ఎయిర్‌టెల్ స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్!! సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచడానికి బెస్ట్ వే...

|

భారతీ ఎయిర్‌టెల్ సిమ్‌ను సెకండరీ కనెక్షన్‌గా వినియోగిస్తున్నవారు దానిని ఎల్లవేళలా యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలనుకునే వారు కంపెనీ అందించే 'స్మార్ట్ రీఛార్జ్' ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. భారతీ ఎయిర్‌టెల్ రూ.99 ధర వద్ద అందించే బేస్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను కంపెనీ 'స్మార్ట్ రీఛార్జ్'గా పేర్కొంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు తమ ఎయిర్‌టెల్ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవడమే కాకుండా టెలికాం సేవలను కూడా వినియోగించుకోవడానికి అనుమతిని ఇస్తుంది. ఈ ప్లాన్‌తో అందించే ప్రయోజనాలు ఏమిటి మరియు సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచడానికి ఇది ఎలా మంచి ఎంపిక ఎవుతుందో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్

ఎయిర్‌టెల్ స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్

మీరు మీ యొక్క ఎయిర్‌టెల్ సిమ్‌ను ఎక్కువ కాలం రీఛార్జ్ చేయకపోతే కనుక దానిని కంపెనీ డీయాక్టివేట్ చేయవచ్చు. అంతేకాకుండా SIM యాక్టీవ్ కాకముందే మీరు ఇన్‌కమింగ్ కాల్ సౌకర్యాన్ని కూడా పొందలేరు. మీరు ఎయిర్‌టెల్ నెంబర్ ని అనేక అవసరాల కోసం వినియోగించి ఉండవచ్చు కావున SIM యాక్టివ్‌లో లేకపోతే కనుక మీ యొక్క అన్ని రకాల సేవలు మిస్ అవ్వవచ్చు. అందువల్ల మీ ఎయిర్‌టెల్ SIMని యాక్టివ్‌గా ఉంచుకోవడానికి మీకు అందుబాటులో ఉండే ఎంపిక రూ.99 ధర వద్ద లభించే స్మార్ట్ ప్లాన్. ఈ ప్లాన్ సెకండరీ సిమ్ వినియోగదారుల కోసం మాత్రమే ప్రత్యేకంగా ఉద్దేశించబడింది. సరసమైన ధరల ఎంపికను కోరుకునే వ్యక్తుల కోసం ఇది ఉపయోగకరంగా ఉంటుంది అని గుర్తుంచుకోండి.

ఎయిర్‌టెల్

భారతీ ఎయిర్‌టెల్ టెల్కో రూ.99 ధరతో అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌తో వినియోగదారులు సెకనుకు ఒక పైసా చొప్పున 200MB డేటాను, రూ.99 విలువైన టాక్‌టైమ్ మరియు లోకల్ టారిఫ్ కాల్‌లను పొందుతారు. వినియోగదారులు స్థానికంగా లోకల్ SMS లకు రూ.1 మరియు STD SMSలకు రూ.1.5 ఛార్జ్ చేయబడుతుంది. ఈ ప్లాన్ మీ SIM 28 రోజుల పాటు యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. చాలా మందికి తమ ఎయిర్‌టెల్ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచడం ఖరీదైన వ్యవహారం అని చెప్పడంలో సందేహం లేదు. అయితే మీరు దానిని భరించగలిగితే ఇది సమర్థవంతమైన పరిష్కారం. ఇంతకుముందు ఈ ప్లాన్ రూ.79 ధర వద్ద లభించేది. ఎయిర్‌టెల్ నవంబర్ 2021 చివరిలో ప్రీపెయిడ్ టారిఫ్‌లను పెంచినప్పుడు, టెల్కో రూ.79 ప్లాన్ ధరను రూ. 99కి మార్చింది.

ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ ఇప్పుడు తన యొక్క వినియోగదారులకు ఊహించని బహుమతిగా ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండానే రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. అది కూడా ఒక నెల పూర్తి చెల్లుబాటుతో. టెల్కో యొక్క కొత్త ప్లాన్లు రెగ్యులేటర్ TRAI యొక్క ఆర్డర్‌కు అనుగుణంగా వస్తుంది. దీని ప్రకారం ప్రతి సర్వీస్ ప్రొవైడర్ ప్రతి నెలా అదే తేదీన రీఛార్జ్ చేసుకోవడానికి వీలుగా ప్రీపెయిడ్ ప్లాన్‌లను కలిగి ఉండాలి. ఎయిర్‌టెల్ యొక్క ప్రత్యర్థి జియో కూడా ఇటీవల రూ.296 మరియు రూ.259 ధర వద్ద 1-నెల పూర్తి వాలిడిటీతో వచ్చే రెండు ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. మరోవైపు వోడాఫోన్ ఐడియా లేదా Vi కూడా నెలవారీ చెల్లుబాటుతో రూ.337 మరియు రూ.327 వద్ద రెండు ప్లాన్‌లను అందిస్తోంది.

అపరిమిత వాయిస్ కాల్‌లు

296 రూపాయల ధర వద్ద ఎయిర్‌టెల్ టెల్కో ప్రవేశపెట్టిన కొత్త ప్లాన్ 30 రోజుల సర్వీస్ వ్యాలిడిటీతో వస్తుంది. ఇది మొత్తం వాలిడిటీ కాలానికి 25GB డేటాను అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత వాయిస్ కాల్స్ మరియు 100 SMS/రోజు ప్రయోజనాలను కూడా అందిస్తుంది. దీనితో పాటు అపోలో 24/7 సర్కిల్, వింక్ మ్యూజిక్ వంటి మరిన్నింటితో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ యొక్క ఉచిత ట్రయల్ యాక్సెస్‌తో ఈ ప్లాన్ లభిస్తుంది. అందించిన డేటా పూర్తయిన తర్వాత వినియోగదారులకు 50p/MB ఛార్జ్ చేయబడుతుంది. అంతేకాకుండా 100SMS/రోజు ముగిసిన తర్వాత స్థానిక SMS ఛార్జీలు రూ.1 మరియు STD SMSకి రూ.1.5 వసూలు చేయబడతాయి. ఎయిర్‌టెల్ కొత్తగా ప్రవేశపెట్టిన మరొక ప్లాన్ వాస్తవానికి రోజువారీ డేటా ప్రయోజనంతో రూ.319 ధర ట్యాగ్‌తో లభిస్తుంది. ఇది పూర్తిగా 1 నెల చెల్లుబాటు వ్యవధిలో రోజుకు 2GB డేటా ప్రయోజనంను అందిస్తోంది. అలాగే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను కూడా అందిస్తుంది. పైన పేర్కొన్న విధంగానే ఈ ప్లాన్ కూడా అపోలో 24/7 సర్కిల్, వింక్ మ్యూజిక్ వంటి మరిన్నింటితో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ యొక్క ఉచిత ట్రయల్‌ యాక్సెస్‌తో వస్తుంది. రోజువారీ డేటా పూర్తయిన తర్వాత వినియోగదారులకు 50p/MB ఛార్జ్ చేయబడుతుంది. అంతేకాకుండా 100SMS/రోజు ముగిసిన తర్వాత SMS ఛార్జీలు స్థానిక SMSకి రూ.1 మరియు STD SMSకి రూ. 1.5 వసూలు చేయబడతాయి.

Best Mobiles in India

English summary
Bharti Airtel Smart Recharge Plan is a Good Way to Keep The SIM Always Active

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X