కేవలం రూ.3లకే 1GB డేటాను అందిస్తున్న ఎయిర్‌టెల్!! ఇతరుల కంటే చాలా బెటర్

|

ఇండియాలోని ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లలో ఒకటైన భారతి ఎయిర్‌టెల్ తన యొక్క సేవలతో భారతదేశపు అగ్రశ్రేణి టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో కంటే కొద్దిగా బిన్నంగా ఉంది. ఇందుకు కారణం ఈ టెలికాం సంస్థ తన ప్రీపెయిడ్ ప్లాన్లపై 'ప్రీమియం' వసూలు చేయడానికి ప్రసిద్ది చెందింది. ప్రీమియం సేవలను చెల్లించే మరియు నాణ్యమైన కస్టమర్లను కలిగి ఉండటానికి ఎయిర్‌టెల్ ప్రతి వినియోగదారులకు (ARPU) కస్టమర్లకు అధిక సగటు ఆదాయాన్ని జోడించడానికి ప్రయత్నిస్తుంది.

ప్రీపెయిడ్ ప్లాన్‌

సంబంధం లేకుండా ఈ టెల్కో ఎకనామిక్ ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. కావున వినియోగదారులు 1GB డేటాను సుమారు రూ.3 ధర వద్ద పొందుతారు. డేటా రేట్ల ప్రకారం ఇది ఎవరికైనా చాలా చౌకగా ఉంటుంది. ఎయిర్‌టెల్ సంస్థ యొక్క ఏ ప్లాన్ వినియోగదారులకు 1GB డేటాను రూ.3లకు అందిస్తుందో వంటి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

1GB డేటాను రూ.3 కి అందించే ఎయిర్‌టెల్ ప్లాన్‌లు

1GB డేటాను రూ.3 కి అందించే ఎయిర్‌టెల్ ప్లాన్‌లు

భారతి ఎయిర్‌టెల్ టెలికాం సంస్థ తన వినియోగదారులకు రూ.558 ధర వద్ద ఒక ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు 3GB రోజువారీ డేటాను అందించడంతో పాటుగా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలతో వస్తుంది. ఈ ప్లాన్ 56 రోజుల చెల్లుబాటు కాలానికి లభిస్తుంది. ఈ ప్లాన్ ను కొనుగోలు చేసిన వినియోగదారులు మొత్తం చెల్లుబాటు కాలానికి మొత్తంగా 168GB డేటాను అందుకుంటారు. అంటే ప్రతి 1GB డేటాను గరిష్టంగా రూ.3.32 మాత్రమే ఖర్చు అవుతుంది.

WhatsApp లో కొత్త ఫీచర్లు...! క్వాలిటీ తగ్గకుండా పెద్ద సైజు ఫోటోలు పంపవచ్చు.WhatsApp లో కొత్త ఫీచర్లు...! క్వాలిటీ తగ్గకుండా పెద్ద సైజు ఫోటోలు పంపవచ్చు.

డేటా

భారతదేశంలో అన్ని ప్రాంతాల వారికి లభించే డేటాలో ఇది ఉహించినంత చౌకగా ఉంటుంది. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇది రిలయన్స్ జియో, బిఎస్ఎన్ఎల్ కంటే కొంచెం ఖరీదైన ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందించడంలో ప్రసిద్ధి చెందిన భారతి ఎయిర్‌టెల్ తక్కువ ధరకు డేటాను అందించడం.

భారతి ఎయిర్‌టెల్

భారతి ఎయిర్‌టెల్ తన యొక్క ప్లాన్ తో పైన పేర్కొన్న డేటాతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, ఫ్రీ హెలొటూన్స్, వింక్ మ్యూజిక్, అపోలో 24/7 సర్కిల్, ఒక సంవత్సరం షా అకాడమీ ఉచిత కోర్స్ వంటి ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రయోజనాలను పొందటానికి వినియోగదారులు అర్హులు అవుతారు. ఇవే కాకుండా ఫాస్ట్ ట్యాగ్ లావాదేవీలపై రూ.100 క్యాష్‌బ్యాక్ ప్రయోజనం కూడా లభిస్తుంది.

షెల్ అవుట్

పైన తెలిపిన ఈ ప్లాన్‌కు వినియోగదారులు రూ.558 మొత్తాన్ని చెల్లించి 56 రోజులు చెల్లుబాటు కాలానికి మాత్రమే షెల్ అవుట్ చేయవలసి ఉన్నప్పటికీ ఈ ప్లాన్‌తో యూజర్ పొందుతున్న డేటా దాని కోసం కవర్ చేస్తుంది. డేటా ప్రయోజనంతో పాటుగా ఈ ప్లాన్ అందించే అదనపు ప్రయోజనాలు కూడా భారీ వ్యత్యాసాన్ని కలిగిస్తాయి.

రిలయన్స్ జియో

ఎయిర్‌టెల్ యొక్క ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాలు అగ్రశ్రేణి పోటీదారు రిలయన్స్ జియో యొక్క 56 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్‌తో పోలిస్తే జియో ప్లాన్ 3GB రోజువారీ డేటాను అందిస్తుంది. Jio వినియోగదారులు 28, 84 మరియు 365 రోజుల చెల్లుబాటుతో కూడా 3GB రోజువారీ డేటా ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. అలాగే Vi యొక్క రూ.601 ప్లాన్ 3GB రోజువారీ డేటాను 56 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఇది ఎయిర్‌టెల్ ప్లాన్ కంటే ఖరీదైనది. కానీ Vi వినియోగదారులకు బోనస్ డేటా మరియు ఒక సంవత్సరం డిస్నీ + హాట్‌స్టార్ VIP ప్రయోజనం కూడా అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Bharti Airtel Telco Provide 1GB Mobile Data Just Rs.3 Only: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X