వైఫై కాలింగ్ సర్వీస్‌ను లాంచ్ చేసిన ఎయిర్‌టెల్

By Gizbot Bureau
|

దిగ్గజ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తన మొబైల్ వినియోగదారుల కోసం కొత్తగా వైఫై కాలింగ్ (వీవో-వైఫై)ను లాంచ్ చేసింది. ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ లేదా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయి ఉండి, ఎయిర్‌టెల్ 4జీ సిమ్ వాడే వారు ఈ వైఫై సేవలను ఉపయోగించుకోవచ్చు. అయతే ప్రస్తుతం కొన్ని ఫోన్లకు మాత్రమే అందుబాటులో ఉంది. కింద తెలిపిన స్మార్ట్‌ఫోన్లు ఉన్నవారు ఈ వైఫై కాలింగ్ సేవలను ఉపయోగించుకోవచ్చు.

ఎయిర్‌టెల్ వైఫై కాలింగ్‌కు సపోర్ట్‌నిచ్చే స్మార్ట్‌ఫోన్లు 
 

ఐఫోన్ XR, ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్, 7, 7 ప్లస్, ఎస్‌ఈ, ఐఫోన్ 8, 8 ప్లస్, ఐఫోన్ X, ఐఫోన్ XS, ఐఫోన్ XS మ్యాక్స్, ఐఫోన్ 11, 11 ప్రొ, 11 ప్రొ మ్యాక్స్, వన్‌ప్లస్ 7, 7 ప్రొ, 7టి, 7టి ప్రొ, షియోమీ పోకో ఎఫ్1, రెడ్‌మీ కె20, కె20 ప్రొ, శాంసంగ్ గెలాక్సీ జె6, ఆన్6, గెలాక్సీ ఎం30ఎస్, గెలాక్సీ ఎ10ఎస్

వైఫై కాలింగ్‌ను వాడుకోవాలంటే

ఎయిర్‌టెల్ వైఫై కాలింగ్‌ను వాడుకోవాలంటే వినియోగదారులు తమ తమ ఫోన్లలో ఉండే సెట్టింగ్స్‌లోని మొబైల్ డేటా లేదా మొబైల్ నెట్‌వర్క్స్ ఆప్షన్లలో ఉండే వైఫై కాలింగ్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. దీంతో వైఫై కాలింగ్ ద్వారా చేసుకునే కాల్స్‌లో మాటలు చాలా స్పష్టంగా వినిపిస్తాయి. కాగా ప్రస్తుతం కేవలం ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో మాత్రమే ఈ సేవలు వినియోగదారులకు అందుబాటులో ఉండగా, త్వరలోనే దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు వైఫై కాలింగ్ సేవలను అందుబాటులోకి తేనుంది.

మొబైల్ యాప్‌లో సెక్యూరిటీ ప్రాబ్లమ్

ఇదిలా ఉంటే తమ మొబైల్ యాప్‌లో సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఉందని ఎయిర్‌టెల్ ఒప్పుకుంది. ఎయిర్‌టెల్ యాప్‌లో సెక్యూరిటీకి సంబంధించిన బగ్ ఉన్నట్లు ఎహ్రాజ్ అహ్మద్ అనే వ్యక్తి కనిపెట్టాడు. దీనిపై స్పందించిన ఎయిర్‌టెల్ ఒప్పుకుంది. అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్‌ఫేస్(ఏపీఐ) యూనిట్ లో సమస్య ఉన్నట్లు గుర్తించారు. దీనిపై ఎయిర్‌టెల్ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. 'ఇక్కడొక టెక్నికల్ సమస్య ఉంది. నాలుగింటిలో ఒకటైన ఏపీఐలో సమస్య గురించి మా నోటీస్ కు వచ్చింది. డిజిటల్ ప్లాట్ ఫాంలో అత్యున్నత భద్రతా ప్రమాణాలు ఉన్న నెట్‌వర్క్ ఎయిర్‌టెల్ అని ఆయన అన్నారు.

భారత్‌లోని 325.5మిలియన్ ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్స్
 

ఏ ఎయిర్‌టెల్ సబ్ స్క్రైబర్ ఫోన్ నుంచైనా ఇతర ఎయిర్ టెల్ వినియోగదారుడి డేటా తెలుసుకోవచ్చు. 'పేరు, జెండర్, ఈ మెయిల్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, సబ్‌స్క్రిప్షన్ ఇన్ఫర్మేషన్, డివైజ్ క్యాపబిలిటీ ఇన్ఫర్మేషన్ ఫర్ 4జీ, 3జీ, జీపీఆర్ఎస్, నెట్‌వర్క్ ఇన్ఫర్మేషన్, యాక్టివేషన్ డేట్, యూజర్ టైప్(ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్), ప్రస్తుతం వాడే ఫోన్ IMEI నెంబర్ వంటి వివరాలు తెలుసుకునే వీలు ఉందట. దీనికి పరిష్కారం దొరికి బగ్ ఫిక్స్ చేసినప్పటికీ ఇప్పటికే భారత్‌లోని 325.5మిలియన్ ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్స్ ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోయింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Bharti Airtel rolls out WiFi Calling service in Delhi NCR: Here is how it works

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X