Home
News

లేటుగా వచ్చినా సరే లేటెస్ట్ యానువల్ ప్లాన్ తో దూసుకొచ్చిన ఎయిర్‌టెల్

దేశీయ టెలికాం రంగంలో రోజురోజుకు టారిప్ వార్ మరింతగా వేడెక్కుతోంది. ముఖ్యంగా రిలయన్స్‌ జియోతో ఎయిర్‌టెల్ నువ్వా నేనా అంటూ ఢీకొంటోంది.

దేశీయ టెలికాం రంగంలో రోజురోజుకు టారిప్ వార్ మరింతగా వేడెక్కుతోంది. ముఖ్యంగా రిలయన్స్‌ జియోతో ఎయిర్‌టెల్ నువ్వా నేనా అంటూ ఢీకొంటోంది. జియోకి పోటీగా ఈ టెలికాం దిగ్గజం కొత్త కొత్త ప్లాన్లను ఆవిష్కరిస్తూనే ఉంది. తాజాగా మరో కొత్త వార్షిక ప్లాన్‌ను ఎయిర్‌టెల్‌ లాంచ్‌ చేసింది. 1699 రూపాయలతో ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

ఎయిర్‌టెల్‌ రూ.1699 ప్లాన్

ఎయిర్‌టెల్‌ రూ.1699 ప్లాన్

365 రోజుల వ్యాలిడిటీతో ఎయిర్‌టెల్ అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రీపెయిడ్ ప్లాన్ రూ.1,699 ధర ట్యాగ్‌తో లభ్యమవుతోంది. 365 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో భాగంగా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజు 100 ఎస్సెమ్మెస్‌లు, 1జీబీ డేటాను వినియోగించుకోవచ్చు.

ఇతర టెలికాం కంపెనీల యానువల్ ప్లాన్స్ పై ఓ లుక్కేయండి

ఇతర టెలికాం కంపెనీల యానువల్ ప్లాన్స్ పై ఓ లుక్కేయండి

BSNL రూ.1,312 ప్లాన్

365 రోజుల వ్యాలిడిటీతో BSNL అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రీపెయిడ్ ప్లాన్ రూ.1,312 ధర ట్యాగ్‌తో లభ్యమవుతోంది. 365 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో భాగంగా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు ఉచితంగా 1,000 ఎస్సెమ్మెస్‌లు, 5జీబీ(2G / 3G) డేటాను వినియోగించుకోవచ్చు. డేటా అయిపోగానే యాడ్ ఆన్ డేటా ప్యాక్‌లతో యూజర్లు ప్రత్యేక రీఛార్జి చేసుకుంటే పరిమితి మేరకు డేటా వాడుకోవచ్చు.ముంబై ,ఢిల్లీలో తప్ప అన్ని సర్కిళ్ల కస్టమర్స్ ఈ ఆఫర్ ను వినియోగించుకోవచ్చు.

BSNL రూ.1,699 ప్లాన్

BSNL రూ.1,699 ప్లాన్

365 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో భాగంగా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 2జీబి 4జీ డేటా అందుబాటులో ఉంటుంది. ఇదే సమయంలో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను పంపుకోవచ్చు.

BSNL రూ. 2,099 ప్లాన్

BSNL రూ. 2,099 ప్లాన్

365 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో భాగంగా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 4జీబి 4జీ డేటా అందుబాటులో ఉంటుంది. ఇదే సమయంలో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను పంపుకోవచ్చు.

జియో రూ.1699 ప్లాన్

జియో రూ.1699 ప్లాన్

జియో రూ.1699 ప్లాన్ తో ఉచితంగా లోకల్‌, నేషనల్‌ కాల్స్‌, అపరిమిత రోమింగ్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 547.5 జీబీ డేటాను పొందవచ్చు. అంటే రోజుకు 1.5జీబీ డేటా లభిస్తుంది.

వోడాఫోన్ ఐడియా రూ.1499 ప్లాన్

వోడాఫోన్ ఐడియా రూ.1499 ప్లాన్

ఈ రూ.1499 ప్లాన్‌ కింద రోజుకు 1జీబీ డేటాను వొడాఫోన్‌ ఆఫర్‌ చేయనుంది. దీనిపై కూడా ఇతర ప్రయోజనాలు అపరిమిత లోకల్‌, ఎస్టీడీ, రోమింగ్‌ వాయిస్‌ కాల్స్‌ ఉచితం. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా యూజర్లు పొందనున్నారు.ఈ ప్లాన్ వాలిడిటీని 365 రోజులుగా నిర్ణయించారు.

Best Mobiles in India

English summary
Bharti Airtel Rs 1,699 Yearly Prepaid Plan With 1GB Dailly Data Benefit Launched.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X