లక్ష ఉద్యోగాలకు ఎసరు, కష్టాల్లో టెలికం రంగం

Written By:

రోజురోజుకు టెలికాం రంగంలో ఉద్యోగులు సంఖ్య భారీగా తగ్గిపోతుంది.ఇది ఇలాగే కొనసాగితే రానున్న కాలంలో ఈ రంగంలో లక్ష టెలికం ఉద్యోగాల కనుమరుగయ్యే ప్రమాదం ఉందని రిపోర్టులు తెలియజేస్తున్నాయి. ఈ రకమైన సంక్షోభంలో ఎయిర్‌టెల్‌ ముందు వరసలో ఉన్నట్లు రిపోర్టులు తెలియజేస్తున్నాయి.

BSNL రీ‌ఛార్జ్‌లపై భారీ డిస్కౌంట్లు, డేటా ఆఫర్లు

లక్ష ఉద్యోగాలకు ఎసరు, కష్టాల్లో టెలికం రంగం

దిగ్గజ కంపెనీగా పేరున్న భారతీ ఎయిర్‌టెల్‌లో గతేడాది కంటే ఈ ఏడాదికి ఉద్యోగులు 1,805 మంది తగ్గిపోయారు. గతేడాది సెప్టెంబర్‌లో 19,462గా ఉన్న ఎయిర్‌టెల్‌ ఉద్యోగుల సంఖ్య, ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి 17,657గా ఉంది. ఈ క్రమంలో ఒక్కో ఉద్యోగికి ఉన్న కస్టమర్లు 16,960కి పెరిగారు. గతేడాది ఈ సంఖ్య 14,189గా ఉంది.

Nokia 2 vs Xiaomi Redmi 4A vs Moto C Plus, సవాల్ విసిరే ఫోన్..?

లక్ష ఉద్యోగాలకు ఎసరు, కష్టాల్లో టెలికం రంగం

ఒక్కో నెలలో ఒక్కో ఉద్యోగి రెవెన్యూ 4.1 శాతం తగ్గిపోయి, రూ.31.5 లక్షలుగా నమోదైంది. టెలికాం ఆపరేటర్ల మధ్య తీవ్ర పోటీ వాతావరణం నెలకొనడంతో, లాభాలు భారీగా తగ్గిపోతున్నాయని విశ్లేషకులు చెప్పారు. దీంతో టెలికాం కంపెనీలు చాలామంది ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌లు ఇస్తున్నాయి. పరోక్ష ఉద్యోగాలతో పోలిస్తే మొత్తం లక్ష టెలికాం ఉద్యోగాలు వచ్చే ఏళ్లలో ప్రమాదంలో పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

పేటీఎంకి దిమ్మతిరిగే షాకివ్వబోతున్న వాట్సప్ పే,తొలి అవకాశం ఇండియాకే..

లక్ష ఉద్యోగాలకు ఎసరు, కష్టాల్లో టెలికం రంగం

భారత్‌లోనే కాక, ఆఫ్రికాలో కూడా ఎయిర్‌టెల్‌ తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించేసింది. ఆఫ్రికాలో కంపెనీ ఉద్యోగులు 321 మంది తగ్గిపోయారు. ఏడాది క్రితం ఆఫ్రికాలో 4,058 మంది ఉద్యోగులుండగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌కి 3,737 గా ఉన్నారు.

English summary
Bharti Airtel staff count shrinks by 1,805; 100,000 telecom jobs at risk more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot