ఎయిర్‌టెల్ మాత్రమే తన ప్లాన్‌లతో అందిస్తున్న ప్రత్యేక ప్రయోజనాలు!! ఇతర టెల్కోలు అందివ్వడం లేదు

|

భారతదేశంలోని రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన భారతి ఎయిర్‌టెల్ తన యొక్క వినియోగదారులకు గొప్ప ప్రయోజనాలను అందిస్తున్నది. దేశంలోని మిగిలిన టెల్కోలు వోడాఫోన్ ఐడియా(Vi), జియో మరియు BSNL లు ఏవీ కూడా తమ యొక్క ప్రీపెయిడ్ ప్లాన్‌లతో అందివ్వని ప్రయోజనాన్ని ఎయిర్‌టెల్ తన యొక్క యూసర్లకు అందిస్తోంది. అయితే ఎయిర్‌టెల్ సంస్థ కేవలం రెండు ప్లాన్‌లతో మాత్రమే ఈ ప్రత్యేక ప్రయోజనంను అందిస్తుంది. ఈ రెండు ప్లాన్‌లు రూ.699 మరియు రూ.999 ఖరీదైన కేటగిరీ స్పెక్ట్రమ్‌లో లభిస్తాయి. ఈ ప్లాన్‌లతో వినియోగదారులు అందుకునే గొప్ప ప్రయోజనాల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

భారతీ ఎయిర్‌టెల్ రూ. 699 ప్రీపెయిడ్ ప్లాన్

భారతీ ఎయిర్‌టెల్ రూ. 699 ప్రీపెయిడ్ ప్లాన్

భారతి ఎయిర్‌టెల్ రూ.699 ధర వద్ద అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌ యొక్క ప్రయోజనాలలో 3GB రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ మరియు రోజుకు 100 SMS లు 56 రోజుల చెల్లుబాటు కాలానికి పొందుతారు. కావున ఇది ఖచ్చితంగా స్వల్పకాలిక ప్లాన్ కాదు. ఈ ప్లాన్ అందించే ప్రత్యేక ప్రయోజనం విషయానికి వస్తే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇందులోAirtel Xstream మొబైల్ ప్యాక్, హెలోట్యూన్స్, ఫాస్ట్‌ట్యాగ్ క్యాష్‌బ్యాక్, షా అకాడమీ వంటి మరిన్నింటికి సబ్స్క్రిప్షన్ లకు ఉచిత యాక్సిస్ ని అందిస్తున్నాయి.

భారతీ ఎయిర్‌టెల్ రూ. 999 ప్రీపెయిడ్ ప్లాన్

భారతీ ఎయిర్‌టెల్ రూ. 999 ప్రీపెయిడ్ ప్లాన్

భారతీ ఎయిర్‌టెల్ యొక్క రూ.999 ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు 2.5GB రోజువారీ డేటాతో పాటు రోజుకు 100 SMS లు మరియు అపరిమిత వాయిస్ కాలింగ్‌ ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు 84 రోజుల చెల్లుబాటుతో అందించబడుతుంది. ఈ మీడియం-టర్మ్ ప్లాన్‌తో వినియోగదారులు Airtel Xstream మొబైల్ ప్యాక్, హెలోట్యూన్స్, ఫాస్ట్‌ట్యాగ్ క్యాష్‌బ్యాక్, షా అకాడమీ వంటి Airtel థాంక్స్ ప్రయోజనాలకు ఉచిత యాక్సెస్ పొందుతారు.

ఇతర టెల్కోలు

ఇండియాలోని ఇతర టెల్కోలు రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా మరియు BSNL తమ కస్టమర్‌లకు అందించని ప్రత్యేక ప్రయోజనం విషయానికి వస్తే కనుక అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ యొక్క ప్రత్యేక ప్రయోజనం. ఈ రెండు ప్లాన్‌లు వినియోగదారుల కోసం అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తాయి. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్ మరియు మరిన్ని వంటి అన్ని అమెజాన్ అప్లికేషన్‌లను యాక్సెస్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

అమెజాన్ ప్రైమ్

భారతీ ఎయిర్‌టెల్ రూ.699 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ యొక్క వాలిడిటీ 56 రోజులు కాగా రూ.999 ప్రీపెయిడ్ ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ వాలిడిటీ 84 రోజులకు ఉంటుంది. ఈ ప్లాన్ల యొక్క మొత్తం చెల్లుబాటుకు సమానంగా అమెజాన్ ప్రైమ్ యొక్క యాక్సిస్ కూడా ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వార్షిక సభ్యత్వం వినియోగదారులకు రూ.1,499 ధర వద్ద పొందవచ్చు. అలాగే నెలవారీ మరియు త్రైమాసిక సభ్యత్వాల కోసం వినియోగదారులు వరుసగా రూ.179 మరియు రూ.459 ధరలు చెల్లించాల్సి ఉంటుంది. నిజాయతీగా చెప్పాలంటే ఇతర ఆపరేటర్లు ఈ ధరల వద్ద అమెజాన్ ప్రైమ్ ని ఉచితంగా ఇవ్వకపోవడం వింతగా ఉంది.

Best Mobiles in India

English summary
Bharti Airtel Telco Only Offers This Benefit With Prepaid Plans That Jio, Vi and BSNL Don’t

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X