Spectrum 2021 వేలం కొనుగోలులో ఎయిర్‌టెల్ హవా!!

|

ఇండియాలో 2021 సంవత్సరంలో నిర్వహించిన స్పెక్ట్రం వేలం విజయవంతంగా ముగిసింది. ఈ వేలంలో ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ 2300 MHz మిడ్-బ్యాండ్ మరియు సబ్ GHz బ్యాండ్‌లలో 355.45 MHz స్పెక్ట్రంను సంపాదించడం కోసం ఏకంగా 18,699 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. టెల్కో తన నెట్‌వర్క్ యొక్క నాణ్యతను మరింత పెంచుకోవాలని చూస్తోంది. అంతేకాకుండా కొత్త స్పెక్ట్రమ్‌తో భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లోని 90 మిలియన్ల మంది వినియోగదారులను కవర్ చేయగలదని సంస్థ తెలిపింది. వేర్వేరు టెలికాం సర్కిల్‌లలోని ఎయిర్‌టెల్ యొక్క స్పెక్ట్రం కొనుగోళ్ల గురించి మీరు తెలుసుకోవలసిన దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

భారతి ఎయిర్‌టెల్ స్పెక్ట్రమ్ వేలం కొనుగోళ్లు

భారతి ఎయిర్‌టెల్ స్పెక్ట్రమ్ వేలం కొనుగోళ్లు

భారతి ఎయిర్‌టెల్ టెలికాం సంస్థ ఇండియాలో బీహార్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, ఎంపిసిజి, నార్త్ ఈస్ట్, ఒడిశా , యుపి - తూర్పు, యుపి - పశ్చిమ, మరియు పశ్చిమ బెంగాల్ వంటి సర్కిల్‌ల వారీగా స్పెక్ట్రమ్ ను కొనుగోలు చేసింది. ఎయిర్టెల్ సంస్థ ఈ సర్కిల్‌లలో సబ్ జిహెచ్‌జడ్ బ్యాండ్, మిడ్-బ్యాండ్ మరియు 2300 మెగాహెర్ట్జ్ బ్యాండ్ వంటి మూడు రకాల బ్యాండ్లలో స్పెక్ట్రంను కొనుగోలు చేయడం ద్వారా స్పెక్ట్రం పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేసింది.

800 MHz

ఎయిర్‌టెల్ సంస్థ స్పెక్ట్రం కొనుగోలులో 800 MHz మరియు 900 MHz సబ్ జీహెచ్‌జెడ్ బ్యాండ్‌ల కోసం మొత్తంగా రూ.9,457 కోట్లు ఖర్చు చేసింది. ఈ విభాగంలో మొత్తంగా 48.85 MHz స్పెక్ట్రంను ఎయిర్‌టెల్ సొంతం చేసుకుంది. ఈ టెల్కో తమిళనాడులోని 900 MHz బ్యాండ్‌లో 5 MHz స్పెక్ట్రంను కొనుగోలు చేసింది. వీటిలో చెన్నై, యుపి - ఈస్ట్ మరియు యుపి - వెస్ట్ సర్కిల్‌లు ఉన్నాయి. ఇంకా ఇది MPCG సర్కిల్‌లోని 800 MHz బ్యాండ్‌లో 5 MHz స్పెక్ట్రంను కొనుగోలు చేసింది.

మిడ్-బ్యాండ్ స్పెక్ట్రం
 

మిడ్-బ్యాండ్ స్పెక్ట్రం విషయానికి వస్తే ఎయిర్‌టెల్ సంస్థ 1800 MHz మరియు 2100 MHz బ్యాండ్‌తో సహా 86.6 MHz స్పెక్ట్రం యొక్క హక్కులను సంపాదించడానికి మొత్తంగా 6,172 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఈ బ్యాండ్‌లో స్పెక్ట్రంను సంపాదించడానికి చెన్నైతో సహా కర్ణాటక, తమిళనాడు రెండింటికీ రూ.1,000 కోట్లకు పైగా ఖర్చు చేయవలసి వచ్చింది. ఈ విభాగంలో అన్ని సర్కిల్‌లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. తమిళనాడులోని మొత్తం 1800 MHz బ్యాండ్‌లో ఎయిర్‌టెల్ 15 MHz స్పెక్ట్రంను 1,500 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే కర్ణాటకలో అదే బ్యాండ్‌లో 11.2 MHz స్పెక్ట్రంను 1,221 కోట్లకు కొనుగోలు చేసింది.

2300 MHz బ్యాండ్‌

2021 స్పెక్ట్రం వేలంలో చివరగా 2300 MHz బ్యాండ్‌లో టెల్కో మొత్తంగా సుమారు రూ.3,070 కోట్లను ఖర్చు చేసి 220 MHz స్పెక్ట్రంను సొంతం చేసుకుంది. ఇది మహారాష్ట్రలోని సంబంధిత బ్యాండ్‌లో గణనీయమైన కొనుగోళ్లు చేసింది. 10MHz స్పెక్ట్రం కోసం రూ.720 కోట్లను ఖర్చు చేసింది. ఈ విభాగంలో ఏ సర్కిల్‌లోనైనా టెల్కోకు ఇది చాలా ఎక్కువ. గుజరాత్‌లోని అదే బ్యాండ్‌లో 10MHz స్పెక్ట్రం కోసం ఎయిర్‌టెల్ 700 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఎయిర్టెల్ చివరిగా 2300 MHz బ్యాండ్ పాన్-ఇండియాలో 10 MHz లేదా 20 MHz స్పెక్ట్రంను కొనుగోలు చేసింది.

Best Mobiles in India

English summary
Bharti Airtel Spends Rs18,699 Crores For Spectrum Auction Purchases

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X