జియోకు పోటీగా ఎయిర్టెల్ సరికొత్త రూ.597 ప్రీపెయిడ్ ప్లాన్
దేశీయ టెలికాం రంగంలో రోజురోజుకు టారిప్ వార్ మరింత పెరిగిపోతుంది . ముఖ్యంగా రిలయన్స్ జియోతో ఎయిర్టెల్ నువ్వా నేనా అంటూ పోటీ పడుతుంది .
దేశీయ టెలికాం రంగంలో రోజురోజుకు టారిప్ వార్ మరింత పెరిగిపోతుంది . ముఖ్యంగా రిలయన్స్ జియోతో ఎయిర్టెల్ నువ్వా నేనా అంటూ పోటీ పడుతుంది . జియోకి పోటీగా టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ సరి కొత్త ప్లాన్లను మార్కెట్ లోకి ప్రవేశపెడుతుంది.తాజాగా మరో కొత్త రూ.597 ప్లాన్‌ను ఎయిర్‌టెల్ లాంచ్ చేసింది. ఆఫర్ చేసిన ఈ ప్లాన్ కింద దీర్ఘకాలికంగా వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను ఎయిర్‌టెల్ అందిస్తోంది.అయితే ఈ ప్లాన్ కొన్ని రీజన్‌లలో ఎంపిక చేసిన సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

రూ.597 ప్లాన్....
ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ కింద ఎలాంటి రోజువారీ పరిమితులు లేకుండా 168 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 10 జీబీ డేటాను యూజర్లు పొందవచ్చు .

ఈ ప్లాన్ ఎంపిక చేసిన సబ్‌స్క్రైబర్లకు మాత్రమే...
అయితే ఎయిర్టెల్ అందిస్తున్నఈ రూ.597 ప్లాన్ కొన్ని రీజన్‌లలో ఎంపిక చేసిన సబ్‌స్క్రైబర్లకు మాత్రమే

తక్కువ డేటా వినియోగించే వారు....
ఈ ఉచిత డేటా వ్యాలిడిటీ ముగిసాక కస్టమర్లు డేటా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. తక్కువ డేటా వినియోగించే వారు, దీర్ఘకాలం వ్యాలిడిటీని కోరుకునే కస్టమర్లను ఉద్దేశించి తీసుకొచ్చిన ప్లాన్ గా ఇది అనిపిస్తుంది.

జియో vs ఎయిర్టెల్ ....
ఎయిర్‌టెల్ లాంచ్ చేసిన రూ.597 ప్లాన్, జియో రూ.999 రీఛార్జ్ ప్లాన్‌కు గట్టి పోటీను ఇస్తుంది .జియో రూ.999 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే ఎలాంటి రోజువారీ పరిమితులు లేకుండా 90 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు,నెలకు 60 జీబీ డేటాను యూజర్లు పొందవచ్చు.

ఎయిర్టెల్ రూ.995 ప్లాన్...
ఎయిర్‌టెల్ గతంలో అపరిమిత వాయిస్ కాల్స్‌తో రూ.995 రీఛార్జ్ ప్లాన్‌ను లాంచ్‌చేసింది.రూ.995 ప్లాన్ లో భాగంగా అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, నెలకు 1జీబీ డేటాను 180 రోజుల పాటు అందిస్తోంది.


Click it and Unblock the Notifications








