Home
News

Airtel ప్లాన్‌ల ధరలు 25% పెరగనున్నాయి!! కొత్త ధరలు ఇవిగో...

భారతదేశంలోని అతిపెద్ద టెలికాం దిగ్గజాలలో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ ఇప్పుడు తన యొక్క చాలా ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచింది. టెలికాం ఆపరేటర్ టారిఫ్డ్ వాయిస్ ప్లాన్‌లు, అపరిమిత వాయిస్ ప్లాన్‌లు మరియు డేటా టాప్-అప్‌లతో సహా వివిధ ప్రీపెయిడ్ ప్లాన్‌ల యొక్క ధరలను 25 శాతం వరకు పెంచింది. ఈ ప్లాన్‌ల మీద కొత్త ధరలు నవంబర్ 26, 2021 నుండి వర్తిస్తాయి. కాబట్టి వినియోగదారులు ఈ వారంలో ధరలు పెరగడానికి ముందు ఇప్పటికే ఉన్న ప్లాన్‌లతో తమ ఫోన్‌లను రీఛార్జ్ చేసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు ఉన్న ధరలతో రీఛార్జ్ చేయడానికి మీకు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఎయిర్‌టెల్ ధరల పెరుగుదల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ ధరలు పెంచేందుకు ప్లాన్ చేస్తోంది

ఎయిర్‌టెల్ ధరలు పెంచేందుకు ప్లాన్ చేస్తోంది

భారతీ ఎయిర్‌టెల్ టెల్కో తన యొక్క ఎంట్రీ-లెవల్ టారిఫ్డ్ వాయిస్ ప్లాన్‌ల ధరలను 25 శాతం పెంచుతుండగా, అపరిమిత వాయిస్ కాల్స్ బండిల్స్ ప్లాన్‌ల యొక్క ధరల మీద దాదాపు 20 శాతం వరకు పెంచుతున్నట్లు సమాచారం. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలు ఇప్పుడు వోడాఫోన్-ఐడియా మరియు రిలయన్స్ జియో సంస్థల యొక్క ప్లాన్‌లతో పోలిస్తే అధిక ధరలను కలిగి ఉన్నాయి. ఈ ధరల పెంపుతో టెల్కోకు ఒక్కో వినియోగదారుపై సగటు ఆదాయాన్ని (ARPU) రూ.200కి చేరుకోవడానికి సహాయపడుతుంది.

ఎయిర్‌టెల్

భారతీ ఎయిర్‌టెల్ సంస్థ తన యొక్క ప్లాన్‌ల ధరలను పెంచడంతో రాబోయే రోజుల్లో రిలయన్స్ జియో మరియు వొడాఫోన్-ఐడియా వంటి పోటీదారులు కూడా తమ యొక్క ప్లాన్ ధరలను కూడా త్వరలోనే పెంచుతారని ఆశించవచ్చు. ఎయిర్‌టెల్ ధరల పెంపు తర్వాత ఇప్పుడు రూ.79 ధర వద్ద లభించే బేస్ ప్లాన్ తరువాత రూ.99 నుండి ప్రారంభమవుతుంది. అలాగే అత్యంత ఖరీదైన రూ.2498 ప్లాన్ ధర రూ.2999కి పెరిగే అవకాశం ఎంతగానో ఉంది.

ఎయిర్‌టెల్ 3GB రోజువారీ డేటా ప్లాన్లు

ఎయిర్‌టెల్ 3GB రోజువారీ డేటా ప్లాన్లు

భారతి ఎయిర్‌టెల్ టెల్కో 3GB రోజువారీ డేటాను రూ.398, రూ.499, రూ.558 ధరల వద్ద లభించే అపరిమిత ప్లాన్లతో అందిస్తుంది. ఇవి వరుసగా 28 రోజుల, 28 రోజుల, 56 రోజుల వ్యాలిడిటీ కాలానికి లభిస్తాయి. ఇవి అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 100 SMS/రోజు ప్రయోజనంతో వస్తుంది. రూ.499 ప్లాన్ అదనంగా అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ మరియు మరో ఐదు యాప్‌ల ఉచిత ట్రయల్‌ను కూడా పొందుతారు. కస్టమర్‌లు ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫారమ్ విభాగంలో డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్‌ యాక్సిస్ తో పాటుగా అపోలో 24/7 సర్కిల్‌, వింక్ మ్యూజిక్‌ వంటి నాలుగు అదనపు సబ్‌స్క్రిప్షన్‌లకు ఉచిత ట్రయల్‌ యాక్సెస్ ను పొందుతారు.

Airtel ప్రీపెయిడ్ ప్లాన్‌ల కొత్త ధరలు:

Airtel ప్రీపెయిడ్ ప్లాన్‌ల కొత్త ధరలు:

** రూ.79 ప్లాన్ రూ.99కి పెంపు: రూ.99 విలువైన టాక్‌టైమ్ మరియు 200MB డేటాను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది.

** రూ.149 ప్లాన్ రూ.179కి పెంపు: 28 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు 2GB డేటాను అందిస్తుంది.

** రూ.219 ప్లాన్ రూ.265కి పెంపు: 28 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు రోజుకు 1GB డేటాను అందిస్తుంది.

** రూ.249 ప్లాన్ రూ.299కి పెంపు: 28 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది.

** రూ.298 ప్లాన్ రూ.359కి పెంపు: 28 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు రోజుకు 2GB డేటాను అందిస్తుంది.

** రూ.399 ప్లాన్ రూ.479కి పెంపు: 56 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది.

** రూ.449 ప్లాన్ రూ.549కి పెంపు: 56 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు రోజుకు 2GB డేటాను అందిస్తుంది.

** రూ.379 ప్లాన్ రూ.455కి పెంపు: 84 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు 6GB డేటాను అందిస్తుంది.

** రూ.598 ప్లాన్ రూ.719కి పెంపు: 84 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది.

** రూ.698 ప్లాన్ రూ.839కి పెంపు: 84 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు రోజుకు 2GB డేటాను అందిస్తుంది.

** రూ.1498 ప్లాన్ రూ.1799కి పెంపు: 365 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు 24GB డేటాను అందిస్తుంది.

** రూ.2498 ప్లాన్ రూ.2999కి పెంపు: 365 రోజుల వాలిడిటీలో అపరిమిత కాలింగ్, 100 SMS మరియు రోజుకు 2GB డేటాను అందిస్తుంది.

 

Airtel డేటా టాప్-అప్‌ల కొత్త ధరల వివరాలు

Airtel డేటా టాప్-అప్‌ల కొత్త ధరల వివరాలు

** రూ.48 ప్లాన్ రూ.58కి పెంపు: 3GB డేటాను ఆఫర్ చేస్తుంది.

** రూ.98 ప్లాన్ రూ.118కి పెంపు: 12GB డేటాను ఆఫర్ చేస్తుంది.

** రూ.251 ప్లాన్ రూ.301కి పెరిగింది: 50GB డేటాను ఆఫర్ చేస్తుంది.

 

Best Mobiles in India

English summary
Bharti Airtel Telco Plan to Increase Prepaid Plans Price Up to 25 Percent: You Should to Know Here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X