ల మధ్య తేడా ఉండదు.

ఎయిర్‌టెల్ మీడియం-టర్మ్ బెస్ట్-సెల్లర్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు
భారతీ ఎయిర్‌టెల్ మీడియం-టర్మ్ విభాగంలో అందించే ప్లాన్‌లలో అధికంగా రూ.598 మరియు రూ.698 ధరల వద్ద లభించే ప్లాన్‌లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ రెండు ప్లాన్‌లు 84 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS ప్రయోజనాలు మరియు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ వంటి మరిన్ని బెనిఫిట్‌లు చాలా ఉన్నాయి. ఇందులో రూ.598 ప్లాన్ 1.5GB రోజువారీ డేటాను మరియు రూ.698 ప్లాన్ 2GB రోజువారీ డేటాను అందిస్తుంది. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ యొక్క ఒక నెల ఉచిత ట్రయల్‌తో రెండు ప్లాన్‌లు వస్తాయి. ఇతర ప్రయోజనాలు ఉచిత ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సబ్‌స్క్రిప్షన్, వింక్ మ్యూజిక్, 1 సంవత్సరానికి షా అకాడమీ వంటివి మరిన్ని ఉన్నాయి.

ఎయిర్‌టెల్ స్వల్ప వ్యాలిడిటీ ప్లాన్
భారతీ ఎయిర్‌టెల్ టెల్కో తన యొక్క వినియోగదారులకు రూ.349 ధర వద్ద అందించే ప్లాన్‌ను 28 రోజుల స్వల్ప వ్యాలిడిటీతో అందిస్తుంది. ఈ ప్లాన్ 2.5GB రోజువారీ డేటాతో లభిస్తుంది. అంటే వినియోగదారులు మొత్తం చెల్లుబాటు కాలంలో 70GB డేటాను పొందుతారు. డేటా ప్రయోజనంతో పాటు వినియోగదారులు కంపెనీ నుండి అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను కూడా పొందుతారు. అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా మూడు నెలల పాటు అపోలో 24/7 సర్కిల్, షా అకాడమీ నుండి ఒక సంవత్సరం విలువైన ఆన్ లైన్ క్లాసుల సబ్స్క్రిప్షన్ మరియు ఫాస్ట్ ట్యాగ్ లావాదేవీలపై రూ.100 క్యాష్‌బ్యాక్ వంటి ఇతర ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ఎయిర్‌టెల్ లాంగ్ టర్మ్ ప్లాన్
ఎయిర్‌టెల్ రూ.2,798 ధర వద్ద లభించే ప్లాన్‌లో రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMS మరియు అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాల్‌ల ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే ఏడాది పాటు ఉచిత డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ మెంబర్‌షిప్, అపోలో 24/7 సర్కిల్ సభ్యత్వం మరియు షా అకాడమీ ఉచిత కోర్సులు వంటివి అదనంగా కూడా ఉన్నాయి. ఇది 365 రోజులకు చెల్లుబాటు అయ్యే దీర్ఘకాలిక ప్రణాళిక కావున సంవత్సరంలో ఒకసారి రీఛార్జ్ చేస్తే సరిపోతుంది.

భారతీ ఎయిర్‌టెల్ డేటా ప్యాక్‌లు
భారతీ ఎయిర్‌టెల్ టెల్కో అధికంగా డేటాను కోరుకునే వినియోగదారుల కోసం ఇప్పుడు రూ. 401, రూ .248 మరియు రూ. 78 ధరల వద్ద మూడు డేటా ప్యాక్‌లను ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాలతో అందిస్తున్నాయి. ఈ మూడు ప్లాన్‌లలో రూ. 401 ప్లాన్ వినియోగదారులకు డిస్నీ+ హాట్‌స్టార్ VIP ప్రయోజనంతో 28 రోజుల చెల్లుబాటు కాలానికి 30GB మొత్తం డేటాను అందిస్తుంది. అలాగే రూ.249 మరియు రూ.78 ధరల వద్ద లభించే ప్లాన్ వినియోగదారులకు వరుసగా 25GB డేటా మరియు 5GB డేటాను వినియోగదారులకు అందిస్తుంది. ఈ రెండు ప్లాన్‌ల వ్యాలిడిటీలు యూజర్ యొక్క బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ కు సమానంగా ఉంటాయి. ఉదాహరణకు వినియోగదారుడు 30 రోజుల చెల్లుబాటును కలిగి ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్‌లో ఉంటే ఆ సమయంలో కొనుగోలు చేసిన ఈ డేటా ప్లాన్‌లలో (రూ.249 లేదా రూ.78) కూడా 30 రోజుల చెల్లుబాటుతో వస్తాయి. అంటే మీరు పొందే అదనపు డేటా ఈ వాలిడిటీ కాలంలో ఎప్పుడైనా వినియోగించడానికి అవకాశం ఇస్తుంది.


Click it and Unblock the Notifications