ఇండియాలో ఐఫోన్ 4ని భారతీ ఎయిర్‌టెల్ అమ్మనుందా..?

Posted By: Super

ఇండియాలో ఐఫోన్ 4ని భారతీ ఎయిర్‌టెల్ అమ్మనుందా..?

ఆపిల్ ఐఫోన్4 విడుదల కాకముందే ఇండియాలో ఐపోన్5ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామంటూ భారతదేశంలో పెద్దదైన టెలికమ్యూనికేషన్ల కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ కొన్ని నెలలముందు ప్రకటించిన విషయం తెలిసిందే. ఐతే ఇంతకీ అసలు ఆపిల్ ఐఫోన్ 4 ఎప్పుడు వస్తుందా అంటూ ఫోన్స్ ప్రియులు ఎదురుచూస్తున్నారు గానీ.. ఐఫోన్ 4 విడుదల తేదీ మాత్రం ఇంకా ఖచ్చితంగా ప్రకటించలేదు.

ఐతే ఇండియాలో ప్రముఖ టెక్నాలజీ బ్లాగు సిలికాన్ ఇండియాలో మాత్రం ఐఫోన్ 4 ఇండియాలో విడుదల చేశారు అంటూ రాశారు. అమెరికాలో విడుదల చేసిన పది నెలలు తర్వాత ఇండియాలో ఐఫోన్ 4 విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. ఇదే విషయం ఐప్యాడ్ విడుదల చేసిన పది నెలలు తర్వాత ఇండియాలో ఐప్యాడ్ విడుదల చేసినటువంటి విషయాన్ని గుర్తు చేశారు.

ఎయిర్ టెల్ గతంలో స్మార్ట ఫోన్స్‌ని ఇండియాలోకి సెప్టెంబర్-అక్టోబర్ 2010లో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామంటూ ఆర్బాటంగా ప్రకటించారు. ఐతే దీనికి సంబంధించినటువంటి విషయాన్ని ఆఫీసియల్‌గా మాత్రం ఇంతవరకు వెల్లడించలేదంటే నమ్మండి. గతంలో ఐఫోన్‌కి సంబంధించినటువంటి కొన్ని మోడళ్శను మార్కెటలోకి భారతీ ఎయిర్ టెల్ విక్రయించిన సంగతి తెలిసిందే.

ఇక భారతదేశంలో ఎక్కువగా అభివృధ్ది చెందుతున్న ఇండస్ట్రీ మొబైల్ ఇండస్ట్రీ. ప్రస్తుతానికి భారతదేశంలో 752మిలియన్ కస్టమర్స్‌లో 40మిలియన్ కస్టమర్స్ మొబైల్ ఇంటర్నెట్‌ని వాడడం జరుగుతుంది. దీనిని బట్టి ఆపిల్ కంపెనీ ఇది గమనించి సౌత్-ఈస్ట్ ఆసియా దేశాలలో తన ఉత్పత్తులకు సంబంధించినటువంటి మోడళ్శకు ప్రచారం కలిగిస్తే బాగుంటుందని అభిప్రాయం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot