Airtel పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచనున్నాయి!! ఈ కొత్త ప్లాన్ ప్రయోజనాల మీద ఓ లుక్ వేయండి...

|

ఇండియాలో రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన భారతీ ఎయిర్‌టెల్ తన యొక్క వినియోగదారులకు ఉత్తమమైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నది. ఇప్పుడు మరొకసారి మొబైల్ సర్వీసు యొక్క టారిఫ్‌ ధరల పెంపుపై టెల్కోలు అన్ని దృష్టి పెడుతున్నాయి. ఇప్పటి వరకు వారు ప్రీపెయిడ్ ప్లాన్‌ల టారిఫ్‌లను మాత్రమే పెంచారు. కానీ ఇప్పుడు వారు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరలను కూడా పెంచనున్నట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. భారతీ ఎయిర్‌టెల్ టెల్కో కొన్ని వారాల క్రితం కొత్తగా ఒక పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ తన యొక్క పాతకాలం నాటి ప్రయోజనాలను సవరించి అందుబాటులోకి తీసుకొనివచ్చింది. ఈ మార్పులో టెల్కో యొక్క రూ.999 ప్లాన్ ప్రయోజనాలు కొత్తగా ప్రారంభించిన రూ.1199 ప్లాన్‌కి మార్చింది. ఈ ప్లాన్‌లు రెండు తన యొక్క కస్టమర్‌లకు ఏమి ఆఫర్ చేస్తుందో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ రూ. 1199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

ఎయిర్‌టెల్ రూ. 1199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

భారతి ఎయిర్‌టెల్ రూ.1199 ధర వద్ద కొత్తగా ప్రారంభించిన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో తన యొక్క వినియోగదారులకు 200GB వరకు రోల్‌ఓవర్‌తో ప్రతి యాడ్-ఆన్ కనెక్షన్‌కు 150GB నెలవారీ డేటా + 30GB డేటాను అందిస్తుంది. ఇది కుటుంబ సభ్యుల కోసం వినియోగదారులు రెండు ఉచిత యాడ్-ఆన్ వాయిస్ కనెక్షన్‌లను క్లెయిమ్ చేయవచ్చు. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకి 100 SMS ప్రయోజనాలు చేర్చబడ్డాయి. ఈ ప్లాన్‌తో వినియోగదారులు ఎయిర్‌టెల్ థాంక్స్ ప్లాటినం రివార్డ్‌లలో Netflix సబ్‌స్క్రిప్షన్, ఆరు చెల్లుబాటుతో అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్, Disney+ Hotstar మొబైల్ ప్లాన్ మరియు Wynk ప్రీమియం వంటి మరిన్ని ప్రయోజనాలు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అందిస్తాయి.

భారతీ ఎయిర్‌టెల్ రూ. 999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

భారతీ ఎయిర్‌టెల్ రూ. 999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

భారతీ ఎయిర్‌టెల్ టెల్కో ముందు రూ.999 ధర వద్ద అందించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్ యొక్క ప్రయోజనాలను పరిశీలిస్తే కనుక ఇవి దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. వీటిలో 200GB వరకు రోల్‌ఓవర్‌తో 100GB నెలవారీ డేటా (ప్రతి యాడ్-ఆన్ కనెక్షన్‌కు 30GB), అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకి 100 SMS ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్లాన్ ఎయిర్‌టెల్ థాంక్స్ ప్లాటినం ప్రయోజనాలతో కూడా వస్తుంది. ఈ ప్లాన్‌తో పాటు మొత్తం రెండు యాడ్-ఆన్ కనెక్షన్‌లు కూడా ఉండవచ్చు. రూ.999 ప్లాన్ ఇప్పటికీ చాలా మందికి మంచి ఎంపిక అయినప్పటికీ ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరలను పరోక్షంగా పెంచుతున్నట్లు కనిపిస్తోంది.

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ 'సేఫ్ పే' ఫీచర్‌

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ 'సేఫ్ పే' ఫీచర్‌

సేఫ్ పే ఫీచర్ అనేది కొత్త విషయం ఏమి కాదు. ఎయిర్‌టెల్ 'సేఫ్ పే' అనేది పేమెంట్ ధృవీకరణ ప్రక్రియ యొక్క అదనపు ప్రొటెక్షన్. ఇది వినియోగదారులు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ ద్వారా జరిపే లావాదేవీలు మరింత సురక్షితమైనవిగా చేయడానికి టూ-స్టెప్ వెరిఫికేషన్ యాక్సిస్ ని అందుబాటులోకి తీసుకొనివచ్చింది. ఎయిర్‌టెల్ 'సేఫ్ పే' అనేది మీ అకౌంట్ నుండి లావాదేవీలు జరిగిన ప్రతిసారి లావాదేవీని ఆమోదించమని అడగబడుతు నిర్ధారనను పంపుతుంది. ఎయిర్‌టెల్ 'సేఫ్ పే' OTA (ఓవర్ ది ఎయిర్) టెక్నాలజీని ఉపయోగించి వినియోగదారులకు వారి అకౌంట్ నుండి జరిగే లావాదేవీ గురించి హెచ్చరికను పంపుతుంది. ఎయిర్‌టెల్ 'సేఫ్ పే' ఫీచర్ అందుబాటులోకి రావడంతో ఇందుకోసం ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ అదనంగా ఏమైనా వసూలు చేస్తుంది అని అనుకుంటే కనుక పొరపాటు. దీనికోసం బ్యాంక్ ఏమి వసూలు చేయదని గమనించండి. కాబట్టి కస్టమర్ పేమెంట్స్ చేస్తున్నప్పుడు ఆ లావాదేవీని యాక్సిస్ చేయడానికి వినియోగదారులు వారి mPIN లేదా OTPని నమోదు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. సాధారణంగా సరైన mPIN లేదా OTPని నమోదు చేయడం వలన పేమెంట్ పూర్తిచేయబడుతుంది. కానీ ఎయిర్‌టెల్ సేఫ్ పే రాకతో mPIN లేదా OTPని నమోదు చేసిన తర్వాత కూడా వినియోగదారులు తమ ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ నుండి మాన్యువల్‌గా లావాదేవీని ఆమోదించమని అడగబడతారు.

ఎక్స్‌స్ట్రీమ్ మల్టీప్లెక్స్

భారతీయ టెలికాం సంస్థ మెటావర్స్‌లో OTT ల కంటెంట్‌ను అందిస్తూ ముందుకు దూసుకెళ్లడం ఇదే తొలిసారి. పార్టీనైట్ తో కలిసి ఎక్స్‌స్ట్రీమ్ ఎక్స్‌స్ట్రీమ్ మల్టీప్లెక్స్ ను మెటావర్స్‌లో హోస్ట్ చేయబడింది. మెటావర్స్‌లో పరస్పర చర్య చేయడానికి వినియోగదారులు అనుమతించబడతారు. పార్టీనైట్ యొక్క సృష్టికర్త అయిన గామిట్రానిక్స్ యొక్క ఆలోచనలో భాగంగానే ఎయిర్‌టెల్ తో కలిసి పని చేసింది. ఎయిర్‌టెల్ మార్కెటింగ్ డైరెక్టర్ శాశ్వత్ శర్మ మాట్లాడుతూ ఎక్స్‌స్ట్రీమ్ మల్టీప్లెక్స్ వెబ్ 3.0 అప్లికేషన్‌లు మరియు స్టోరీ టెల్లింగ్ లతో కలిపి వినియోగదారులకు మెరుగైన గొప్ప అనుభవాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ మెటావర్స్‌తో ఎయిర్‌టెల్ సంస్థ మరింత ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. OTT ప్లాట్‌ఫారమ్‌లను ప్రయత్నించేలా ప్రజలను తనవైపు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ తో ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఇప్పటికే సుమారు 2 మిలియన్ల మంది పేమెంట్ చందాదారులను కలిగి ఉండడం అనేది గమనించదగ్గ విషయం. ఈ విషయాన్ని ఎయిర్‌టెల్ డిజిటల్ CEO ఆదర్శ్ నాయర్ మీడియా సమావేశంలో తెలిపారు. రాబోయే రోజులలో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ కోసం 20 మిలియన్లకు పైగా పేమెంట్ చందాదారులను కలిగి ఉండాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. దీని కారణంగా కంపెనీకి ప్రత్యేక ప్రధాన ఆదాయ వనరులను పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Bharti Airtel Rs 1199 Plan Offers The Benefits of Old Rs.999 Postpaid Plan

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X