RS.10ల టాక్ టైమ్ ప్లాన్‌లను తిరిగి తీసుకువచ్చిన ఎయిర్‌టెల్ కాకపోతే....

|

2019 డిసెంబర్‌లో టారిఫ్ ప్లాన్‌ల యొక్క ధరలు పెరిగిన తరువాత టెలికాం ఆపరేటర్లు భారతి ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా మొదటి సారిగా రూ.20, రూ .50 మరియు రూ .100 వంటి సరసమైన టాక్ టైమ్ ప్లాన్‌లను ఇప్పుడు తిరిగి తీసుకువచ్చాయి. ఎయిర్‌టెల్ ప్రస్తుతం తన ప్రీపెయిడ్ వినియోగదారులకు రూ.10 , రూ.20, రూ.100, రూ .500, రూ .1,000, రూ.5000 వంటి ఆరు టాక్ టైమ్ ప్లాన్‌లను అందిస్తోంది.

ఎయిర్‌టెల్

భారతి ఎయిర్‌టెల్ యొక్క టెల్కోలో రూ.5 వేల టాక్ టైమ్ ప్లాన్‌ను కూడా కలిగి ఉంది. ఇది రూ .4,237.29 మెయిన్ బ్యాలెన్స్ ను అందిస్తుంది. అయినప్పటికీ ఎయిర్‌టెల్ యొక్క టాక్ టైమ్ ప్లాన్‌లతో ఒక ప్రధాన సమస్య ఉంది అది ఏమిటంటే ఇవి సర్వీస్ యొక్క యాక్సిస్ ను అందించదు. ఉదాహరణకు మీరు రూ.5 వేల టాక్ టైమ్ ప్లాన్‌ను రీఛార్జ్ చేసినా సరే ఆ బ్యాలెన్స్‌ను ఉపయోగించడానికి మీరు రూ.45 స్మార్ట్ రీఛార్జ్ తో రీఛార్జ్ చేయవలసి వస్తుంది. టాక్ టైమ్ ప్లాన్‌లు అపరిమిత వాలిడిటీతో వస్తాయి కాబట్టి మీరు ఎప్పుడైనా బ్యాలెన్స్ ఉపయోగించవచ్చు.

 

 

వోడాఫోన్ రూ.269 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు....వోడాఫోన్ రూ.269 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు....

భారతి ఎయిర్‌టెల్ టాక్ టైమ్ ప్లాన్స్ సర్వీస్ వాలిడిటీ బెనిఫిట్

భారతి ఎయిర్‌టెల్ టాక్ టైమ్ ప్లాన్స్ సర్వీస్ వాలిడిటీ బెనిఫిట్

2019 చివరిలో వోడాఫోన్ సర్వీస్ వాలిడిటీ ప్రయోజనంతో టాక్ టైమ్ ప్లాన్‌లతో రావడం చూశాము. అయినప్పటికీ భారతి ఎయిర్‌టెల్ తన టాక్ టైమ్ ప్లాన్‌లతో సర్వీస్ వాలిడిటీ ప్రయోజనాన్ని అందించడం లేదు. ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ వినియోగదారులకు సర్వీస్ యాక్సిస్ అనేది ఒక కీలకమైన అంశం ఎందుకంటే ఇది వినియోగదారులను తమ అకౌంట్ లో ఉన్న టాక్ టైమ్ బ్యాలెన్స్‌ను ఉపయోగించుకోవడానికి అనుమతిస్తుంది. సర్వీస్ యాక్సిస్ లేకుండా ఎయిర్టెల్ వినియోగదారులు ప్రస్తుత ప్యాక్ గడువు ముగిసిన 15 రోజుల తర్వాత ఇన్కమింగ్ వాయిస్ కాలింగ్ సదుపాయాన్ని నిలిపివేయవలసి ఉంటుంది.

 

 

ఇండియాలో అమాంతం పెరిగిన ఆపిల్ మార్కెట్ వాటాఇండియాలో అమాంతం పెరిగిన ఆపిల్ మార్కెట్ వాటా

టాక్ టైమ్ రీఛార్జ్

సరసమైన బడ్జెట్ ధరలో టాక్ టైమ్ రీఛార్జ్ ఎంపికలను కంపెనీ తిరిగి తీసుకురావడం ఎయిర్టెల్ కస్టమర్లకు శుభవార్త. అయితే అదే సమయంలో కనీస రీఛార్జ్ ప్లాన్ లేకుండా టాక్ టైమ్ ప్రయోజనాన్ని ఉపయోగించలేకపోతున్నందుకు వారు బాధపడాలి. ఒక ఎయిర్టెల్ కస్టమర్ రూ.10 టాక్ టైమ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే అదే సమయంలో అతడు / ఆమె రీఛార్జ్ చేసిన టాక్ టైమ్ ప్లాన్ యొక్క ప్రయోజనాన్ని ఉపయోగించుకోవడానికి రూ.45లతో స్మార్ట్ రీఛార్జ్ తో రీఛార్జ్ చేయవలసి ఉంటుంది.

 

 

DTH చందాదారులకు HD ఛానెల్‌లను అధికంగా అందిస్తున్న టాటా స్కైDTH చందాదారులకు HD ఛానెల్‌లను అధికంగా అందిస్తున్న టాటా స్కై

స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్ బెనిఫిట్స్

స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్ బెనిఫిట్స్

భారతి ఎయిర్‌టెల్ నుండి వస్తున్న రూ.45 స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్ ఎటువంటి టాక్ టైమ్ బెనిఫిట్‌ను అందించదు. బదులుగా ఇది 28 రోజుల పాటు సర్వీస్ వాలిడిటీ మరియు రేట్ కట్టర్ ప్రయోజనాలను అందిస్తుంది. కాబట్టి ప్రతి 28 రోజులకు ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు తమ అకౌంట్ లో ఉన్న టాక్ టైమ్ బ్యాలెన్స్‌ను ఉపయోగించడానికి కనీసం రూ.45లతో రీఛార్జ్ చేయవలసి ఉంటుంది. రూ.45 స్మార్ట్ రీఛార్జితో పాటు ఎయిర్‌టెల్ రూ.49 మరియు రూ.79 స్మార్ట్ రీఛార్జీలను టాక్ టైమ్, డేటా మరియు రేట్ కట్టర్ ప్రయోజనాలతో అందిస్తుంది.

 

 

ఆన్‌లైన్‌లో మందు కొనడానికి వెళ్లి RS.1.27లక్ష కోల్పోయిన మేధావిఆన్‌లైన్‌లో మందు కొనడానికి వెళ్లి RS.1.27లక్ష కోల్పోయిన మేధావి

వోడాఫోన్ ఐడియా టాక్ టైమ్ ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా టాక్ టైమ్ ప్లాన్‌లు

భారతి ఎయిర్‌టెల్ మాదిరిగానే వొడాఫోన్ ఐడియా కూడా రూ .20, రూ .50, రూ .100 వంటి సరసమైన టాక్ టైమ్ ప్లాన్‌లను తిరిగి తెచ్చింది. అయితే టెలికం ఆపరేటర్ రూ.500, రూ.1,000 మరియు రూ.5,000 వంటి ప్రీమియం టాక్ టైమ్ ప్లాన్‌లను తొలగించారు. ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా కేవలం ఐదు టాక్ టైమ్ ప్లాన్‌లను మాత్రమే కలిగి ఉంది. వొడాఫోన్ ఐడియా టాక్ టైమ్ ఏదీ కూడా ఫుల్ టాక్ టైమ్ బెనిఫిట్‌తో రాదు.

 

 

OPPO F15: అద్భుతమైన డిజైన్లతో RS.20,000లోపు రూపొందించిన స్మార్ట్‌ఫోన్OPPO F15: అద్భుతమైన డిజైన్లతో RS.20,000లోపు రూపొందించిన స్మార్ట్‌ఫోన్

ఎయిర్‌టెల్ VS వోడాఫోన్

ఎయిర్‌టెల్ VS వోడాఫోన్

భారతి ఎయిర్‌టెల్ మాదిరిగానే వొడాఫోన్ ఐడియా యూజర్లు కూడా తమ అకౌంట్ లో ఉన్న టాక్ టైమ్ బ్యాలెన్స్‌ను ఉపయోగించుకోవడానికి ప్రతి 14 రోజులకు రూ.24 చెల్లించాల్సి ఉంటుంది. కనీస రీఛార్జ్ ధరను రూ.45 కి పెంచిన భారతి ఎయిర్‌టెల్ మాదిరిగా కాకుండా వోడాఫోన్ ఐడియా ఇప్పటికీ రూ.24 యాక్టివ్ రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. అయితే ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 14 రోజులకు తగ్గించబడింది.

Best Mobiles in India

English summary
Bharti Airtel Revives Its 6 Budget Talk time plans

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X