Home
News

ఎయిర్‌టెల్ 1 సంవత్సరం లాంగ్ టర్మ్ ప్లాన్‌!! తక్కువ ధరలోనే

ఇండియాలోని టెలికాం సంస్థలలో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ తన యొక్క వినియోగదారులకు ఏడాది పొడవునా చెల్లుబాటుతో మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. మీరు ఎయిర్‌టెల్ యొక్క సిమ్ ని వినియోగిస్తుంటే కనుక మరియు అత్యంత సరసమైన ధర వద్ద లభించే లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే కనుక 365 రోజుల చెల్లుబాటుతో రూ.1799 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎంచుకోవడం ఉత్తమం. ఒక సంవత్సరాల వాలిడిటీతో లభించే మూడు లాంగ్ టర్మ్ ప్లాన్‌లలో ఇది అత్యంత సరసమైనది.

ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్ వినియోగదారులు 1.5GB రోజువారీ డేటాతో ఒక ఏడాది వాలిడిటీతో ఎలాంటి ప్లాన్‌లను కలిగి లేరు. అధిక మొత్తంలో డేటాను వినియోగించాలనుకునే వ్యక్తులకు రూ.1799 ధర వద్ద లభించే ప్లాన్ తగినది కాదు. సెకండరీ సీమ్ గా వినియోగిస్తూ డేటాతో ఉపయోగం లేకుండా కేవలం వాయిస్ కాలింగ్‌ కోసం మాత్రమే ఎక్కువగా వినియోగించుకునే వినియోగదారులకు ఇది మంచి ఎంపిక. ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

భారతీ ఎయిర్‌టెల్ రూ. 1799 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

భారతీ ఎయిర్‌టెల్ రూ. 1799 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

రూ.1799 ధర వద్ద లభించే భారతీ ఎయిర్‌టెల్ యొక్క లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్ మొత్తం 365 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. అయితే ఈ సంవత్సర కాలంలో వినియోగదారులు కేవలం 24GB డేటాను మాత్రమే పొందగలుగుతారు. మీరు మొదటి నెలలోనే 24GB డేటాను ఉపయోగిస్తే కనుక తరువాత ఉచిత డేటా ఉండదు. 24GB డేటా ముగిసిన తర్వాత వినియోగదారుల నుండి 1MBకి 50 పైసలు వసూలు చేస్తామని ఎయిర్‌టెల్ తెలిపింది. అయినప్పటిక మీకు డేటా అవసరమైనప్పుడు మీరు 4G డేటా వోచర్‌ల కోసం వెళ్లవచ్చు. ఇది కాకుండా వినియోగదారులు మొత్తం చెల్లుబాటు కాలంలో అపరిమిత వాయిస్ కాలింగ్ ను పొందుతారు. ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌తో మొత్తం 3600 SMSలను కూడా అదనంగా అందిస్తుంది. అదనంగా మూడు నెలల పాటు అపోలో 24|7 సర్కిల్ సబ్‌స్క్రిప్షన్, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.100 నగదు, ఉచిత హెలోట్యూన్స్ మరియు వింక్ మ్యూజిక్ వంటి ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ప్రైవేట్ టెల్కో

ఇండియాలోని ప్రైవేట్ టెల్కోలలో అధిక ధర వద్ద ప్రీపెయిడ్ ప్లాన్లను అందించే ఎయిర్‌టెల్ సిమ్ ని వాడుతున్నవారు దీనితో అధికంగా డేటాను వినియోగించకుండా కేవలం వాట్సాప్ కోసం డేటాను వినియోగిస్తూ మరియు వాయిస్ కాలింగ్ వంటి ప్రాథమిక ఉపయోగం కోసం వారి ఫోన్ అవసరమయ్యే వృద్ధులకు ఇది మంచి ప్రీపెయిడ్ ప్లాన్. మీ ఎయిర్‌టెల్ సెకండరీ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచడానికి ఇది మంచి ప్లాన్. మీరు దానిని కొనుగోలు చేయగలిగితే కనుక మళ్లీ మళ్లీ రీఛార్జ్ చేయడం గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు. టారిఫ్ పెంపుదల ప్రారంభానికి ముందు ఈ ప్లాన్ సెకండరీ ఆప్షన్‌గా ఉపయోగించే ఎయిర్‌టెల్ సిమ్ యజమానులకు లైఫ్ సేవర్‌గా ఉంటుంది.

ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ ఇప్పుడు తన యొక్క వినియోగదారులకు ఊహించని బహుమతిగా ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండానే రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. అది కూడా ఒక నెల పూర్తి చెల్లుబాటుతో. టెల్కో యొక్క కొత్త ప్లాన్లు రెగ్యులేటర్ TRAI యొక్క ఆర్డర్‌కు అనుగుణంగా వస్తుంది. దీని ప్రకారం ప్రతి సర్వీస్ ప్రొవైడర్ ప్రతి నెలా అదే తేదీన రీఛార్జ్ చేసుకోవడానికి వీలుగా ప్రీపెయిడ్ ప్లాన్‌లను కలిగి ఉండాలి. ఎయిర్‌టెల్ యొక్క ప్రత్యర్థి జియో కూడా ఇటీవల రూ.296 మరియు రూ.259 ధర వద్ద 1-నెల పూర్తి వాలిడిటీతో వచ్చే రెండు ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. మరోవైపు వోడాఫోన్ ఐడియా లేదా Vi కూడా నెలవారీ చెల్లుబాటుతో రూ.337 మరియు రూ.327 వద్ద రెండు ప్లాన్‌లను అందిస్తోంది.

టారిఫ్ పెంపు

టారిఫ్ పెంపు తరువాత భారతీ ఎయిర్‌టెల్ తన యొక్క ప్రీపెయిడ్ ప్లాన్‌ల ARPU ప్రారంభ ధర రూ.200 లక్ష్యంను చేరుకోవడానికి అనుమతిస్తుంది. కానీ మీడియం-టు-లాంగ్ రన్‌లో ఎయిర్‌టెల్ దాని ARPU రూ.300 స్థాయిని అధిగమించాలని కోరుకుంటోంది. దీని అర్థం రాబోయే రోజులలో మరిన్ని ధరల పెంపుదలలను చూడబోతున్నాం.

ఎయిర్‌టెల్ స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్

మీరు మీ యొక్క ఎయిర్‌టెల్ సిమ్‌ను ఎక్కువ కాలం రీఛార్జ్ చేయకపోతే కనుక దానిని కంపెనీ డీయాక్టివేట్ చేయవచ్చు. అంతేకాకుండా SIM యాక్టీవ్ కాకముందే మీరు ఇన్‌కమింగ్ కాల్ సౌకర్యాన్ని కూడా పొందలేరు. మీరు ఎయిర్‌టెల్ నెంబర్ ని అనేక అవసరాల కోసం వినియోగించి ఉండవచ్చు కావున SIM యాక్టివ్‌లో లేకపోతే కనుక మీ యొక్క అన్ని రకాల సేవలు మిస్ అవ్వవచ్చు. అందువల్ల మీ ఎయిర్‌టెల్ SIMని యాక్టివ్‌గా ఉంచుకోవడానికి మీకు అందుబాటులో ఉండే ఎంపిక రూ.99 ధర వద్ద లభించే స్మార్ట్ ప్లాన్. ఈ ప్లాన్ సెకండరీ సిమ్ వినియోగదారుల కోసం మాత్రమే ప్రత్యేకంగా ఉద్దేశించబడింది. సరసమైన ధరల ఎంపికను కోరుకునే వ్యక్తుల కోసం ఇది ఉపయోగకరంగా ఉంటుంది అని గుర్తుంచుకోండి.

ఎయిర్‌టెల్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్‌లు

భారతదేశంలోని మారుమూల ప్రాంతాలలో అత్యంత సమర్థవంతమైన నెట్‌వర్క్‌లను కలిగిన ఎయిర్‌టెల్ టెల్కో కూడా అందుబాటు ధరలో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నది. ఈ టెల్కో చాలా ఖరీదైన ప్లాన్‌లను కలిగి ఉన్నప్పటికీ OTT సబ్‌స్క్రిప్షన్‌లతో కూడిన సరసమైన ప్లాన్‌లు రెండు ఉన్నాయి. ఈ జాబితాలోని మొదటి ప్లాన్ ఇన్ఫినిటీ ఫ్యామిలీ ప్లాన్ 499. ఇది రూ.499 ధర ట్యాగ్‌తో లభిస్తూ బెస్ట్ సెల్లర్‌గా ఉంది. ఇది 75GB నెలవారీ డేటాను మరియు లోకల్, STD మరియు రోమింగ్‌తో సహా అపరిమిత కాల్‌లను మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను పొందుతారు. ఇది కూడా ప్లాటినమ్ ప్యాక్ కాబట్టి వినియోగదారులు ఎయిర్‌టెల్ థాంక్స్ ప్లాటినమ్ రివార్డ్‌లకు యాక్సెస్ ను పొందుతారు. ఇందులో భాగంగా అదనపు ఖర్చు లేకుండా 1 సంవత్సరం పాటు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ మరియు Disney+ Hotstar VIP మెంబర్‌షిప్ ప్రయోజనం లభిస్తుంది. ఇతర ప్రయోజనాలలో Airtel X-stream App ప్రీమియం, Wynk ప్రీమియం మరియు మరిన్ని ఉన్నాయి.

ఎయిర్‌టెల్ DTH సేవలు

ఎయిర్‌టెల్ DTH సేవలు

భారతీయ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తన యొక్క వినియోగదారులకు HD-హై డెఫినిషన్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బేసిక్ మరియు అత్యంత ప్రీమియం ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం వంటి మూడు రకాల కనెక్షన్స్ మరియు సెట్-టాప్ బాక్స్‌లను అందిస్తుంది. ఈ సెట్-టాప్ బాక్స్‌లు వరుసగా రూ.1,300, రూ.2,499, రూ.4,798 ధరలను కలిగి ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Bharti Airtel Telco Most Affordable One Year Long Term Prepaid Plan: Here are Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X