భారతీ ఎయిర్‌టెల్ యొక్క బెస్ట్-సెల్లర్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే!!
భారతదేశంలో రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన భారతీ ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం పోర్ట్‌ఫోలియోలో అనేక మెరుగైన ప్రీపెయిడ్ ఆఫర్‌లను కలిగి ఉంది. టెల్కో స్వల్పకాలిక నుండి మధ్యకాలిక మరియు దీర్ఘకాలిక చెల్లుబాటు విభాగాలలో మెరుగైన ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. అయితే ఎక్కువ మంది వినియోగదారులు స్వల్పకాలిక ప్లాన్‌లను ఎంచుకోవడానికి ఇష్టపడరు. అయితే అదే సమయంలో దీర్ఘకాలిక ప్లాన్‌లు అధిక డిస్కౌంట్ ఆఫర్లను అనుమతించినప్పటికీ ప్రతి ఒక్కరూ దానికి అవసరమైన డబ్బును ఒకేసారి ఖర్చుచేయడానికి కూడా ఇష్టపడరు. అందువల్ల చాలా మంది వ్యక్తులు మధ్యకాలిక చెల్లుబాటుతో లభించే ప్లాన్‌లను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. భారతీ ఎయిర్‌టెల్ మీడియం టర్మ్-వ్యాలిడిటీలో అందించే అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

భారతీ ఎయిర్‌టెల్ మీడియం-టర్మ్ బెస్ట్-సెల్లర్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు
భారతీ ఎయిర్‌టెల్ మీడియం-టర్మ్ విభాగంలో అందించే ప్లాన్‌లలో అధికంగా రూ.598 మరియు రూ.698 ధరల వద్ద లభించే ప్లాన్‌లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ రెండు ప్లాన్‌లు 84 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS ప్రయోజనాలు మరియు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ వంటి మరిన్ని బెనిఫిట్‌లు చాలా ఉన్నాయి. ఇందులో రూ.598 ప్లాన్ 1.5GB రోజువారీ డేటాను మరియు రూ.698 ప్లాన్ 2GB రోజువారీ డేటాను అందిస్తుంది. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ యొక్క ఒక నెల ఉచిత ట్రయల్‌తో రెండు ప్లాన్‌లు వస్తాయి. ఇతర ప్రయోజనాలు ఉచిత ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సబ్‌స్క్రిప్షన్, వింక్ మ్యూజిక్, 1 సంవత్సరానికి షా అకాడమీ వంటివి మరిన్ని ఉన్నాయి.

మీడియం-టర్మ్ వ్యాలిడిటీతో ప్రీపెయిడ్ ప్లాన్‌ల కోసం చూస్తున్న వినియోగదారులకు ఈ రెండు ప్లాన్‌లు సరైనవి. 84 రోజులు అంటే దాదాపు 3 నెలలు కాబట్టి మీరు ఈ ప్లాన్లలో ఒకదాన్ని ఇష్టపడితే సంవత్సరానికి 4 నుండి 5 సార్లు రీఛార్జ్ చేయవలసి ఉంటుంది అంతే. యూజర్ల కోసం 56 రోజుల చెల్లుబాటుతో లభించే మరికొన్ని ప్లాన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ అవి ఈ విభాగంలో ఉత్తమమైనవి కావు. భారతీ ఎయిర్‌టెల్ రూ.399 ధర వద్ద లభించే ప్లాన్ 1.5GB రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, 100 SMS/రోజు మరియు ఎయిర్‌టెల్ థాంక్స్ వంటి ప్రయోజనాలతో వస్తుంది.

ఈ ప్లాన్ కంటే మెరుగైన మరొక ప్లాన్ రూ.449 ధర వద్ద లభిస్తుంది. దీని ధర కేవలం 50 రూపాయలు మాత్రమే అధికంగా ఉంటుంది. అయితే ఇది 2GB రోజువారీ డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజువారీ 100 SMS మరియు ఎయిర్‌టెల్ థాంక్స్ వంటి అన్ని ప్రయోజనాలను అందిస్తుంది. మీరు టెల్కో నుండి కొనుగోలు చేయగల ఇతర ప్రీపెయిడ్ ప్లాన్‌లు చాలా ఉన్నాయి. మీరు 28 రోజులు, 56 రోజులు, 84, రోజులు మరియు 365 రోజుల చెల్లుబాటుతో వచ్చే ప్రీపెయిడ్ ప్లాన్‌లను పొందవచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు డిస్నీ+ హాట్ స్టార్ మొబైల్ ఓన్లీ ప్లాన్ యొక్క ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనంతో వచ్చే ప్రణాళికలు ఉన్నాయి. ఇటీవల భారతీ ఎయిర్‌టెల్ రూ.49 ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసివేసింది మరియు ఇప్పుడు వినియోగదారులు వాయిస్ కాలింగ్ మరియు డేటా రెండింటినీ ఎంచుకునే బేస్ ప్లాన్ రూ .79 కి వస్తుంది.

IPL 2021 కోసం భారతీ ఎయిర్‌టెల్ ప్లాన్‌లు
భారతీ ఎయిర్‌టెల్ యొక్క మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లు డిస్నీ+ హాట్‌స్టార్ ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫారమ్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నాయి. ఈ ప్లాన్‌లు రూ.499, రూ.699 మరియు రూ.2,798 ధరల వద్ద లభిస్తాయి. ఇందులో రూ.499 ప్లాన్ 3GB రోజువారీ డేటాను 28 రోజుల చెల్లుబాటుతో అందిస్తుంది. అయితే రూ.699 మరియు రూ.2,798 ప్లాన్‌లు రెండూ వినియోగదారులకు 2GB రోజువారీ డేటాను వరుసగా 56 రోజులు మరియు 365 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తాయి. ఈ ప్లాన్‌లన్నీ కస్టమర్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు, 100 SMS/రోజు మరియు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తాయి. అంతేకాకుండా ఎయిర్‌టెల్ థాంక్స్ వంటి ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ ప్లాన్‌లు ఐపిఎల్ 2021 రెండవ దశను చూడటానికి మీకు సహాయపడతాయి. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ప్లాన్ యొక్క స్వతంత్ర చందా ధర సంవత్సరానికి రూ.499 అని గమనించండి.


Click it and Unblock the Notifications